మెడికల్ వెంటిలేటర్https://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%86%E0%B0%A1%E0%B0%BF%E0%B0%95%E0%B0%B2%E0%B1%8D_%E0%B0%B5%E0%B1%86%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF%E0%B0%B2%E0%B1%87%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8Dమెడికల్ వెంటిలేటర్ లేదా వెంటిలేటర్ అనగా శ్వాస, లేదా కావలసినంత శ్వాస తీసుకోలేకపోతున్న రోగికి శ్వాస నందించుటకు శ్వాసక్రియ గాలిని ఊపిరితిత్తుల లోనికి, బయటికి కదిలించేలా రూపొందించిన యాంత్రిక వెంటిలేటర్.మెడికల వెంటిలేటర్లను కొన్నిసార్లు వ్యావహారికంగా "రేస్పిరేటర్లు" అంటారు ఈ పదం 1950 లో సాధారణంగా ఉపయోగించే పరికరాల నుండి తీసుకోబడింది (ముఖ్యంగా "బర్డ్ రేస్పిరేటర్").మెకానికల్ వెంటిలేటర్ ఊపిరి పీల్చుకోవడం లేదా రక్తంలో తగినంత ఆక్సిజన్ పొందడం చాలా కష్టమైతే ఈ వెంటిలేటర్ మీద ఉంచవచ్చు.ఈ పరిస్థితిని శ్వాసకోశ వైఫల్యం అంటారు.మెకానికల్ వెంటిలేటర్లు ఊపిరితిత్తులలోనికి , వెలుపల గాలిని తరలించడానికి పనిచేసే యంత్రాలు.వైద్యుడు ఊపిరితిత్తులలోకి ఎంత తరచుగా గాలి బయటకు వెళుతుంది ,ఎంత గాలి వస్తుందో నియంత్రించడానికి వెంటిలేటర్‌ను అమరుస్తారు శ్వాస సమస్య మరింత తీవ్రంగా ఉంటే మీకు శ్వాస గొట్టం అవసరం కావచ్చు.మెకానికల్ వెంటిలేటర్లను ప్రధానంగా ఆసుపత్రులలో, అంబులెన్సులు, వాయు రవాణా వంటి రవాణా వ్యవస్థలలో ఉపయోగిస్తారు.అవసర మైతే ఇంట్లో వాడవచ్చును , దీనికి సరైన శిక్షణ అవసరం , వెంటిలేటర్‌లో ఇంటిలో ఉండటం వల్ల న్యుమోనియా లేదా ఇతర సమస్యలకు ఎక్కువ అవకాశం ఉంది .వెంటిలేటర్ అవసరం అత్యవసర సమయములలో అంటే ఊపిరి ఆడక ఉంటే వెంటిలేటర్ పెడతారు .వెంటిలేటర్ ఊపిరితిత్తులలోకి గాలిని , అదనపు ఆక్సిజన్‌తో గాలిని దడానికి ఒత్తిడిని ఉపయోగిస్తుంది.వెంటిలేటర్‌ను నిమిషానికి ఎన్నిసార్లు " ఊపిరి " చేయడానికి అమర్చబడి ఉంటుంది, తద్వారా మీకు అవసరమైనప్పుడు యంత్రం ఊపిరితిత్తులలోకి గాలిని వీస్తుంది.ఊపిరితిత్తులలోకి వెంటిలేటర్ నుండి గాలిని పొందడానికి రెండు మార్గాలు ఉన్నాయి అవి ఒకటి ముసుగు, రెండవది శ్వాస గొట్టం.పిల్లలు, పెద్దలు అనారోగ్యం సమస్య నుండి కోలుకునేటప్పుడు కొద్దిసేపు వెంటిలేటర్ అవసరం కావచ్చు.అందులో కొన్నిశస్త్రచికిత్స సమయంలో,అనస్థీషియాలో ఉన్నప్పుడు, కొన్నిసార్లు ప్రజలకు శస్త్రచికిత్స తర్వాత గంటలు లేదా రోజులు కూడా ఊపిరి పీల్చుకోవడానికి వెంటిలేటర్ అవసరం.ఊపిరితిత్తుల వ్యాధి, శ్వాస తీసుకోవడం కష్టం గా ఉంటే వెంటిలేటర్ సహాయపడుతుంది.వెంటిలేటర్ ఈ ఆరోగ్య సమస్యలకు అవసరం ఉంటుంది, అవి అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ (ALS), కోమా , స్పృహ కోల్పోవడం,మెదడు కు గాయం,దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD),న్యుమోనియా,పోలియో,ఊపిరితిత్తుల అభివృద్ధి (శిశువులలో), ఇవి గాక మనిషి అవసరం ఉంటే వైద్యుల సూచన మేరకు వెంటిలెటర్ మనిషికి పెడతారు.వెంటిలేటర్ల తో మహమ్మారి COVID-19 తో బాధపడుతున్న రోగులపై వెంటిలేటర్ల సహాయముతో వైద్యులు ప్రపంచములో ఎంతో మంది ప్రజలను ప్రాణాల నుంచి కాపాడగలిగారు