145.txt 2.94 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
శవ పరీక్ష

https://te.wikipedia.org/wiki/%E0%B0%B6%E0%B0%B5_%E0%B0%AA%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7

మనిషి చనిపోయిన కారణాన్ని, చనిపోయిన విధానాన్ని విశ్లేషించడానికి ప్రత్యేకమైన నిపుణత కలిగిన వైద్యుల చేత శవానికి చేయబడే పరీక్షని శవ పరీక్ష (autopsy) అంటారు.
శవ పరీక్షని మామూలుగా పాథాలజిస్టు అను వైద్యుని చేత చేయించుదురు.శవ పరీక్షని న్యాయ పరమైన కారణాల చేత కాని వైద్య పరమైన కారణాల చేత కాని చేయవచ్చు.
నేర సంభధమైన విషయాల కోసం forensic autopsy ని నిర్వహించుదురు.clinical/academic autopsy ని వైద్య కారణాల కొరకు చేయుదురు.
శవ పరీక్షని కొన్నిసార్లు బాహ్యంగా మాత్రమే పరీక్షించి చేయగా కొన్నిసార్లు మాత్రం శరీరాన్ని 
కోసి అంతర అవయవాలని పరీక్షించవలసి వస్తుంది.
శరీరాన్ని కోసి పరీక్షించేందుకు కొన్నిసార్లు ఆ శవానికి రక్తసంభందీకుల అనుమతి తీసుకొనవలసి వస్తుంది.
చనిపోయిన కారణము, చనిపోయినపుడు మనిషి ఆరోగ్య స్థితి, చనిపోవుటకు ముందు ఏదైనా వైద్య చికిత్స జరిగిందా అను విషయాలను విశ్లేషించుటకు శవ పరీక్ష నిర్వహించుదురు.
ఒక వ్యక్తి అనుమతి మేరకు ఆ వ్యక్తి  చనిపోయిన తరువాత బోధనా ప్రక్రియల కొరకు లేదా పరిశోధనల నిమిత్తం శవ పరీక్ష నిర్వహించవచ్చు.
ఈ మధ్య కాలంలో చాలా మటుకు అనుమానాస్పద మరణాలను వారి బంధువర్గం దాచడం వల్ల వాటికి శవ పరీక్ష చేయకుండానే దహన/ఖనన సంస్కారాలను జరిపించడం వల్ల ఆ చావు లకు గల కారణాలను తెలుసుకొనలేక పోతున్నారు.