152.txt 5.04 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38
ఆయాసం

https://te.wikipedia.org/wiki/%E0%B0%86%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B8%E0%B0%82

ఊపిరి అందకపోవడాన్ని ఆయాసము (Shortness of Breath or Dyspnea or Air Hunger) అంటారు.
ఇదొక వ్యాధి లక్షణం.
ఇది చాలా శారీరకమైన ముఖ్యంగా శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులలో కనిపిస్తుంది.
ఇది ఏదైన పని లేదా వ్యాయామం చేసినప్పుడు అధికమౌతుంది.
ఆయాసం(డిస్ప్నియా)అనేది ఊపిరిరి ఆడటానికి వైద్య పదం, కొన్నిసార్లు దీనిని "గాలి ఆకలి" గా అని అంటారు.
శ్వాస ఆడకపోవడం తేలికపాటి, తాత్కాలిక నుండి మొదలై  ఎల్లప్పటికీ( ధీర్ఘకాలము) మనుషులలో   ఉంటుంది.
డిస్ప్నియాను నిర్ధారించడం, చికిత్స చేయడం కొన్నిసార్లు కష్టం, ఎందుకంటే దీనికి అనేక కారణాలు ఉండవచ్చు.ఇది ఒక సాధారణ సమస్య.
క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ప్రకారం, వైద్యుడిని సందర్శించే ప్రతి 4  వ్యక్తులలో 1 మందికి డిస్ప్నియా ( ఆయాసము ) ఉంటుంది     .
ఆయాసము ఉండుటకు లక్షణములు
శ్రమ తర్వాత కారణంగా శ్వాస ఆడకపోవడం
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడటం,
శ్రమతో కూడిన శ్వాస
ఛాతీలో బిగుతు ( చాతి బిగ్గరగా ఉండటం )
వేగవంతమైన, నిస్సార శ్వాస 
గుండె దడ
శ్వాసలోపం
దగ్గు
పై లక్షణాలు తీవ్రంగా ఉంటే,  తొందరలో మనిషికి వైద్యం అవసరం లేకుంటే మనిషి చనిపోవడానికి కుడా అవకాశం ఎక్కువ .
ఆయాసం వ్యాధికి చికిత్స  అంటే సాధారణంగా దాని మూలకారణానికి చికిత్స చేయడం  .
ఆహారం, వ్యాయామం ఊబకాయం , ఆరోగ్యకరమైన ఆహరం , వ్యాయామం ,  COPD ,ఊ పిరితిత్తుల సమస్యలు ,శ్వాసకోశ వ్యవస్థ యొక్క ఆరోగ్యం,  గుండె సంబంధిత కారణాలను   పై  ప్రజలు అవగాహన పెంచుకొని పైన తెలిపిన డాక్టర్లను సంపద్రించి మనుషులు తమ ఆరోగ్యమును కాపాడుకొనవచ్చును .
నివారణ  అజీర్తిని నివారించడం,శ్వాస ఆడకపోవటానికి అత్యంత  ప్రమాద కారణం ధూమపానం.వాయు కాలుష్యం, వాయు రసాయనాలు కూడా శ్వాస సమస్యలకు దారితీస్తాయి.
కాబట్టి మీరు గాలి నాణ్యత లేని వాతావరణంలో పనిచేస్తుంటే, తగిన రక్షణ పరికరములతో  రక్షణ పొందటం , పనిచేసే  కార్యాలయం గాలి  ప్రదేశములో  ఉండటం  వీటితో కొంత  మనుసులు  తమ ఆరోగ్యం కాపాడుకొన వచ్చును .
కోవిద్ 2019 వ్యాధిలో  ఊపిరి ఆడక పోవడంను వైద్యులు ఒక ప్రధాన లక్షణం గా తెలిపినారు  
ఆస్తమా లేదా ఉబ్బసం
న్యుమోనియా
ఫ్లూ, స్వైన్ ఫ్లూ
క్షయ
రక్త హీనత
గుండె పోటు
గుండె వైఫల్యం
హృదయావరణంలో నీరు లేదా రక్తం చేరడం
సిలికోసిస్ వంటి వృత్తి సంబంధిత వ్యాధులు
స్థూలకాయం
జలోదరం