నాడి పరీక్షhttps://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A1%E0%B0%BF_%E0%B0%AA%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7నాడి పరీక్ష అనునది ప్రాచీన భారతీయ పరీక్షావిధానం.ఇది ఆయుర్వేదం లోని అష్టస్థాన పరీక్షలలోని ఒక పరీక్ష విధానం.ఆయుర్వేదంలో ఎప్పుడూ కూడా రోగ నిర్ధారణ వైద్యుడు రోగిని పూర్తిగా పరశీలించిన తర్వాత జరుగుతుంది.వైద్యుడు రోగి యొక్క అంతర్గత భౌతిక, శారీరక లక్షణాలను, మానసిక స్థితి, స్వభావాలను శ్రధ్ధగా గుర్తిస్తాడు.రోగికి సంబంధించిన ఇతర అంశాలను, అంటే శరీరంలో ప్రభావితం కాబడిన ధాతువులు, కణజాలం, రసాలు, రోగం కేంద్రీకృతమైన ఉన్న చోటు, రోగి నిగ్రహం, తట్టకోగలిగే శక్తి, అతని దినచర్య, ఆహారపు అలవాట్లు, చికిత్సా సంబంధిత పరిస్ధితుల ప్రాధాన్యత వల్ల కలిగే ప్రభావం, జీర్ణం చేసుకోగలిగే పరిస్ధితులు, రోగి యొక్క వ్యక్తిగత, సాంఘిక, ఆర్థిక, పర్యావరణ సంబంధిత పరిస్థితి అనే అంశాలను కూడా అధ్యయనం చేస్తాడు.రోగ నిర్ధారణ ఈ క్రింది పరీక్షలతో సహా కలిసి ఉంటుంది.సాధారణ శారీరక పరీక్షనాడి పరీక్షమూత్ర పరీక్షమల పరీక్షనాలుక, కళ్ల పరీక్షచర్మం, చెవుల పరీక్ష, స్పర్శ, వినికిడి సంబంధిత పరీక్షవాత, పిత్త, కఫము అను మూడు ముఖ్య అంశాలు ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి.నాడీ పరీక్షలో ఈ మూడింటిని గమనించడం జరుగుతుంది.ఈ పరీక్షని ఉదయం స్నానం చేయకముందు చేయవలసి ఉంటుంది.ఆడవారికి ఎడమచేతిని, మగవారికి కుడిచేతిని పరీక్షించవలసి ఉంటుంది.వాటిక - పాము వంటి కదలిక.నాడి వేగంగా ఉండాలిలీచ్ -పైత్తిక - కప్ప వలె గెంతు నాడికఫజ -సన్నిపత్తిక -ఈ వైద్య ప్రక్రియను ఈజిప్టు, సిరియా, ఇరాక్, పర్షియా, భారత్, చైనా దేశాల్లోని మేధావులు తమ ప్రక్రియలు జోడించి మరింత సుసంపన్నం చేసాక, అరబ్బులు ప్రత్యేకంగా దీన్ని అభివృద్ధి చేసారు.అందువల్ల దీన్ని గ్రీకో-అరబ్ మెడిసిన్ అంటారు.ఈవైద్య ప్రక్రియ భారత్ కు వచ్చాక ఇక్కడి రాజవంశస్తులు అయిన ఖిల్జీలు, తుగ్లక్‌లు, మొఘల్ చక్రవర్తులూ ఆదరించారు.రాజ వంశాల ఆదరణతో 17 వ శతాబ్దం వరకూ యునానీ వైద్యం అభివృద్ధి చెందినా, బ్రిటిష్ వారి పాలనలో దీనికి పూర్తిగా ఆదరణ తక్కువయింది.యునానీ వైద్యంలో ప్రధానంగా నాడీ (నబ్జ్) చూసి వ్యాధి నిర్ధారణ చేస్తారు.ఆ తరువాత మూత్ర పరీక్ష (బవుల్), మల పరీక్ష (బరాజ్).రకరకాలైన యంత్ర పరీక్షలు లేకుండా కేవలం నాడీ, మూత్ర, మల పరీక్షల ఆధారంగా వ్యాధి నిర్ధారణ చేస్తారు.యునానీ