నోటి దుర్వాసనhttps://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B1%8B%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8మనం తినే పదార్ధాల వాసనల ప్రభావం మనం విడిచే గాలి మీద కూడా ఉంటుంది.ముఖ్యంగా ఉల్లి, వెల్లుల్లి వంటి ఘాటైన వాసన పదార్ధాల విషయంలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.మనం తిన్న ఆహార పదార్థాలు జీర్ణమైన తర్వాత రక్తప్రసరణ వ్యవస్థలో కలిసిపోతాయి.అయినా ఆయా పదార్ధాల తాలూకూ వాసనలు పూర్తిగా పోవు.అక్కడి నుంచి ఆ రక్తం ఊపిరి తిత్తుల్లోకి వెళ్తుంది.అందుకే మనం శ్వాస విడిచిపెట్టినప్పుడు.. మనం ఎప్పుడో తిన్న పదార్ధాల వాసన బయటకు వస్తుంటుంది.మన శరీరం ఆ ఆహారాన్ని పూర్తిగా బయటకు విసర్జించేంత వరకూ కూడా ఏదో రూపంలో ఆ వాసన వెలువడుతూనే ఉంటుంది.అన్నాశయం లోని పూర్తిగా జీర్ణం కాని ఆహారం కొంత కాలం తర్వాత కుళ్లిపోయి దుర్వాసన కల వాయువులను ఏర్పరుస్తుంది.ఇవి నోటినుండి బయటకు వదలబడుతాయి.గొంతు నందలి ఇన్ఫెక్షన్, పళ్ళ యందలి వాపు కారణంగా ఎర్పడిన చీము, రక్తము అక్కడ నిలిచి, కుళ్ళి ధుర్గంధమైన వాసనను కలిగించును.చిగుళ్ల వ్యాధులు, దంతాల మధ్య పాచిపేరుకోవటం వంటివి కూడా ముఖ్యకారణాలే.దీనికి ఇది కేవలం బ్రష్ చేసుకోవటం, మౌత్‌వాష్‌ల వంటివి వాడటంతో తగ్గిపోయే సమస్య కాదు.ఇలాంటి సమస్య ఉన్నట్లు గుర్తించిన వెంటనే దంతవైద్యులను సంప్రదిస్తే తగిన కారణాలను అన్వేషిస్తారు.నోటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవటం, చిగుళ్ల సమస్యల్ని తగ్గించుకోవటం, దంతాలు శుభ్రం చేయించుకోవటం, అవసరమైతే ఆహారపుటలవాట్లలో మార్పులు చేసుకోవటం వంటివన్నీ తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.