పరీక్షhttps://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7పరీక్ష (Examination) అనగా ఒక వ్యక్తిని లేదా ఏదైనా పదార్ధాన్ని నిశితంగా పరిశీలించడం.విద్యా విధానంలో పరీక్షలను విద్యార్థుల జ్ఞానాన్ని పరిశీలించడానికి ఉపయోగిస్తారు.ఇలాంటి పరీక్షలలో కొన్ని వ్రాతపూర్వకంగా ఉంటే వాటిని వ్రాత పరీక్షలు అంటారు.మరికొన్ని ప్రాక్టికల్ గా ప్రయోగాల్ని నిర్వహించాల్సి వస్తే వాటిని ప్రాక్టికల్ పరీక్షలు అంటారు.ఇలాంటి విధానంలో విద్యార్థులు పరీక్షల అనంతరం డిగ్రీ లేదా డిప్లొమా లేదా ధృవీకరణ పత్రం అందజేస్తారు.పరిమితంగా విద్యావకాశాలున్నప్పుడు విద్యార్థుల్ని వృత్తి విద్యా కోర్సుల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించి ఉన్నత శ్రేణి విద్యార్థుల్ని మాత్రమే తీసుకుంటారు.వైద్య శాస్త్రంలో రోగిని పలు రకాలుగా పరీక్షించి వ్యాధిని నిర్ణయిస్తారు.పల్స్, రక్తపోటు మొదలైనవి, మూత్ర పరీక్షలు, ఎండోస్కోపీ మొదలైన చాలా రకాల వైద్య పరీక్షలు నేడు ఉపయోగంలో ఉన్నాయి.న్యాయ శాస్త్రంలో నిందితున్ని న్యాయవాదులు చాలా రకాలుగా పరీక్షించి, అతడు నేరం చేసింది లేనిదీ తెలుసుకుంటారు.వైద్య పరీక్ష (Medical Examination)ఇన్స్పెక్షన్ (Inspection)పాల్పేషన్ (Palpation)పెర్కషన్ (Percussion)ఆస్కల్టేషన్ (Auscultation)రక్త పరీక్షలు (Blood test)మూత్ర పరీక్షలు (Urine examination)రేడియాలజీ పరీక్షలు (Radiological tests)ఎండోస్కోపీ (Endoscopy)స్కానింగ్ పరీక్షలు (Scanning)ప్రవేశ పరీక్ష (Entrance Examination)ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్ష (EAMCET)న్యాయ ప్రవేశ పరీక్ష (LAWCET)విద్యా ప్రవేశ పరీక్ష (EdCET)శీల పరీక్ష (Virginity test) : ఒక స్త్రీ కన్నెరికాన్ని పోగొట్టుకున్నదీ లేనిదీ తెలియజేసే వైద్య పరీక్ష.ఇందులో వైద్యులు స్త్రీ యొక్క యోనికి ఉన్న కన్నెపొరను పరీక్షించి ఆమె శీలవతా కాదా అని నిర్ధారిస్తారు.శవ పరీక్ష (Autopsy) : మనిషి చనిపోయిన కారణాన్ని, చనిపోయిన విధానాన్ని విశ్లేషించడానికి ప్రత్యేకమైన నిపుణత కలిగిన వైద్యుల చేత శవానికి చేయబడే పరీక్ష.