192.txt 29.5 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161
ఆక్యుప్రెషర్

https://te.wikipedia.org/wiki/%E0%B0%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B7%E0%B0%B0%E0%B1%8D

ఎటువంటి మందుల్లేకుండా నిర్వహించే వైద్యవిధానాలు ఇటీవల కాలంలో మంచి ప్రజాదరణ పొందుతున్నాయి.
ఇటువంటి వాటిలో ఆక్యుప్రెషర్‌, రేకీలు నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.
ప్రత్యామ్నాయ వైద్యములో రిఫ్లెక్సాలజీ అనేది ఒక ప్రాచీన రూపము .
ఆక్యుప్రజర్, ఆయుర్వేద మర్దనల మాదిరిగా పోలిఉండే రిప్లెక్షాలజీని కొందరు పిలిచే ఆక్యుప్రెషర్‌ చికిత్స.. క్రీ.పూ.
5000 సంవత్సరాల కాలంలో మన దేశంలోనే ప్రారంభం కావడం విశేషం.
ఆ కాలంలో ఋషులు, మహామునులు ఈ వైద్యం ద్వారా రోగాలను నయం చేసినట్టు చారిత్రక ఆధారాలు కూడా ఉండడం విశేషం.
అరిచేతులు, అరికాళ్లలో శరీరంలోని వివిధ అవయవాలకు సంబంధించినటువంటి పాయింట్స్‌ ఉంటాయి.
వీటిని యాక్టివేట్‌ చేయడం ద్వారా రిప్లెక్షాలజీలో చికిత్సలను నిర్వహిస్తారు.
నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పులకు సంబంధించిన సమస్యలు ఈ వైద్యంతో పూర్తిగా నయమవుతాయని ఆక్యుప్రెషర్‌ /రిప్లెక్షాలజీ థెరపిస్ట్‌లు డాక్టర్‌ కె.నారాయణ, డాక్టర్‌ శ్రీనివాస్‌లు తెలిపారు.
ఇవేగాకుండా ఐటి ఉద్యోగులకు స్పాండిలైటిస్‌ (మెడ, భుజాల నొప్పులు), నడుము నొప్పి, నిద్ర ఉండకపోవడం వంటి వాటిని ఈ చికిత్స ద్వారా పూర్తిగా నయం చేయవచ్చన్నారు.
ఉదా: ఆక్యుప్రెజర్/రిప్లెక్షాలజీ పద్ధతితో ఒక బొటనవేలును మరో బొటనవేలుతో నెమ్మదిగా ఒత్తటంవల్ల మెదడు ఉత్తేజితమై ఏకాగ్రత పెరుగుతుంది.
ఎక్కువసేపు చదువుకునేవాళ్లు మధ్యమధ్యలో ఇలా చేయటం మంచిది.
ఆక్యుప్రెషర్‌/రిప్లెక్షాలజీ ద్వారా గుండెజబ్బులు, ఆస్తమా, కిడ్నీ దెబ్బతినడం వంటి వ్యాధులకు చికిత్సలతో పాటు ఆడవారికి సంబంధించిన గైనిక్‌ సమస్యలను సైతం నయం చేయవచ్చు.
నేడు ఈ వైద్య విధానం చైనా, జపాన్‌, థాయిలాండ్‌ తదితర దేశాల్లో విశేష ప్రాచర్యాన్ని పొందింది.
మన శరీరంలోని ప్రతి అవయవమూ కండరాలు, నాడీ వ్యవస్థలతో పనిచేస్తుందనే సంగతి విదితమే.
ఒక్కో శరీర భాగానికి సంబంధించి ఒక్కోచోట నాడులు కేంద్రీకృతమై వుంటాయి.
ఆక్యుప్రెషర్‌తో దాదాపు 3000 సమస్యలకు చికిత్స దొరుకుతుంది.
ఆక్యుప్రెషర్‌తో శరీరంలో శక్తి ప్రవహించే మార్గాలలోని కొన్ని కేంద్రాలను ఒత్తిడి ద్వారా ఉత్తేజితం చేయవచ్చు.
మన శరీరంలోని వివిధ అవయవాలతో అనుసంధానమయ్యే మెరీడియన్లు 14 ఉంటాయి.
ఈ మెరీడియన్ల ద్వారా శక్తి సమతులంగా, సమంగా ప్రవహించినప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం.
మనకు ఏదైన అనారోగ్యం లేదా నొప్పి వచ్చిందంటే ఈ శక్తి ప్రవాహంలో ఏదో సమస్య ఏర్పడినట్టే.
మనకు సమస్యను బట్టి వాటికీ సంబంధించిన పాయింట్లలో ఒత్తిడి కలిగిస్తారు.
దీని వలన మన శరీరంలో శక్తి ప్రవాహం సవ్యంగా జరిగి ఆ సమస్య నుండి ఉపశమనం పోందుతాము.
వాటిపై ఒత్తిడి కలిగించి ప్రేరణ కలిగించి నట్లయితే ఆయా భాగాల్లో ఏర్పడిన లోపాలు సవరించబడి సక్రమంగా పనిచేస్తాయి.
ఈ సనూత్రం ఆధారంగా కనిపెట్టిన చికిత్సావిధానమే రిఫ్లెక్సాలజీ.
శారీరకంగా అలసిపోతున్నారా?
మానసికంగా ఆందోళన చెందుతున్నారా?
రక్తపోటు, తలనొప్పి లాంటి రుగ్మతలు పీడిస్తున్నాయా?
టెన్షన్‌కు గురవుతున్నారా?
జ్ఞాపకశక్తి తగ్గిపోతోందా?
ఇవన్నీ చిరాకుపెట్టే అంశాలే.
బాధించే లక్షణాలే.
స్థిమితం లేకుండా చేసి అనుక్షణం వేధించే భూతాలే.
కానీ, ఇకపై ఇలాంటి సివ్టుమ్స్‌కు ఎంతమాత్రం చింతించాల్సిన అవసరం లేదు.
వీటిని తరిమికొట్టే రిఫ్లెక్సాలజీ చికిత్స అమెరికా, బ్రిటన్‌ లాంటి అనేక దేశాల్లో ఎందరో చేయించుకుంటున్నారు.
సత్వర ఫలితం కనిపించడంతో అనేకమంది ఈ రకమైన చికిత్స చేయించుకునేం దుకు ముందుకొస్తున్నారు.
త్వరలో మనదేశంలోనూ అమలుచేసే అవకాశాలు ఉన్నాయి.
ఇంతకీ రిఫ్లెక్సాలజీ చికిత్స ఎలా చేస్తారో, దానివల్ల ఎంతటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
పోటీ ప్రపంచంలో రోజురోజుకీ వత్తిడి పెరుగు తోంది.
ఆందోళన కారణంగా నిద్రలేమి, జ్ఞాపకశక్తి తగ్గడం, ఇతరత్రా అనేక శారీరక, మానసిక జబ్బులు వస్తున్నాయి.
ఇది నానాటికీ విస్తరిస్తోంది.
ఎందరో ఈ రకమైన లక్షణాలతో ఇబ్బంది పడ్తున్నారు.
చదువు, ఉద్యోగాల వేటలో ఉరుకులు, పరుగులు.. కెరీర్‌ డెవలప్‌మెంట్‌లో భాగంగా మరింత వత్తిడి.
ఇల్లు, పెళ్ళి లాంటి అంశాల్లో మరో రకమైన అలసట.
వెరసి జీవితమే ఒక పరుగు పందెం.
ఒక రేస్‌ తర్వాత మరో రేస్‌.
నిరంతరం గెలుపు దిశగా పరుగులెత్తడం.
వత్తిడితో కూడిన విజయాలు, విషాదంతో కూడిన పరాజయాలు.
ఈ మితిమీరిన వత్తిడి మానసిక ఆందోళనకు కారణమౌతోంది.
అందుకే పెరిగిన పోటీలాగే జబ్బులూ పెరిగాయి.
దాంతో ముఖంలో కాంతి పోవడం, కంటి కింద నల్లటి వలయాలు, కళ్ళలో కాంతి కరువవడం లాంటివి పైకి కనిపించే లక్షణాలు.
కాగా, గుండె దడదడలాడటం, ఆకలి మందగించడం, నిద్రలేమి, అంతూఅదుపూ లేని ఆలోచనలు, అస్థిమితం, ఆందోళన లాంటివి ఇబ్బంది పెట్టే కొన్ని లక్షణాలు ‌.
ఇదొకరకమైన మసాజ్‌ లాంటిది.
పాదాలు, చేతులు లాంటి శరీర భాగాలను.. మర్దనతో పాటు ఆక్యుపంచర్‌ను జతకలుపుతారు.
వేళ్ళతో నొక్కడంవల్ల రక్తప్రసరణ, నాడీ వ్యవస్థలను పునరుద్ధరిస్తారు.
లేనిపక్షంలో శరీరంలోని కొన్ని కొన్ని ప్రాంతాల్లో కణాలు గూడుకట్టుకుని చిన్ని చిన్ని గింజల్లా లేదా కణుపుల్లా తయారౌతాయి.
రిఫ్లెక్సాలజీ ప్రక్రియ ద్వారా అలాంటి భాగాలను బాగా మర్దన చేసి తొలగించగల్గుతారు.
దాంతో మెదడులోని కండరాలు శక్తివంతంగా పనిచేస్తాయి.
ఆక్యుప్రెషర్‌ సాయంతో ఆక్యుపంచర్‌ కేంద్రాలను ప్రేరేపించినట్లవు తుంది.
మొద్దబారిన భాగాలు తిరిగి చురుగ్గా పనిచేస్తాయి.
శరీరము, మెదడు కూడా ఉపశమనం పొంది సక్రమంగా పనిచేస్తాయి.
ముఖ్యంగా కాస్మొటాలజీలో ముఖాన్ని మునివేళ్ళతో నొక్కుతూ కండరాలను ప్రేరేపిస్తారు.
ఫేషియల్‌ రిఫ్లెక్సాలజీ మరింత ప్రయోజనకరంగా ఉంది.
రిఫ్లెక్సాలజీ చికిత్సకు క్రీములు, లోషన్లు లాంటి ఏ మందులతో పనిలేదు.
కానీ, దివ్య ఔషధంలా పనిచేస్తుంది.
పాదాలు, చేతులు, చెవులు, బొటలవేలు, ఇతర వేళ్ళపై ఆక్యుప్రెషర్‌ను పంపుతారు.
అవసరమైన భాగాల్లో మునివేళ్ళతో చక్కగా మర్దన చేస్తారు.
దీనికి నూనెలు కానీ ఏ రకమైన ద్రవాలు కానీ ఉపయోగించనక్కర్లేదు.
ఒక సంవత్సరకాలంగా ఈ చికిత్స విస్తృత ఆదరణ పొందింది.
కొన్ని కొన్ని మెడిసిన్లవల్ల జబ్బులు నయమైనప్పటికీ చాలాసార్లు వెంటనే రియాక్షన్‌ రావడం లేదా దీర్ఘకాలంలో సైడ్‌ ఎఫెక్ట్స్‌ వుండటం చూస్తుం టాం.
కానీ, రిఫ్లెక్సాలజీవల్ల అలాంటి కష్టనష్టాలేమీ వాటిల్లే అవకాశం లేదు.
ఇది బిగుసు కున్న కండరాలను సహజస్థితికి తెస్తుంది.
రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేసి, నాడీవ్యవస్థను క్రమబద్ధం చేస్తుంది.
టెన్షన్ను తగ్గిస్తుంది.
ఏ రకమైన మెడిసిన్లు వాడకుండానే సహజసిద్ధంగా పనిచేసి శరీరం చురుగ్గా పనిచేసేట్లు ప్రేరేపిస్తుంది.
రిఫ్లెక్సాలజీకి సంబంధించి నియ మాలు, నిబంధనలు అంటూ ఏమీ లేవు.
మన శరీరంలోని ప్రతి అవయవమూ కండరాలు, నాడీ వ్యవస్థలతో పనిచేస్తుందనే సంగతి విదితమే.
ఒక్కో శరీర భాగానికి సంబంధించి ఒక్కోచోట నాడులు కేంద్రీకృతమై వుంటాయి.
వాటిపై ఒత్తిడి కలిగించి ప్రేరణ కలిగించి నట్లయితే ఆయా భాగాల్లో ఏర్పడిన లోపాలు సవరించబడి సక్రమంగా పనిచేస్తాయి.
ఈ సనూత్రం ఆధారంగా కనిపెట్టిన చికిత్సావిధానమే రిఫ్లెక్సాలజీ.
దీని వల్ల ప్రధానంగా శారీరక అలసట, మానసిక ఆందోళన తగ్గుతాయి.
క్షీణించిన జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.
ఇన్‌సోమ్నియాతో బాధపడ్తున్నవారు ఇకపై హాయిగా, ఆనందంగా నిద్రపోగల్గుతారు.
మల్టిపుల్‌ స్లెరోసిస్‌ పేషెంట్లకు కూడా ఈ చికిత్స వల్ల ఎంతో మేలు జరుగుతోంది.
మూత్రపిండ సంబంధమైన వ్యాధులు సైతం నయమౌతు న్నాయి.
మన శరీరం పది సమానమైన భాగాలుగా విభజించబడ్తుంది.
కుడివైపు ఐదు, ఎడంవైపు ఐదు భాగాలుంటాయి.
మూడు ట్రాన్స్‌వర్స్‌ లైన్లుంటాయి.
భుజం వద్ద ఒకటి, నడుంవద్ద ఒకటి, కింది భాగంలో ఒకటి వుంటాయి.
వీటిపై అవసరమైనంత ప్రెషర్‌ను కలుగజేసి శరీర భాగాలు సక్రమంగా పనిచేసేలా చూస్తారు.
ఎందరెందరికో ఈ చికిత్స ఉపశమనం కలిగించడంవల్ల పెద్ద పెద్ద డాక్టర్లు కూడా రిఫ్లెక్సాలజీగురించి ఆలోచిస్తున్నారు.
శరీరంలో అక్కడక్కడా బ్లాకేజ్‌లు కనిపించడం సాధారణం.
పైపైన చూస్తే ఇలాంటివి స్పష్టంగా కనిపించవు.
రిఫ్లెక్సాలజీ చికిత్సలో మునివేళ్ళతో జాగ్రత్తగా, అవసరమైనంత వత్తిడి కలుగజేస్తూ మర్దన చేసినప్పుడు వేళ్ళకు ఈ బ్లాకేజ్‌లు తెలిసొస్తాయి.
వాటిని నిర్మూలించి నొప్పి, వత్తిడి తగ్గేలా చేస్తారు.
శరీరంలో విడుదలయ్యే ఎండార్ఫిన్స్‌ లాంటి రసాయనాల వల్ల కూడా వత్తిడి, ఆందోళన పెరుగుతాయి.
వీటన్నిటినీ బ్యాలెన్స్‌ చేయడంలో రిఫ్లెక్సాలజీ ఉపయోగపడ్తుంది.
ఇదేదో తూతూ మంత్రం, తుమ్మాకు మంత్రం బాపతు కాదు.
శాస్త్రీయంగా అత్యంత శక్తివంతమైన ఔషధాయుధం అని తేలింది.
ప్రస్తుతం రిఫ్లెక్సాలజీ చికిత్స ఆసియా, ఐరోపా‌, ఆఫ్రికా, ఉత్తరమెరికా దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందింది.
ఇప్పుడు ఇంగ్లండులో ఈ చికిత్స ఎక్కువగా జరుగుతున్నప్పటికీ, ఇది మొట్టమొదట చైనాలో మొదలైందని చెప్పాలి.
దాదాపు 5 వేల సంవత్సరాల క్రితమే చైనాలో ఈ పద్ధతిని ప్రాక్టీస్‌ చేశారు.
ఇక ఉత్తరమెరికాలోనూ దీనికి బాగా ఆదరణ ఉంది.
జపాన్‌దేశంలో దీన్ని జొకు షిన్‌ డొ అని పిలుస్తారు.
జపాన్‌లో ఎక్కువగా కాలి పాదాన్ని రకరకాలుగా మసాజ్‌ చేసే టెక్నిక్‌ అమల్లో ఉంది.
ఈ ప్రాచీన జొకు షిన్‌ డొ పద్ధతి అనంతర కాలంలో అనేక మార్పుచేర్పులను సంతరించుకుంది.
చైనాలో చేతివేళ్ళపై సూదులతో ఆక్యుప్రెషర్‌ కలిగించడం ద్వారా ఆక్యుపంచర్‌ చేసే పద్ధతి ప్రపంచవ్యాప్తంగా జనాదరణ పొందింది.
తలనొప్పి, సైనోసైటిస్‌ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను సైతం ఆక్యుపంచర్‌ద్వారా తగ్గించడం సాధారణం.
ఈ చైనా ఆక్యుపంచర్‌ సూత్రమే ఇవాళ్టి ఆధునిక రిఫ్లెక్సాలజీ చికిత్సకు మూలం.
ఈజిప్టు దేశస్తులు కూడా అతి పూర్వకాలంలోనే పాదాలను నొక్కి వత్తిడి కలిగిస్తూ చికిత్స చేసేవారు.
అయితే వీళ్ళు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ప్రాక్టీస్‌ చేసినందువల్ల ఈ రకమైన చికిత్సకు సరైన పద్ధతి, ప్రణాళిక లేకపోయాయి.
ప్రస్తుతం అమల్లో ఉన్న రిఫ్లెక్సాలజీ చికిత్సను 1913లో అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన ఈ.ఎన్‌.టి.
స్పెషలిస్టులు (చెవి, ముక్కు, గొంతు స్పెషలిస్టులు) డాక్టర్‌ విలియం హెచ్‌.
ఫిజరాల్డ్‌, డాక్టర్‌ ఎడ్విన్‌ బోవర్స్‌ పరిచయం చేశారు.
ఇలా శరీర భాగాలపై వత్తిడి కలిగించడంవల్ల ఇతర భాగాల్లో ఒకలాంటి మత్తు ఆవరిస్తుంది అన్నారు ఫిజరాల్డ్‌.
అమెరికాలోని రిఫ్లెక్సాలజిస్టులు, ఆధునిక పద్ధతులను ఇంప్లిమెంట్‌ చేస్తూనే, ఇంగమ్స్‌ థియరీలను మొదట క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు.
రిఫ్లెక్సాలజీ దివ్య ఔషధంలా పనిచేస్తున్న మాట వాస్తవమే.
అయితే శాస్త్రీయంగా అధ్యయనం చేసి, అందులో తర్ఫీదు పొందినవారి వద్ద చికిత్స చేయించుకుంటేనే తగిన ప్రయోజనం వుంటుందని గుర్తించాలి.
చవకగా ట్రీట్‌మెంట్‌ చేస్తున్నారనో లేక అందుబాటులో ఉన్నారనో, ఒక ప్రయోగం చేసిచూద్దామనో ఎవరో ఒకరి దగ్గర చికిత్స చేయించుకుంటే ఆశించిన మేలు జరక్కపోవచ్చు.
ఒక్కోసారి రోగం ముదిరి, మరింత ప్రమాదకరంగా మారే అవకాశమూ ఉంది.
కనుక తస్మాత్‌ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
రిఫ్లెక్సాలజీ చికిత్సలో ఫేషియల్‌ రిఫ్లెక్సాలజీ మరింత చెప్పుకోదగ్గది.
దీనివల్ల త్వరిత ప్రయోజనం కనిపిస్తోంది.
ఈ చికిత్సలో గొప్ప ప్రయోజనం పొందిన కొన్ని కేసుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
పశ్చిమ యోర్క్‌షైర్‌లో బెలిండా ఒక మహిళ 18 సంవత్సరాలుగా డిప్రెషన్‌తో బాధపడ్తోంది.
మధ్యమధ్యలో కొంత తగ్గినప్పటికీ ఇన్నేళ్ళుగా ఆమె దాన్నుండి పూర్తిగా బయటపడలేదు.
మొదటిసారి డెలివరీ సమయంలో ఆమెకి డిప్రెషన్‌ వచ్చింది.
ఒక్కసారిగా జీవనశైలి మారిపోవడంతో అలా జరిగింది.
అనేకసార్లు తీవ్ర అలజడికి గురవడము, రాత్రులు నిద్రపట్టకపోవడము, ఉదయం వేళల్లో విపరీమైన ఆందోళనకు గురవడము, మధ్యాహ్నం వరకూ ఏడవడము, అజీర్తి, గాస్ట్రిక్‌ ట్రబులు లాంటి లక్షణాలతో ఆమె శారీరకంగా, మానసికంగా బాధపడింది.
మొత్తానికి రిఫ్లెక్సాలజీ గురించి తెలుసుకుని ఆ సెంటరుకు వెళ్ళి అన్ని విషయాలూ విడమర్చి చెప్పింది.
వారానికి ఒకసారి చొప్పున 5 సిట్టింగులు పూర్తయ్యేసరికి ఆమెలో నిద్రలేమి అంతరించి హాయిగా నిద్రపోసాగింది.
అజీర్తి కూడా పూర్తిగా తగ్గిపోయింది.
మరి కొన్ని వారాల చికిత్స తర్వాత ఆందోళన కూడా తగ్గింది.
ఆమె ఇప్పుడు పూర్తి నార్మల్‌ స్థితికి వచ్చి చక్కగా ఉద్యోగం చేసకుంటూ పిల్లలతో ఆనందంగా జీవించగల్గుతోంది.
41 వారముల తరువాత ప్రసవం రాకపోతే ఆక్యుప్రెషర్‌ని ఉపయోగించడము వలన ప్రసవం జరుగుతుంది.
బోటన వేలు, చూపుడు వ్రేళ్ల మధ్య చర్మం గల ప్రాంతంలోని నాడులపై పై ఒత్తిడి కలిగించడం వలన నొప్పులు వచ్చి ప్రసవం జరుగుతుంది.
మరో వ్యక్తి ఒకరకమైన ఎలర్జీతో బాధపడ్తున్నాడు.
అదెంత తీవ్రంగా వుండేదంటే అతనికి జలుబు చేసి, ఏ మందులు వాడినా ఆర్నెల్లపాటు తగ్గలేదట.
రోజురోజుకీ ఉత్సాహం తగ్గిపోసాగింది.
శరీరం, మనసు కూడా నిద్రాణంగా తయారయ్యాయి.
శారీరకంగా, మానసికంగా నరకయాతన అనుభవించాడు.
డాక్టర్లు పెయిన్‌ కిల్లర్లే శరణ్యమని చెప్పి స్ట్రాంగ్‌ డోసులు ఇవ్వసాగారు.
ఆ దశలో అతనికి రిఫ్లెక్సాలజీ గురించి తెలిసి చికిత్సకోసం వెళ్ళాడు.
ఐదు వారాల్లో అతనిలో గొప్ప మార్పు కనిపించింది.
నాసికా రంధ్రాలు పూర్తిగా తెరుచుకున్నాయి.
ఊపిరాడకపోవడం, జలుబు తగ్గాయి.
నొప్పికి మాత్రలు వేసుకోవడం మానేశాడు.
ఇప్పుడతను ఎంతో ఉల్లాసంగా కనిపిస్తున్నాడు.
ఈ చికిత్స గురించి మాట్లాడ్తూ రిఫ్లెక్సాలజీ నిజంగా అద్భుతమైన ట్రీట్‌మెంట్‌.
నొప్పి, మానసిక ఆందోళన కూడా తగ్గిపోయాయి.
ఇది క్షణాల్లో లేదా రోజుల్లో తగ్గదు.
వ్యాధి తీవ్రతను బట్టి కొన్ని నెలలు చేయించుకోవాల్సి వుంటుంది.
నాది దీర్ఘకాలిక వ్యాధి కనుక నేను ఇప్పటికీ రిఫ్లెక్సాలజీ చేయించుకుంటున్నాను, ఇంకా కొంతకాలం చేయించుకుంటాను.. ఇది ఎంత ప్రయోజనకరమైందని రుజువైంది అంటూ ఆనందంగా చెప్పుకొచ్చాడు.
ఇవి మచ్చుకు రెండు ఉదాహరణలు మాత్రమే.
వందలాదిమంది రిఫ్లెక్సాలజీ చికిత్సతో లాభం పొందుతున్నారు.
త్వరలో మనదేశంలోనూ రిఫ్లెక్సాలజీ సెంటర్లు వస్తాయి.
అందాకా ఓపికపడదాం.