198.txt 1.5 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
ఎడినోమా

https://te.wikipedia.org/wiki/%E0%B0%8E%E0%B0%A1%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8B%E0%B0%AE%E0%B0%BE

ఎడినోమా (ఆంగ్లం: Adenoma) అనేది గ్రంధులకు (Glands) సంబంధించిన బినైన్ ట్యూమర్ (Benign tumor).
ఎడినోమాలు మన శరీరంలో పెద్దప్రేగు, అధివృక్క గ్రంథి, మొదలైన చాలా అవయవాలకు రావచ్చును.
ఇవి కొంతకాలం తర్వాత మాలిగ్నెంట్ ట్యూమర్ (కాన్సర్) గా మారే అవకాశం ఉంటుంది.
అప్పుడు వాటిని ఎడినోకార్సినోమా (Adenocarcinoma) అంటారు.
ఈ ట్యూమర్లు వాపు మూలంగా కొన్ని ప్రదేశాలలో ఇబ్బంది కలిగిస్తాయి.
ఉదాహరణకు పేగులలో ఆహార పదార్ధాల కదలికలకు అడ్డంగా మారవచ్చును.
కొన్నిసార్లు రక్తస్రావం జరగవచ్చును.
కొన్ని ట్యూమర్లు హార్మోన్లు ఉత్పత్తిచేసి మిగిలిన శరీరంలో వ్యాధి లక్షణాల్ని కలుగజేస్తాయి.