2.txt 9.83 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51
ఆయుర్వేదం

https://te.wikipedia.org/wiki/%E0%B0%86%E0%B0%AF%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B1%87%E0%B0%A6%E0%B0%82

ఆయుర్వేదం (Ayurveda) ఆయుష్షుని కాపాడి వృద్ధి చేసే వేదం ఆయుర్వేద వైద్య నారాయణ ధన్వంతరి వైద్య బ్రాహ్మణులు అని కూడా అంటారు.
ఇది అధర్వణ వేదానికి ఉప వేదం.
'ఆయువిందతివేత్తివా ఆయుర్వేదః' అన్నది నానుడి.
అనగా ఆయువును గూర్చిన విజ్ఞానం.
ఇది భారత దేశంలో అతి పురాతనకాలం నుండి వాడుకలో ఉన్న వైద్యం.
ఆధునిక వైద్యం వచ్చిన తరువాత ఇది కొంచం వెనకబడినా ప్రస్తుతకాలంలో తిరిగి ప్రాచుర్యాన్ని సంతరించుకుంది.
శస్త్రచికిత్స చేసే కొన్ని వైద్యరీతుల్లో ఆయుర్వేదం ఒకటి.
శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ వైద్య ప్రక్రియలు ఆధునిక వైద్యానికి లొంగని కొన్ని రకాలైన దీర్ఘకాలిక వ్యాధుల్ని, మొండి వ్యాధుల్ని సైతం నయం చేస్తాయని చెబుతారు.
దీనిలో అనేక సంప్రదాయములు
వేదముల వలెనే ఇది మొదట బ్రహ్మచే స్వయంగా తెలుసుకొనబడినదని అంటారు.
తర్వాత బ్రహ్మ నుండి దక్షప్రజాపతి, అతని నుండి అశ్వినీ దేవతలు, వారి నుండి ఇంద్రుడు ఆయుర్వేదమును నేర్చుకున్నారన్నది పురాణ వాక్యం.
ధర్మార్థ కామ మోక్షములకు అడ్డంకిగా ఉన్న అనేక వ్యాధులను నయం చేయాలన్న సదుద్దేశంతో భరద్వాజ, ఆత్రేయ, కశ్యప, కాశ్యప, నిమి మొదలగు ఋషులు జనుల యందు దయ కలవారై, త్రిలోకాధిపతియైన ఇంద్రుని వేడిరి.
అప్పుడు కాయ, బాల, గ్రహ, ఊర్థ్వాంగ (శాలక్య), శల్య, దంష్ట్ర, జరా, వృష అను 8 విభాగాలతో కూడిన ఆయుర్వేదమును ఆ ఋషులకు ఇంద్రుడు ఉపదేశించెను.
ఆ ఋషులు పరమానందముతో భూలోకమునకు వచ్చి శిష్యులకు ఉపదేశించిరి.
ఆ శిష్యులలో ఉత్తముడైన అగ్నివేశుడు మొదటిగా  అగ్నివేశ తంత్రము అనే గ్రంథమును రచించి విశ్వవ్యాప్తినొందించెను.
ఈ విధంగా ఆయుర్వేద అవతరణ జరిగింది.
నేటికిని ఈ ఆయుర్వేదము చక్కగ అభ్యసింపబడి ఆచరణలో ఉంది.
ఆ గ్రంథమును చరకుడు తిరిగి వ్రాసి దానికి చరక సంహిత అని నామకణం చేశాడు.
మరియొక సాంప్రదాయం ప్రకారం శ్రీ మహా విష్ణువు యొక్క అవతారమైన కాశీ రాజైన దివోదాస ధన్వంతరి సుశ్రుతాది శిష్యులచేత ప్రార్థించబడినవాడై వారికి ఆయుర్వేదమును బోధించెను.
ఆ శిష్యులందరు వారి వారి పేర తంత్రములను రచించిరి.
వాటిలో సుశ్రుత సంహిత  అనునది యెంతో ప్రాచుర్యమును పొందెను.
ఇది పుస్తకరూపంలో తక్షశిల, నలందా విశ్వవిద్యాలయాలలో లభ్యమౌతుంది.
ఇతర వైద్య విధానాలతో పోల్చి చూస్తే, ఆయుర్వేదం చాలా ప్రాచీన మైనది.
దానికి తోడుగ అనేక వైద్య అంశాలు విశదీకరించ బడ్డాయి.
విశేషంగా శస్త్రవిద్యావిషయాలు, రక్తము (blood) దాని ప్రాధాన్యతపై అవగాహన పెంచారు.సంగీతము, క్షవరము ఆయుర్వెదం లో ఒక భాగము.
పoడా  బ్రాహ్మణ కులం లో చాల పురాతన కాలం నుండి చాల గొప్ప వారైన మహారాజ వైద్యులు కలిగిన వంశం మొసలిగంటి వారి వంశం .
వైద్యం అనేది  డబ్బు కోసం చేసేది కాదు... శత్రువికి అయినా సరే ప్రాణం మీదకి వస్తే... వైద్యం చెయ్యాలి.. అదే  గొప్ప దర్మం  అని  చెప్పే వాళ్ళు...
ఇంట్లో .. దేవుడి చిత్ర పటాలు కంటే...  తాతల చిత్ర పటాలు కి   తాలపత్ర గ్రంధాలు కి పూర్వీకుల వంశ వృక్షానికి  పూజ చేస్తారు.
దేవుడి కంటే గొప్పవాళ్ళు గ భావించే మహా రాజవైద్యులు కాబట్టే.
ప్రాణం పొసే వాడు దేవుడు,ప్రాణం నిలబెట్టే వాడే వైద్యుడు.
మహా రాజుల కాలం నాటి నుండి రాజ్యం లో ఆస్థాన వైద్యులు గా పని చేసి రాజ్యం లో ప్రజా క్షేమమే ద్యేయం గా జీవనం సాగించేవారు.
రాజరికాలు అంతరించిపోయిన తర్వాత వలస వచ్చి పలు చోట్ల శాశ్వత నివాసం  ఏర్పరుచుకుని జీవనం సాగించారు.
ప్రస్తుతము ఆయుర్వేదములో పంచకర్మ బాగా ప్రసిద్ధి చెంది ఉంది.
ఈ విధానముచే కండరాలు నరములకు సంబంధించిన అనేక వ్యాధులను చికిత్స చేయవచ్చు.
కేవలం  
వస్తు గుణదీపిక ఆయుర్వేద ఔషధులు, వాటిని ఉపయోగించవలిసిన విధానముల గురించి వివరించే తెలుగు నిఘంటు గ్రంథం.
దీనిని యెర్ర వెంకటస్వామి గారు రచించారు.
దీనిని 1883 వ సంవత్సరం జూన్ 23వ తేదిన విడుదల చేయడం జరిగింది.
ఈ గ్రంథాన్ని వెంకటస్వామి గారి కుమారుడు అయిన యెర్ర సుబ్బారాయుడు (రిటైర్డ్ జిల్లా మున్సుబు) గారు వృద్ధిపరిచి మరల విడుదల చేసారు.
.
వస్తుగుణపాఠము సుప్రసిద్ధ ఆయుర్వేద గ్రంథము.
దీనిని జయకృష్ణదాసు రచించారు.
దీని మూడవ కూర్పు చెన్నపురిలోని ఆంధ్రభూమి ముద్రణాలయమున 1936 లో ప్రచురించబడింది.
వివిధ వృక్షజాతులు, వస్తువుల ఔషధగుణాలు, లక్షణాలను వెల్లడించే వస్తుగుణ పాఠాలు ఆయుర్వేద, యునాని మొదలైన వైద్యవిధానాల నిపుణులకు ఎంతో ఉపకరించేవి.
అంతేకాక బంగారం మొదలైన వస్తువులను ధరించడం వల్ల కలిగే ఆరోగ్యపరమైన ఉపయోగాలు వంటివి ఇందులో వివరిస్తారు.
ఓషధులు, మూలికలు
మందులుశ్రీ చిత్ర పురాణపండ, ఆయుర్వేదమ్‌ (భారతీయ వైద్య శాస్త్రము), జనప్రియ పబ్లికేషన్స్‌, తెనాలి - 522 201పథ్యాపథ్యము-డి.గోపాలాచార్యులు