కవసాకి వ్యాధిhttps://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B0%B5%E0%B0%B8%E0%B0%BE%E0%B0%95%E0%B0%BF_%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A7%E0%B0%BFకవసాకి ( kawasaki ) వ్యాధి, దీనిని మ్యూకోక్యుటేనియస్ ( mucocutaneous ) రసగ్రంథి లక్షణసంపుటి అని పిలుస్తారు, ఇది ఒక వ్యాధి, దీనిలో శరీరం అంతటా రక్తనాళాలు ఎర్రబడతాయి.సాధారణమైన మందులు ప్రభావితం చేయని ఐదు రోజుల కంటే ఎక్కువ ఉండే జ్వరం, మెడలో పెద్ద శోషరస కణుపులు, జననేంద్రియ ప్రాంతంలోని దద్దుర్లు, ఎరుపు కళ్ళు, పెదవులు, అరచేతులు లేదా అరికాళ్ళు వంటివి ఈ వ్యాధి యొక్క అత్యంత సాధారణ లక్షణాలు.గొంతు మంట, అతిసారం ఇతర లక్షణాలుగా ఉన్నాయి.లక్షణాలు ప్రారంభమైన మూడు వారాలలో, చేతులు, కాళ్ళు నుండి చర్మం పై తోలు ఊడవచ్చు.స్వస్థత అప్పుడు సంభవిస్తుంది.కొందరు పిల్లలలో 1-2 సంవత్సరాల తరువాత గుండెలో పరిమండల ధమని యొక్క రక్త నాళము ఉబ్బుట అనేది జరగొచ్చు.