207.txt 5.73 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33
కోరింత దగ్గు

https://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B1%8B%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%A4_%E0%B0%A6%E0%B0%97%E0%B1%8D%E0%B0%97%E0%B1%81

ఇది చిన్న పిల్లలలో శ్వాసమార్గాన్ని బాధించే సాలక్రామిక రోగం.
తెరలు-తెరలుగా దగ్గు వస్తుంది.
బొర్డ్‌టెల్లా పెర్టుసిస్ అనే సూక్ష్మ క్రిమివల్ల ఈవ్యాధి వస్తుంది.
ఇది ఏ వయస్సులోనైనా రావచ్చు కాని, ఇది ఏడాది లోపు పసి పిల్లలకి వస్తే బాగా ఉధృతంగా వస్తుంది.
ముందు జలుబు, జ్వరం వస్తాయి.
7 నుంచి 10 రోజులు దాకా జ్వరం రావచ్చు.
సాధారణంగా జలుబు చేస్తే రోగి నాలుగు లేక ఐదు రోజులు మాత్రమే బాధపడతాడు కాని ఈ జలుబు అలా కాకుండా అంతకంతకు హెచ్చుతూ, దగ్గు ఆరంభమవుతుంది.
పొడి దగ్గు, తుమ్ములు ఎక్కువ అవుతాయి.
తెరలు తెరలుగా దగ్గు వస్తుంది.
దగ్గు వచ్చినప్పుడు మొహం ఎర్రబడుతుంది.
వెంట వెంటనే వచ్చే దగ్గు తెరల వల్ల రోగి గొంతులో ' ఉహ్ ఉహ్ .. ' అనే ఒక రకమైన ధ్వని వెలువడుతుంది.
దగ్గువచ్చిన తర్వాత బిడ్డ వేగంగా గాలి పీల్చుకున్నప్పడు ఈ శబ్దం ఏర్పడుతుంది.
డోకువచ్చి ముక్కు వెంట నోటివెంట నురుగునురుగుగా స్రావం వస్తుంది.కొన్ని సార్లు గాలి పీల్చడానికి వీలుపడక ముఖం నీలంగా మారిపోతుంది.
నోరు తెరచుకోవడం, నాలిక బైట పడడం, కనుగ్రుడ్లు బైటికి పొడుచుకు రావడంలాంటి లక్షణాలు కనిపిస్తాయి.
బిడ్డ బలహీనంగా ఉన్నప్పుడూ, రోగం మరీ తీవ్రం అయినప్పుడూ అంగ ప్రకంపనలు (convulsions) కూడా కనిపించవచ్చు.
తెరలు తెరలుగా దగ్గు వచ్చినప్పుడు, డోకువచ్చి, తిన్న ఆహారం అంతా వెళ్ళిపోతుంది శరీరంలో బలహీనత ఏర్పడుతుంది.
అప్పుడు బిడ్డ బక్క చిక్కిపోతుంది.
కొన్నిసార్లు దగ్గినప్పుడు, ముక్కులో నుంచి చెవులలోనుంచి రక్తం రావచ్చు.
3,4 మాసాల వయస్సులో ఆరంభించి ఒక మాసం వ్యవధితో మూడు ఇంజెక్షనులు ఇవ్వాలి.
ఈ రోగం రాకుండా పెర్టసిస్, డిఫ్తీరియా, టెటనస్ వాక్సిన్‌లతో కలిపి మూడు వాక్సిన్ (DPT triple antigen) ల రూపంలో ఇస్తే, రోగ నిరోధక శక్తి బాగా ఏర్పడుతుంది.
బిడ్డకు వ్యాధి సోకిన తర్వాత ఈ వాక్సిన్ ఇచ్చి ప్రయోజనం లేదు.
కోరింత దగ్గు రాగానే, బాగా గాలి వచ్చే గదిలో శయ్యావిశ్రాంతి (bed rest) ఇవ్వాలి.
తక్కిన పిల్లలను దగ్గరికి రానివ్వకూడదు.
నోటివెంటా, ముక్కు వెంటా వచ్చే స్రావాలను కాగితంలోనో, పాతగుడ్డతోనో సేకరించి తగులపెట్టెయ్యాలి.
ఈ జబ్బుతో బాధ పడుతున్న బిడ్డ ఉపయోగించే దుస్తులూ, పాత్రలూ, వస్తువులూ తక్కిన బిడ్డలు వాడరాదు.
దీనికి ప్రత్యేకమైన చికిత్స ఏమీ లేదు .
దగ్గు తగ్గుముఖం పట్టడానికి వైద్యుని సలహామేరకు ఏదైనా మందు ఇవ్వవచ్చు.
వాంతి చేసుకోవడం వల్ల బలం తగ్గినప్పుడు కొద్దికొద్దిగా పుష్టికరమైన ఆహారం ఇస్తూ, బిడ్డ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి.
అంటువ్యాధులు-నివారణోపాయాలు-కల్వి గోపాలకృష్ణన్(తమిళమూలం)-బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు (తెలుగుసేత).