208.txt 31.9 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178
కోవిడ్-19 వ్యాధి

https://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B1%8B%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%8D-19_%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A7%E0%B0%BF

కరోనా వైరస్ డిసీస్ 2019 లేదా కోవిడ్-19 ఒక అంటువ్యాధి.
ఇది సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోం కరోనా వైరస్ 2 (SARS-CoV-2) అనే వైరస్ వల్ల కలుగుతుంది.
దీన్ని మొట్టమొదటగా మధ్య చైనాలోని హూబే ప్రావిన్సు రాజధానియైన వుహాన్ లో 2019 లో గుర్తించారు.
అక్కడి నుంచి ఇది ప్రపంచమంతటా వ్యాపించి 2019-20 కరోనా వైరస్ విశ్వమారి అయ్యింది.
జ్వరం, దగ్గు, శ్వాస సరిగా ఆడకపోవడం దీని ప్రధాన లక్షణాలు.
కండరాల నొప్పి, కఫం ఉత్పత్తి కావడం, విరేచనాలు, గొంతు బొంగురుపోవడం కొంచెం తక్కువగా కనిపించే లక్షణాలు.. అంతేకాక చలిగా అనిపించడం, ఒంట్లో వణుకు, కండరాల నొప్పి, తలనొప్పి, వాసన గ్రహించలేకపోవడం, గొంతు నొప్పి, మంట వంటి లక్షణాలు కూడా  కరోనా వైరస్ సోకిన  రెండు రోజుల నుండి 14 రోజుల మధ్యలో ఈ లక్షణాలు కన్పించే అవకాశం ఉందని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సంస్థ గుర్తించింది. .
2019 డిసెంబర్ నెలలో చైనాదేశంలో వూహాన్ లో పుట్టింది.
అంతటివరకూ మానవజాతి ఎరుగని ఈ రోగానికి కోవిడ్ 19'అని పేరు పెట్టారు.
ఈ రోగం సోకిన తరువాత గుర్తులు జ్వరమూ, పొడి దగ్గూ, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది.
ఈ ఇబ్బందులు ఉన్నట్లయితే రోగిని వైద్యుని వద్దకు తీసుకువెళ్ళాలి.
కొందరు కోవిడ్ రోగులలో ఈ కింద గుర్తులు కూడా కనిపించవచ్చు:కండరాల నొప్పులూ, కీళ్ళ నొప్పులూ,తలనొప్పీ,గొంతు నొప్పీ, ముక్కు దిబ్బెడా,కఫమూ, చలి వేయుటా, కడుపు చెడిపోవటా (కడుపులో తిప్పూ, వాంతలూ, విరోచనాలూ).
ఈ రోగం సోకిన వారిలో నూటికీ ఎనభై మంది తమంతట తామే రెండు వారాలలో కోలుకుంటారు.
కాని కొందరికి ఊపిరితిత్తుల వాపూ కలిగి, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది.
ఊపిరి సరిగా అందక, గుండె, మూత్రపిండములూ మొదలైనవి పనిచేయటం మాని, వారు చనిపోవచ్చు.
వొంటిలో కోవిడ్రోగము యొక్క విషాణువు (virus) చేరడం వల్ల కోవిడ్రోగము కలుగుతుంది.
ఈ విషాణువు సూక్ష్మదర్శినిలో (కట్టకడపటి భూతద్దంలో) కిరీటం రూపంలో కనిపిస్తుంది.
ఈ రూపమున్న విషాణువులు ఇదువరకు గుర్తించబడ్డాయి కాని ఈ కోవిడ్విషాణువును ఇప్పటివరకూ ఎరుగం కాబట్టి దీనికి "నూతన కిరీటవిషాణువు" (novel coronavirus) అని పేరు పెట్టారు.
చాలా కీడు చేయడమే కాక కోవిడ్ చాలా తేలికగా ఒకరినుండి ఇంకొకరికి అంటుకునే రోగం కాబట్టి అది మహమ్మారి అయింది.
రోగము సోకిన ఐదు రోజుల వరకు రోగం గుర్తులు నమ్మకంగా కనబడవు.
కాని ఈలోగానే రోగము ఇంకొకరికి అంటవచ్చు.
కోవిడ్రోగి తుమ్మినా దగ్గినా ముక్కూ నోరూ గుండా పడే తుంపర్లలోనూ, చీమిడి బొట్లలోనూ కోవిడ్విషాణువులు ఉంటాయి.
ఆ తుంపర్లూ బొట్లూ ఇంకొకరి మీద పడితే వారికీ కోవిడ్రోగం అంటవచ్చు.
రోగమంటుకునేది ఎక్కువగా ఈ దారినే.
ఇంకొక అంటుదారి ఉంది.
రోగి తుమ్మూ చీమిడీ తుంపర్లు ఏ వస్తువు మీద పడ్డా విషాణువులు కొంత సేపు శిథిలమవకుండా ఉంటాయి.
(చల్లని లోహపు వస్తువులమీద విషాణువులు కొన్ని రోజులు నిలవవచ్చు).
ఈలోగా ఆ వస్తువుని ముట్టుకుని మొహము ముట్టుకున్నవారికి కోవిడ్రోగం అంటవచ్చు.
పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నా ఇప్పటివరకూ కోవిడ్రోగానికి చికిత్సగాని నివారణగాని దొరకలేదు.
కాబట్టి రోగం అంటకుండా చూసుకోవాలి.
రోగం సోకినట్లు కొన్ని రోజుల వరకూ రోగికే తెలియదు కాబట్టి ఇంటి బయట ఎవరైనా సరే రోగి అవచ్చు అనుకుని అందరికీ ఆరడుగుల దూరాన ఉండాలి.
తరుచు చేతులు సబ్బూ నీళ్ళతో బాగా కడుగుకోవాలి, ముఖ్యముగా బయటనుండి రాగానే.
అయినంతవరకు ముఖాన్ని ముట్టుకోకూడదు.
ప్రత్యేకంగా కోవిడ్రోగులు ముక్కుకీ నోటికీ అడ్డంగా గుడ్ద కట్టుకోవాలి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్రోగవ్యాప్తి ఒక మహమ్మారి అనీ,, ఇది సార్వజనిక ఆరోగ్యానికి అత్యవసర పరిస్థితి అనీ ప్రకటించింది.
భారత దేశము లోని  విశాఖపట్నం కు చెందిన ప్రముఖ వైద్యులు డా.వై.శ్రీహరి  " కోవిడ్ ఇమ్మ్యూనోగ్లోబులైన్స్ ఇంజక్షన్" కనుక్కున్నారు .
భారత ప్రభుత్వపు "ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్" వారు  ఈ ఇంజక్షన్ క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి ఇచ్చారు .
అనేక వైద్యులు ఈ ఇంజక్షన్ కు మద్దతు గా పలు ప్రకటనలు చేశారు .
ఈ ఇంజక్షన్ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయితే కోవిడ్ కు మందు కనిపెట్టిన మొదటి దేశం భారత దేశం అవుతుంది .
ఈ ఇంజక్షన్ సక్సెస్ అయితే ఒక మూడు నెలల్లో పేషెంట్ లకు అందుబాటు లోకి రావచ్చు అని వైద్యులు చెపుతున్నారు .
ఈ ఇంజక్షన్ భారత ప్రభుత్వపు పేటెంట్ ఆఫీస్ లో పేటెంట్ రిజిస్టర్ కాబడినది.
వాక్సిన్ లు తయారు చెయ్యాలి అని ప్రపంచ వ్యాప్తము గా అనేక ప్రరిశోధనలు జరుగుతున్నాయి .
కానీ ఇంకా ఒకటి లేదా రెండు సంవత్సరాలు పట్టొచ్చు అని శస్త్ర వేత్తలు చెపుతున్నారు .
రోగలక్షణాలు అభివృద్ధి చెందడానికి ముందు 1 నుంచి 14 రోజుల వరకు వైరస్ తో ప్రజలు అస్వస్థతగా ఉండవచ్చు.
కరోనోవిరస్ వ్యాధి (కోవిడ్-19) లో సర్వసాధారణంగా కనిపించే లక్షణాలు జ్వరం, అలసట, పొడి దగ్గు.
చాలా మంది (సుమారు 80%) ప్రత్యేక చికిత్స అవసరం లేకుండానే వ్యాధి నుంచి కోలుకుంటారు.
మరింత అరుదుగా, ఈ వ్యాధి తీవ్రమై ప్రాణాంతకం కూడా కావచ్చు.
వృద్ధులు,, ఇతర వైద్య పరిస్థితులతో (ఉబ్బసం, మధుమేహం లేదా గుండె జబ్బులు వంటివి) తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.
చాలా కేసుల్లో ఈ లక్షణాలు స్వల్పంగా కనిపించినప్పటికీ, కొన్ని కేసులు న్యుమోనియా, మల్టి ఆర్గాన్ ఫెయిల్యూర్ లాగా పరిమాణం చెందుతున్నాయి.
2020 మార్చి 23 నాటికి, మరణాల రేటు 4.4 శాతంగా ఉంది.
కానీ ఇది వయస్సును బట్టి, ఇతర జబ్బులను బట్టి 0.2 నుండి 15 శాతంగా ఉంది.
వికారంగా ఉంటుంది ముందు జ్వరం వస్తుంది.
ఇది 24 గంటలు గడిచేటప్పటికి ఇతర సమస్యలను పెంచుతోంది.
అలసట, ఒళ్లు నొప్పులు, పొడి దగ్గు వస్తాయి
అలసట, ఒళ్లు నొప్పులు, పొడి దగ్గు మరింతగా పెరుగుతాయి.
జ్వరం కూడా అధికంగా ఉంటుంది
నాలుగో రోజు కూడా పైన చెప్పిన సమస్యలు కంటిన్యూ అవడంతో పాటు గొంతు నొప్పిగా ఉంటుంది
పైన చెప్పిన సమస్యలతో పాటు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుందికూడా ఇలాగే కంటిన్యూ అవుతాయి
మొదటి ఆరు రోజుల్లో ఆస్పత్రిలో చేరిపోవాలి.
లేదంటే పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది.
ఈ సమయంలో ARDS (ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్) అనే సమస్య ఏర్పడుతుంది.
అంటే ఊపిరితిత్తులు బాగా దెబ్బతింటాయి.
ఈ స్టేజ్‌లో బలహీనంగా ఉన్నవారు చనిపోయే ప్రమాదముంటుంది పేషెంట్‌ని ఐసీయూలో చేర్చుతారు.
పొట్టలో ఎక్కువగా నొప్పి వస్తుంది.
ఆకలి వేయదు.
కొంతమంది మాత్రం చనిపోతూంటారు.
ఇక్కడ కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది.
కానీ 2 శాతమే.
ఇక 11వ రోజు నుంచి 17వ రోజు వరకూ ఆస్పత్రిలో చేరితే.. రెండున్నర వారాల్లో రికవరీ అయ్యి.. డిశ్చార్జి అయ్యే అవకాశాలు 82 శాతం ఉంటున్నాయి.
ఇలాంటి లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తే మొదటి 5 రోజుల్లోనే ఆస్పత్రిలో చేరడం మంచింది.
లేదంటే ఆ తరువాత ఈ వైరస్ మరింత కఠినంగా మారుతుంది.వైద్య నిపుణులు చేసిన అధ్యయనాన్ని ‘అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్’ అనే పత్రిక ప్రచురించింది.
వ్యాధి లక్షణాలు ఉన్నంత మాత్రాన వైరస్ సోకినట్లు భావించనవసరం లేదని వైద్యుల అధ్యయనం మేరకు తెలుస్తోంది.
ఇక 5.1 రోజుల తరువాత నుంచి వ్యాధి నిర్దారణకు రావడానికి చికిత్స అందించడానికి 14 రోజుల క్వారంటైన్ సమయం అవసరం అని తెలుస్తోంది.
వైద్య నిపుణుల అంచనా మేరకు కరోనా వైరస్—సార్స్-కోవ్2 లక్షణాలు రోగగ్రస్థుడికి కనిపించిన తరువాత నెగిటివ్ అని తేలితే ఏ ఇబ్బంది లేదు పాజిటివ్ అని వస్తే మాత్రం దీనికి కచ్చితంగా 14 రోజుల వ్యవధిలో చికిత్స చేసి ఇంటికి పంపవచ్చని జాన్స్ హొప్‌కిన్స్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది.
వ్యాధి సోకిన వారిలో పదివేల మందికి ఒకలా ఉంటే 101 మందికి మరో రకంగా ఉంటుంది.
పదివేల మందికి 14 రోజుల్లో చికిత్స నయం చేయగలిగితే మిగిలిన 101 మందికి మాత్రం మరింత సమయం పట్టే అవకాశం ఉంటుంది.
కరోనా చికిత్స పొంది పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా దాదాపు 8 రోజుల దాకా వైరస్ రోగి శరీరంలోనే ఉండే అవకాశాలున్నాయని చైనా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు
పసుపు యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది.
కుర్కుమిన్, పసుపులో ఉండే సమ్మేళనం చాలా శక్తివంతమైన ఏజెంట్ మరియు గాయాలు మరియు ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో సహాయపడుతుంది.
ఇదే కారణం, పసుపు పాలు Archived 2021-07-22 at the Wayback Machine తరచుగా సూచిస్తారు.
చేతి పరిశుభ్రతను నిర్ధారించడానికి, నిపుణులు మరియు వైద్యులు సబ్బుతో చేతులు కడుక్కోవాలని లేదా మద్యం ఆధారిత రబ్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించాలని సిఫార్సు చేస్తారు.
హ్యాండ్ శానిటైజర్లు సూక్ష్మక్రిములను తొలగించినప్పుడు, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో అవసరమైన మంచి బ్యాక్టీరియాను తీసుకుంటారు.
"పెరుగు ఒక సహజ ప్రోబయోటిక్ మరియు మన శరీరంలో మంచి బ్యాక్టీరియా ఏర్పడటానికి సహాయపడుతుంది.
గుర్తుంచుకోండి, దీనిని తాజాగా తయారు చేసుకోవాలి.
కారణంతో సంబంధం లేకుండా మీకు గొంతు నొప్పి ఉంటే, పెరుగు దాన్ని మరింత దిగజార్చవచ్చు కాని మంచి రోగనిరోధక శక్తి కోసం, మీకు ప్రోబయోటిక్స్ అవసరం మీరు సప్లిమెంట్లను ఆశ్రయించవచ్చు "అని క్లినికల్ న్యూట్రిషనిస్ట్ లోవ్నీత్ బాత్రా చెప్పారు.
అన్ని రకాల విటమిన్లలో, విటమిన్ సి మరియు విటమిన్ డి ఒకరి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
అదే కోసం, ఆమ్లా, నిమ్మకాయ, ఆరెంజ్ మరియు ఇతర సిట్రస్ పండ్లు మరియు కూరగాయలు ఉండాలి.
అలాగే, గుడ్డు సొనలు మరియు పుట్టగొడుగులు విటమిన్ డి యొక్క మంచి మూలం.
కరోనా వైరస్ లక్షణాలు ఏమిటి?
జ్వరం, పొడి దగ్గు, శ్వాస (ఊపిరి) పీల్చడం ఇబ్బంది.
వ్యాధి లక్షణాలు తెలియడానికి రెండ్రోజుల నుండి రెండు వారాలు పడుతుంది.కొంతమందికి ఏ లక్షణాలూ ఉండకపోవచ్చు కూడా.
వైరస్ తీవ్రతని బట్టి లక్షణాలుంటాయి.
ఒంటరిగా ఒకే చోట తోటి వారికి దూరంగా ఉంటే వ్యాధి తగ్గే అవకాశాలు ఎక్కువ.
అరవయ్యేళ్ళ పైగా వృద్ధులూ, దీర్ఘవ్యాధులు ఉన్నవారూ కరోనా వైరస్ వలన తీవ్రంగా అనారోగ్యం పాలు అయ్యే అవకాశాలు ఎక్కువ.
వారు మరిన్ని జాగ్రత్తలు పాటించాలి.
కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుంది?
శ్వాస తుంపర (respiratory droplets) ద్వారా (నోరు లేదా ముక్కు నుండి స్రవించేవి).
ముఖ్యంగా - పొడి దగ్గు, తుమ్ములు, ఉమ్మి - వీటి ద్వారా ఒకరి నుండి మరొకరికి పాకుతుంది.
కరోనా వైరస్ సోకిన ఉపరితలాలు తాకి, వేంటనే కళ్ళ్ళు, ముక్కూ, నోరు స్పృశించినా వైరస్ అంటుతుంది.
కరోనా వైరస్ ఫ్లూ వ్యాధి కంటే తీవ్రమైనదా?
జవాబు:అవును.
పరిశోధనల ప్రకారం ఫ్లూ సగటున ఒకరి నుండి మరోకరికి (మహా అయితే ఇద్దరికి) సోకుతుంది.
కరోనా వైరస్ ఒకరి నుండి మరో ముగ్గురికి సోకే అవకాశం చాలా ఎక్కువ.
కరోనా వైరస్ ఎంత సమయం సజీవంగా వుంటుంది?
అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్) వారు చేసిన అధ్యయనం ప్రకారం కరోనా వైరస్ కింద సూచించిన విధంగా ఉపరితలాల మీద    సజీవంగా ఉంటుంది 
శ్వాస తుంపరలు 3 గంటలు 
(నోరు లేదా ముక్కులో స్రవించేవి) 
Respiratory droplets)
కరోనా వైరస్ ఏ లక్షణాలూ కనిపించకపోతే, అది సోకిందని ఎలా గుర్తించేది?
గుర్తించడం కష్టం.
ఈ వైరస్ మీద పరీక్షల్లో వెనకబడే ఉన్నారు.
అందువలనే, ఒకరి నుండి మరొకరికీ, మనకీ సోకకుండా జాగ్రత్త పడాలి.
మన చుట్టూ ఉన్న అందరికీ కరోనా వైరస్ తాకిందన్నట్లుగా భావించి జాగ్రత్తలు తీసుకోవాలి.
మనకీ సోకిందన్నట్లుగా - వ్యక్తి ఎడమ (social distancing) కచ్చితంగా పాటించాలి.
కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు లేవు కనుక అది వ్యక్తులకి సోకిందన్నది చెప్పలేము.
అలాగే ఒకరినుండి మరొకరికి ఎప్పుడు సోకిందన్నదీ నిర్ధారించ లేకపోతున్నారు.
అందువలనే - 
• జన సందోహాల మధ్య తిరగడం నివారించాలి 
• కనీసం 6 అడుగుల దూరం పాటించాలి 
• చేతులు తరచు కడుక్కోవాలి 
• క్రిమిసంహార శుభ్రత చేసుకోవాలి 
• తరచు ముఖాన్ని తాకడం తగ్గించాలి
 సామాజిక దూరం (social distancing) ఎంతకాలం పాటించాలి?
సుమారు కొన్ని నెలల వరకూ.
ఇది మరలా మరలా పాటించాలి.
ఎందుకంటే - కరోనా వైరస్ తగ్గినా నీటి తరంగంలా పైకి తేలచ్చు.
కరోనా వైరస్కి టీకా (vaccine) మందు కనుక్కునే వరకూ - వ్యక్తి ఎడమ - పాటించాలి.
టీకా మందు కనుక్కోవడానికి ఒక ఏడాది పైనే పట్టచ్చు అని వైద్య పరిశోధకుల అంచనా.
ఎంత కాలం పడుతుందన్నది చెప్పలేరు.
ఆహార పదార్థాల ద్వారా కరోనా వైరస్ సోకుతుందా?
ఆహారం ద్వారా సోకుతుందని కచ్చితంగా చెప్పలేమని వైద్య పరిశోధకులు అంటున్నారు.
ఒకరినుండి మరొకరికి మాత్రమే వ్యాపిస్తుంది.
కానీ ఉపరితలాల మీద ఎక్కువ కాలం కరోనా జీవించలేదు 
కనుక ఆహార పదార్థాల ద్వారా సోకే అవకాశాలు తక్కువని అంటున్నారు.
కరోనా "వ్యాధిలక్షణ రహిత" మయినప్పుడు ఒకరి నుండి వేరొకరికి ఎలా సోకుతుంది?
దగ్గూ, తుమ్ములూ కాకుండా మరొకరికి ఎలా అంటుంతుంది?
మాట్లాడేటప్పుడు నోట్ తుంపరలు రావడం సహజం.
అవి పైకి కనిపించక పోవచ్చు.
మాట్లాడేటప్పుడు చేతితో ముక్కు నలిపడం, నోరు తాకడం, కళ్ళు నులపడం చేస్తూ ఉంటాం.
వెంటేనే ఏ వస్తువునైనా తాకితే వరిస్ మరొకరికి వ్యాపిస్తుంది.
వైరస్ లక్షణాలు పైకి కనిపించకపోవచ్చు గాక.
అందుకే - సబ్బు, నీరుతో 20 సెకండ్ల పైగా చేతులు కడుక్కోమని అంటున్నారు.
ముఖ్యంగా - తరచూ ముఖాన్ని తాకడం కచ్చితంగా ఆపాలి.
కరోనా సోకిని వారిని ఎలా సంరక్షించాలి?
కరోనా వైరస్ పరీక్షా శిబిరాలు తక్కువగానే ఉన్నాయి.
మీ కుటుంబ సభ్యులకి కరోనా సోకిందో లేదో చెప్పడం కష్టం.
అందుకే ఎవరికి వారు వారికి రాకుండా జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి.
కరోనా సోకిన వారికి ఒక గది కేటాయించాలి.
వారు ఖచ్చింతంగా ఫేస్ మాస్క్ ధరించాలి.
ఒకవేళ మాస్క్ వలన ఊపిరి పీల్చడం కష్టమైతే, వారికి సేవలందించేవారు మాస్క్ ధరించాలి.
కరోనా సోకిన వారు ఎంతకాలం దూరంగా ఉండాలి?
తగ్గిందని ఎలా తెలుస్తుంది?
ఒక్కొక్కరిని బట్టి మారచ్చు.
అది కేసుని బట్టి నిర్ధారిస్తారు.
వీటికి సంబంధించి వైద్యులు కొన్ని మార్గదర్శక సూత్రాలు పాటిస్తారు.
అవి కొన్ని -
• మందులు వాడకుండా జ్వరం బాగా తగ్గినప్పుడు.
• దగ్గూ, తుమ్ములూ పూర్తిగా తగ్గినప్పుడు.
• సుమారు 24 గంటల తేడాలో రెండు శ్వాస నమూనాల్లో వైరస్ లేదని తేలినప్పుడు.
ఇవన్నీ దాటినా సుమారు రెండు నెలల వరకూ రోగి జాగ్రత్తలు పాటించాలి.
ప్రధానంగా ప్రతీ ఒక్కరు విధిగా చేతులకు శానిటైజర్.. ముక్కు, నోటికి మాస్క్.. ఇతరుల నుండి సామాజిక దూరం పాటించాలి.కోవిడ్-19 గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి విస్తరించే అవకాశం ఉంది.
కాబట్టి దగ్గొచ్చినా, తుమ్మొచ్చినా శుభ్రమైన గుడ్డను అడ్డం పెట్టుకోవాలి.
అత్యవసర సమయాల్లో మడచిన మోచేతిని అడ్డుగా పెట్టుకోవాలి.
వైరస్ ఎక్కువగా ఉన్న దేశాల నుండి వచ్చిన వారికీ దూరంగా ఉండాలి, చేతిలో చేయి కలపడం వంటివి చేయకూడదు.
ఎప్పటికప్పుడు సబ్బు, ఆల్కహాల్‌తో కాళ్లు, చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
దగ్గు, తుమ్ములతో బాధ పడుతున్న వారికి దూరంగా ఉండాలి.
ముక్కు, నోటిని కప్పి ఉంచే మాస్క్‌లు ధరించాలి.
మాంసాహారం మానేయడం లేదా ఉడికీ ఉడకని మాంసం తినకుండా ఉండడం, మాంసాహార విక్రయశాలకు వెళ్లకుండా ఉండటం ఉత్తమం
వన్యప్రాణులకు దూరంగా ఉండటం లేదా సరైన సంరక్షణలో లేని జంతువుల వద్దకు వెళ్లకుండా ఉండడాలి
అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు మానుకోవడం
అనారోగ్యం ఉంటే ప్రయాణం చేయకపోవడం
గుంపుగా ఉన్న చోటకు వెళ్లకుండా ఉండటం
ఆస్పత్రుల్లో జాగ్రత్తగా ఉండటం
ఉతికిన దుస్తులు ధరించడం
వైరస్ సోకిన వారికి దూరంగా ఉండటం