224.txt 4.15 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24
ట్రైకోమోనాస్

https://te.wikipedia.org/wiki/%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B1%88%E0%B0%95%E0%B1%8B%E0%B0%AE%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D


ట్రైకోమోనాస్ వజినాలిస్ (Trichomonas vaginalis), ప్రోటోజోవా కు చెందిన ఒక పరాన్న జీవి.
దీని వలన వచ్చే వ్యాధిని ట్రైకోమోనియాసిస్ (Trichomoniasis) అంటారు.
ఇది అభివృద్ధి చెందిన దేశాలలో సంభవించే ప్రోటోజోవా వ్యాధి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 180 మిలియన్ ప్రజలు దీని బారిన పడుతున్నారు.
ఒక్క దక్షిణ అమెరికా లోనే సుమారు 5 నుండి 8 మిలియన్ కొత్త కేసులు గుర్తిస్తున్నారు; అందులో సగం మందికి ఏ విధమైన వ్యాధి లక్షణాలు లేవు.
ట్రైకోమోనియాసిస్ (Trichomoniasis) రతి ద్వారా వ్యాపించే అంటు వ్యాధి.
ఇది ఎక్కువగా స్త్రీలలో కనిపిస్తుంది.
యోని (Vagina) లోని ఆమ్లత్వం తగ్గినప్పుడు ట్రైకోమోనాస్ పెంపొంది వ్యాధిని కలుగజేస్తాయి.
ఈ వ్యాధి మూలంగా నెలలు నిండకుండా కాన్పు రావడం, పిల్లలు తక్కువ బరువుండడం జరుగుతుంది.
టి.వజినాలిస్ వలన ముత్ర వ్యవస్థ, ఫెలోపియన్ నాళాలు, కటిలో ఇన్ఫెక్షన్ రావచ్చును.
సామాన్యంగా ఇది సోకిన స్త్రీలకు పసుపు ఆకుపచ్చని యోని ద్రవాలు ఊరి దురదను కలిగిస్తాయి.
తొడుగు (Condom) ఉపయోగించడం వలన దీనినుండి రక్షించుకోవచ్చును.
సామాన్యంగా చేసే పాప్ స్మియర్ పరీక్ష (Pap smear) లో ఇవి కనిపించినా అనుభవం లేనివారికి వీనిని గుర్తించడం కష్టం, అందువలన ఈ పరీక్ష ద్వారా వ్యాధి గుర్తించే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది.
ట్రైకోమోనాస్ క్రిముల్ని యోనిద్రవాలను తడిగానే సూక్ష్మదర్శిని ద్వారా పరీక్షించి వీనియొక్క స్క్రూ చలనం మూలంగా సులువుగా గుర్తించవచ్చును.
ప్రస్తుతం అన్నింటి కన్నా క్రిముల వర్ధనం (Culture) ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చును.
with a sensitivity range of 75-95%.
ఈ వ్యాధిని మెట్రోనిడజోల్ (Metronidazole లేదా టినిడజోల్ (Tinidazole) మాత్రలతో సులువుగా నయం చేయవచ్చును.
అయితే జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏమంటే ఈ మాత్రలను రతిలో వారి భాగస్వామి కూడా వాడాలి.
లేకపోయినట్లయితే వ్యాధి మల్లీ వస్తుంది.