తేనెబంక తెగులుhttps://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B1%87%E0%B0%A8%E0%B1%86%E0%B0%AC%E0%B0%82%E0%B0%95_%E0%B0%A4%E0%B1%86%E0%B0%97%E0%B1%81%E0%B0%B2%E0%B1%81తేనెబంక తెగులును ఏర్గాట్ తెగులు అని కూడా అంటారు.ఈ తెగులు ఎక్కువగా జొన్న, సజ్జ పంటలను ఆశిస్తాయి.సజ్జ వంటి పంటలలో, పుష్పించే దశలో అధిక తేమతో కూడిన చల్లని వాతావరణ పరిస్థితులలో ఈ శిలీంద్రము కంకిలోని పుష్పాలను ఆశించి అండాశయం పై వృద్ధి చెందుతుంది.వ్యాధి సోకిన గింజల నుండి తెల్లని లేక లేత ఎరుపు రంగు జిగట లాంటి తీయటి ద్రవం చుక్కలు చుక్కలుగా బయటికి వస్తుంది .దీనిలో శిలీంద్రబీజాలు ఉంటాయి .దీని తర్వాత వ్యాధి సోకిన గింజల్లో నల్లటి స్క్లిరోషియాలు ఏర్పడును.దీనిని ఎర్గాట్ దశ అని అంటారు.ఈ వ్యాధి పంట పొలాలలో కీటకాల ద్వారా, వర్షపు ద్వారా ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందును.1.తెగులు సోకని పొలము నుండి విత్తనాలు సేకరించాలి.2.వేసవిలో లోటు దుక్కులు చేయాలి 3.పొలం గట్లపై ఉన్న కలుపు మొక్కలను తీసివేయాలి.1.పేడ మూత్ర ద్రావణాన్ని 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.2.గోబాణం ద్రావణాన్ని పిచికారి చేయాలి.↑ వివిధ పంటలకు వచ్చే చీడ పీడలు వాటి యాజమాన్య పద్ధతులు.ఏకలవ్య ఫౌండేషన్ సేంద్రియ వ్యవసాయం.