237.txt 4.22 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24
నిపా వైరస్

https://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BE_%E0%B0%B5%E0%B1%88%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D

నిపా వైరస్‌ అరుదైన, తీవ్రమైన ప్రాణాంతకమైన వైరస్ వ్యాధి.
గబ్బిలాలు, పందులు, మనుషులలో ఎవరి నుంచి ఎవరికైనా ఈ వైరస్‌ సోకుతుంది.
1998లో మలేషియాలో మొదటిసారిగా వైరస్‌ కనుగొనబడింది, అటుతర్వాత 2004లో బంగ్లాదేశ్ లోకి వచ్చింది, ప్రస్తుతం ఈ వైరస్‌ కేరళలోకి ప్రవేశించింది.
మలేసియాలోని సుంగాయ్ నిపా అనే గ్రామంలోని రోగుల నుంచి తొలిసారిగా ఈ వైరస్ ను కనుగొన్నారు కాబట్టి, దీనికి నిపా వైరస్‌ గా నామకరణం చేశారు.
ఈ వ్యాధితో మలేషియాలో 105 మంది మృతి చెందగా, సింగపూర్‌లో పందులను పెంచే పశుపోషకులు మృతి చెందారు.
వైరస్ సోకిన వ్యక్తుల్లో 5 నుంచి 14 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి.
తలనొప్పి, శ్వాస తీసుకోలేకపోవడం, తల తిరుగుడు, వాంతులు, జ్వరం, మత్తు, మతిస్థిమితం తప్పినట్టు అనిపిస్తుంది.
వ్యాధి తీవ్రత ఎక్కువైతే 24 నుంచి 48 గంటల్లో కోమాలోకి వెళ్లి మృతి చెందే ప్రమాదం ఉంది.
ఇది గాలి ద్వారా సోకదు, అప్పటికే వైరస్‌ సోకిన జంతువు లేదా మనిషి నుండి మాత్రమే వ్యాపిస్తుంది.
ఫ్రూట్‌ బ్యాట్‌గా చెప్పుకునే పెట్రో పొడిడే వర్గానికి చెందిన గబ్బిలాలు ఈ వ్యాధి వ్యాప్తికి తొలి వాహకాలు.
ఇవి కొరికి పడేసిన పండ్లు, కాయలు తింటే వైరస్‌ ఇతరులకు సోకుతుంది.
2004లో బంగ్లాదేశ్ లో ఈ వైరస్‌ సోకిన గబ్బిలాలు ఎంగిలి చేసిన తాటి గుజ్జు తినడం మూలంగా మనుషులకు సోకిందని వైద్యులు తెలిపారు.
నిపా వైరస్‌ కి చికిత్సలేదు.
దీనిని నియంత్రించే టీకాలు ఇంకా తయారుకాలేదు.
వైరస్‌ ఉన్న ప్రాంతాల్లో పందులు, గబ్బిలాలు లేకుండా చూసుకోవడంతోపాటు ఈ క్రింది నివారణ చర్యలు తీసుకోవాలి.
పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి.
పళ్ళు, కూరగాయల ను పరిశుభ్రపరిచిన తర్వాతే తినాలి.
తినేముందు చేతుల ను ప్రతిసారీ సబ్బు తో కడుక్కోవాలి.
గబ్బిలాలు ఆహారంగా మామిడి పండ్లు, జాక్‌ ఫ్రూట్స్‌, రోజ్‌ ఆపిల్స్ లను తీసుకుంటాయి.
వీటిని వినియోగించేప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి.