239.txt 2.6 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
నివారణ

https://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A3

నివారణ (Prevention) ఒక వ్యాధి, ప్రమాదం మొదలైన బాధలు కలుగకుంటా జాగ్రత్త వహించడం.
వ్యాధి నివారణలో కొన్ని వ్యాధులు రాకుండా ముందుగా టీకాలు తీసుకుంటాము.
అంటువ్యాధులు వ్యాపించకుండా వ్యాధిగ్రస్తుల్ని వేరుగా ఆసుపత్రులలో ఉంచి వైద్యం చేస్తాము.
చేతులు శుభ్రం చేసుకోవడం వ్యాధి నివారణలో ముఖ్య పాత్ర వహిస్తుంది.
ప్రాథమిక నివారణ : వ్యాధి పూర్తిగా రాకుండా జాగ్రత్త తీసుకోవడం.
ఉదాహరణ: ఆరోగ్య పరిరక్షణ విధానాలు
ద్వితీయ నివారణ : వ్యాధుల్ని ప్రాథమిక దశలో గుర్తించడం, అందుమూలంగా వాటి తీవ్రత పెరగకుండా జాగ్రత్త వహించవచ్చును.
తృతీయ నివారణ : నిర్ధారించబడిన వ్యాధులనుండి త్వరగా కోలుకొనే విధానాలు, ఇతర కష్టాలు కలుగుకుండా జాగ్రత్త వహించడం>
రహదారి ప్రమాదాలు జరుగకుండా రహదారి నిబంధనలు పాటించడం, హెల్మెట్, సీట్ బెల్టు ధరించడం ప్రధానమైనవి.
అగ్ని ప్రమాదాలలో మంటలు వ్యాపించడాన్ని నిరోధించడం అతి కీలకమైనది.
నేరాలు జరుగకుండా నివారించే పద్ధతులు పాటించి మనల్ని రక్షించుకోవచ్చును.
కొన్ని పరికరాలు ఎక్కువకాలం పనిచేయడానికి వాటికి నిర్ణీత కాల వ్యవధిలో నివారణ చర్యలు తీసుకోవలసి వుంటుంది.