247.txt 4.41 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25
పాముపొడ తెగులు

https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%BE%E0%B0%AE%E0%B1%81%E0%B0%AA%E0%B1%8A%E0%B0%A1_%E0%B0%A4%E0%B1%86%E0%B0%97%E0%B1%81%E0%B0%B2%E0%B1%81

పాముపొడ తెగులు రైజోక్టోనియా సోలాని అనే శిలీంద్రం వల్ల కలిగే వ్యాధి.
ఈ వ్యాధి సోకిన ఆకులు ఎండిపోయి వేగంగా చనిపోతాయి, ఈ తెగుళ్లను పోడస్ తెగులు అని కూడా అంటారు.
ఈ తెగులు  వరి పంటను ప్రధానంగా రెండు దశల్లో ఆశిస్తుంది.
సామాన్యంగా వరి మొక్క పిలకలు పెట్టు దశ నుండి ఎప్పుడైనా ఈ తెగులు ఆశించవచ్చు .
ఈ శిలీంద్రం వలన కాండంపై ఉన్న ఆకుల మీద చిన్న గోధుమరంగు మచ్చలు ఏర్పడి అవి క్రమేపి పెద్దవై పాముపొడ వంటి మచ్చలుగా మారతాయి .
ఈ మచ్చలు ఒక క్రమపద్ధతిలో ఉండవు.
మచ్చల చుట్టూ గోధుమ వర్ణం కలిగి మధ్య భాగం బూడిదరంగులో ఉంటుంది.
వరి మొక్కలు వెన్నులు పైకితీయు దశ లో శిలీంద్రం వ్యాపించి ఆకులపై మచ్చలు ఒక దానితో ఒకటి కలిసిపోయి ఆకులు, మొక్కలు ఎండిపోతాయి.
వరి మొక్కలు పిలకలు పెట్టే దశలో తెగులు సోకినప్పటికీ వెన్ను పైకి తీయు దశలో పై ఆకులు ఎండిపోతున్న సమయంలో రైతులు దీనిని గుర్తించడం జరుగుతుంది.
ఈ శిలీంద్రం వలన ఏర్పడిన మచ్చలపై ఆవగింజ పరిమాణంలో ఈ నల్లటి శిలీంద్ర బీజాలు ఉత్పత్తి అవుతాయి.
వరి పైరు కోసే సమయంలో ఈ బీజాలు కొన్ని రాలిపోయి మరి కొన్ని ధాన్యంతో కూడా కలుస్తాయి .
ప్రవాహపు నీటి ద్వారా శిలీంద్ర బీజాలు ఒక పొలం నుండి ఇంకో పొలానికి చేరతాయి .
వరి మొక్కల పైన కాకుండా చాలా రకాల గడ్డిజాతి కలుపు మొక్కలపై కూడా వృద్ధి చెందుతుంది .
వాతావరణంలో తేమ అధికంగా ఉండి ఉష్ణోగ్రత 23-35 సేం.గ్రే మధ్య ఉన్నపుడు, వరి నాట్లు దగ్గర దగ్గరగా నాటినప్పుడు, అధిక నత్రజని ఎరువులు వేసినప్పుడు ఈ తెగులు అధికంగా వృద్ధి చెందుతుంది .
1.విత్తనశుద్ధి చేసిన విత్తనాలను వాడాలి.
2.వ్యాధి నిరోధక రకాలను వాడాలి.
3.తెగులుకు నివాసమైన గడ్డి జాతి కలుపు మొక్కలను తీసివేసి పొలం గట్లను శుభ్రంగా ఉంచాలి.
1.శొంఠి పాల కషాయాన్ని పిచికారి చేయాలి.
2.బయోగ్యాస్ నుండి వచ్చిన స్లర్రి ని వడపోసి తగిన మోతాదులో నీటికి కలిపి పిచికారి చేయాలి.
చీడ పీడల యాజమాన్యం నివారణ పద్దతులు.
ఏకలవ్య ఫౌండేషన్ సేంద్రియ వ్యవసాయం.