బెరిబెరిhttps://te.wikipedia.org/wiki/%E0%B0%AC%E0%B1%86%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AC%E0%B1%86%E0%B0%B0%E0%B0%BFబెరిబెరి (Beriberi) విటమిన్ బి1 లేదా థయామిన్ లోపం వల్ల మానవులలో సంభవించే వ్యాధి.ఈ విటమిన్ బియ్యం మీద ఉండే తవుడులో ఉంటుంది.బెరిబెరి ఈ వ్యాధికి రెండు రకాలు ఉన్నాయి: తడి బెరిబెరి, పొడి బెరిబెరి.తడి బెరిబెరి గుండె ప్రసరణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.తీవ్రమైన సందర్భాల్లో, తడి బెరిబెరి గుండె ఆగిపోవడానికి కారణమవుతుంది.పొడి బెరిబెరి నరాలను దెబ్బతీస్తుంది, కండరాల బలం తగ్గడానికి దారితీస్తుంది,చివరికి కండరాల పక్షవాతం వస్తుంది.సరి అయిన చికిత్స చేయకపోతే బెరిబెరి తో ప్రాణములు పోవచ్చును.విటమిన్ -బి 1 (థయామిన్) అధికంగా ఉండే ఆహారాల తీసుకుంటే బెరిబెరి అభివృద్ధి చెందే అవకాశాలు తక్కువ.ప్రస్తుతము బెరిబెరి ఎక్కువగా మద్యపాన తాగే వారిలో ఉన్న వారు తొందరగా వారిలో ప్రభావము చూపవచ్చును.గర్భధారణ సమయములో విపరీతమైన వికారం, వాంతులు (హైపెరెమిసిస్ గ్రావిడారమ్), ఎయిడ్స్ ఉన్నవారిలో బారియాట్రిక్ శస్త్రచికిత్స తర్వాత ఈ వ్యాధి కనిపిస్తుంది.తడి బెరిబెరి లక్షణాలు: పని చేసే సమయంలో శ్వాస ఆడకపోవడం, ఊపిరి పీల్చుకోవడంలో బాధ,కాళ్ళు వాపులు.బి.పి (low blood pressure ) ఇలాంటివి సూచిస్తాయి.పొడి బెరిబెరి లక్షణాలు:కండరాల పనితీరు తగ్గించడం, కాళ్ళలో, పాదాలు,చేతులు తిమ్మిరిగా ఉండి వీటితో పక్షపాతం రావడం, మానసిక గందరగోళం,మాట్లాడటం కష్టం, వాంతులు, కంటి చూపు కు నష్టం ఇలాంటివి సూచించ గలవు.బెరిబెరి రావడానికి కారణం విటమిన్ బి 1 ( థయామిన్) తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం.బెరిబేరి నుంచి కాపాడుకోవడానికి అల్పాహారం లో తృణధాన్యాలు, రొట్టెలు వంటివి తీసుకోవడం, దంపుడు బియ్యం ( బ్రౌన్ రైస్) లో థయామిన్ మొత్తంలో పదవ వంతు గా ఉంటుంది బెరిబెరీని నిర్ధారించడానికి వ్యక్తి యొక్క రక్తంలో థయామిన్ స్థాయిలను కొలవడానికి వైద్యులు రక్తం,మూత్ర పరీక్షలపై ఆధారపడతారు.నాడీ సంబంధిత నష్టం, గుండెతో ఉన్న సమస్యల కోసం వారు శారీరక పరీక్షను కూడా చేస్తారు.నరాల నష్టంతో నడవడం లేదా సమతుల్యతతో ఉండటం, సమన్వయం లేకపోవడం, వంటివి పరీక్షలు జరుపుతారు.వ్యక్తి యొక్క గుండె పరీక్షలు ( బి.పి, ఇ.సి.జి, గుండె స్పందన రేటు (pulse)), శరీరము లో వాపులు వంటివి చూస్తాడు, ఇవి అన్ని గుండె సమస్యలను సూచిస్తుంది.బెరిబెరి చికిత్స లక్ష్యం శరీరంలో థయామిన్ స్థాయిలను పెంచడం.వ్యక్తి యొక్క మొత్తం ఆరోగ్యాన్ని బట్టి ఈ థయామిన్ పంపిణీ చేయడానికి వైద్యులు నోటి మందులు, ఇంజెక్షన్లను సిఫారసు చేయవచ్చు.వీటికి తోడు ఇతర సప్లిమెంట్లను తీసుకోవాలని చెప్పవచ్చును.చికిత్స సమయంలో, వైద్యులు సాధారణ స్థితికి వచ్చే వరకు వ్యక్తి యొక్క థయామిన్ స్థాయిలను చూడడానికి సాధారణ రక్త పరీక్షలను చెప్పవచ్చును.బెరిబెరీని నివారించడానికి ఆహారంలో తగినంత విటమిన్ బి 1 ( థయామిన్) తీసుకోవాలి.ఒక వ్యక్తి తాను తీసుకొనే ఆహరం పై దృష్టి పెట్టి ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకునే వ్యక్తికి థయామిన్ లోపం గురించి ఆందోళన పడవలసిన అవసరం లేదు.సహజంగా థయామిన్ కలిగి ఉన్న ఆహారాలు మాంసం, తృణ ధాన్యములు,బీన్స్, చేపలు, పాల ఉత్పత్తులు, రొట్టె, ముఖ్యం గా అల్పాహారం లో తృణధాన్యాలు వస్తువులు వంటి అనేక ఆహారాలు కూడా ఉన్నాయి.ఒక వ్యక్తి తక్కువ మోతాదులో థియామిన్ సప్లిమెంట్లను తీసుకోవడం కొనసాగించాల్సిన అవసరం ఉంది, రాకుండా చూసుకోవటానికి వారి ఆహారంలో మార్పులు చేసుకోవాలి. జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.