మశూచిhttps://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B0%B6%E0%B1%82%E0%B0%9A%E0%B0%BFమశూచి (smallpox) ఒక భయంకరమయిన అంటువ్యాధి.చికెన్ పాక్స్ వైరస్ అనే చిన్న క్రిముల దార్వావచ్చు చర్మవ్యాధి (Varicella-zoster)ఈ వ్యాధినే 'స్మాల్‌పాక్స్ (smallpox) ' లేదా 'స్పోటకం' లేదా చిన్న అమ్మవారు అని అంటారు.'వరియొల వైరస్' వల్ల ఈ వ్యాధి Seshagirirao-mbbs, Dr vandana (2011-11-15)."Vydya Ratnakaram (Telugu), వైద్య రత్నాకరం / Dr.Vandana Seshagirirao MBBS: మశూచి , Smallpox".Vydya Ratnakaram (Telugu), వైద్య రత్నాకరం / Dr.Vandana Seshagirirao MBBS.ఈ వ్యాక్సిన్ మశూచితో పోరాడే విధంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.ఈ వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రావడంతో మశూచి తగ్గుముఖం పట్టింది.అయితే ఈ వ్యాధి పూర్తిగా కనుమరుగు అవడానికి రెండు శతబ్దాలు పట్టింది.1980లో ప్రపంచ ఆరోగ్య సంస్థ భూమిపై మశూచి వ్యాధి పూర్తిగా తొలగిపోయిందని ప్రకటించింది.ముఖం, వీపు, ఛాతీ భాగములో దురదతో కూడిన చర్మవ్యాధి.ఈ వ్యాధి సోకిన మూడోరోజు శరీరం మీద ఎర్రని చిన్న గుల్లలు నీటితో కూడిన బొబ్బలు వస్తాయి.చివరకు ఒకలాంటి ద్రవంతో పొక్కులుగా మారతాయి.ఈ పొక్కులు శరీరంపై గుంటలతో కూడిన మచ్చల్ని శాశ్వతంగా ఏర్పరుస్తాయి.ఈ లక్షణాలకు ముందు 2 రోజులు తేలికపాటి దగ్గు, జలుబు, తేలికపాటి జ్వరము, తలనొప్పి, నీరసము, ఆకలి తగ్గుట, తేలికపాటి కడుపునొప్పిలాంటి లక్షణాలు కనిపిస్తాయి.ప్రత్యక్ష స్పర్శ, రోగి వాడిన వస్తువులను వాడటం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుందిచికెన్ పాక్స్ తో బాధపడుతున్న వ్యక్తిని - ఆరోగ్యంగా వున్నవారు తాకిన; వారు తుమ్మినప్పుడు - దగ్గినప్పుడు - వైరస్ క్రిములు గాలి ద్వారా ఎదుటవున్న వారిలో ప్రవేశించి - ఈ జబ్బు వస్తుంది.ఇది ఒకరినుండి ఇంకోకరికి సోకే అంటువ్యాధి.చర్మముపై లక్షణాలు కనపడక ముందు 2 రోజులనుండి - దద్దుర్లు పూర్తిగమాని, మచ్చలుగా తయారయ్యేంతవరకు ఈ క్రిములు ఆరోగ్యవంతులకు సోకే అవకాశం వుంటుంది.చిన్నపిల్లలు, యుక్తవయస్సు వారిలో ఈ వ్యాధి ఎక్కువ శాతం వస్తుంది.చిన్నపిల్లల సంరక్షణ సంస్థలు, పాఠశాలలు, మురికి వాడలలో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.దద్దుర్లను, బొబ్బలను గీరకూడదు, చిట్లించరాదు.వీలైనంతవరకు పిల్లలకు గోళ్ళు లేకుండా చేయాలి, రాత్రులలో- తెలియకుండా గీచుకోకుండునట్లు - చేతులకు శుభ్రమైన గుడ్డకాని, గ్లౌజులుకాని తొడగాలి.పిల్లలకు ఈ జాగ్రత్త నేర్పించాలి, చెప్పాలి.వీలైనంతవరకు చల్లని నీటితో/గోరువెచ్చని నీటితో స్నానము చేయించిన దురదలు కాస్త తగ్గుతాయి.కాలమిన్ లోషన్ తో చర్మముపై పూత దురదను కాస్త తగ్గిస్తుంది.జ్వరము, దగ్గు అధికంగా వున్నా, డాక్టరును సంప్రదించి వైద్యం చేయించడం అవసరం.ఆస్పిరిక్ లాంటి మందు వాడరాదు.సులభంగా జీర్ణమగు అహార పధార్దాలు, ద్రవపదార్దాలు తీసుకోవాలి.పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి.చికెన్ పాక్స్ వున్న వారి వస్తువులు, బట్టలు, సబ్బు మొదలైనవి వేరుగా వుంచాలి.వాడినబట్టలను - వేడినీళ్ళతో శుభ్రపరచాలి.ప్రతిరోజు శుభ్రమైన దుస్తులు వాడాలి.వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం.