మెదడువాపుhttps://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%86%E0%B0%A6%E0%B0%A1%E0%B1%81%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AA%E0%B1%81మెదడు వాపు ని ఆంగ్ల భాషలో ఎన్‌కెఫలైసిట్ లేదా ఎన్‌సెఫలైటిస్ అని పిలుస్తారు. మెదడులోని కణజాలం ఒరుపుని (ఇన్‌ఫ్లమేషన్) మెదడు వాపు అని పిలుస్తారు. ఇది సాధారణంగా వైరస్‌ల వల్ల వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా దీనిలో అనేక రకాలను గుర్తించారు. భారతదేశంలో జపనీస్ ఎన్‌సెఫలైటిస్ వైరస్ వల్ల మెదడు వాపు వస్తుంది. ఈ వైరస్ లు పక్షులు, పందులు, ఎలుకల్లాంటి వాటిలో ఉంటాయి. ఈ జీవులు వైరస్ లకు ఆశ్రయంగా పనిచేస్తాయి. వీటి నుంచి క్యూలెక్స్ దోమకాటు ద్వారా మానవుడిలోకి ప్రవేశిస్తాయి. తలనొప్పి, జ్వరం, మెదడు సక్రమంగా పనిచేయక ఒకవైపు పక్షవాతం కలగడం, మూర్ఛ రావడం లాంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఆశ్రయ జీవులు మన చుట్టుపక్కల లేకుండా చూడటం, దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇది వ్యాప్తి చెందకుండా చూడొచ్చు. టీకాను ఇవ్వడం ద్వారా ఈ వ్యాధి రాకుండా నివారించొచ్చు.