281.txt 7.33 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24
వికలాంగులు

https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B0%B2%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%81%E0%B0%B2%E0%B1%81

మనిషి శరీరంలోని వివిధ భాగాలను అవయవాలు లేక అంగములు అంటారు.
ఈ అంగములు అందరిలో ఒకేలా ఉంటాయి.
కాని కొన్ని సందర్భములలో కొందరికి పుట్టుకతోనో లేదా వ్యాధుల ద్వారానో లేక ప్రమాదాల కారణంగానో అంగవైకల్యం సంభవిస్తుంది.
ఈ విధంగా అంగములలో లోపం ఉన్న వారిని వికలాంగులు లేక అంగవికలురు అంటారు.
వివిధ అవయవముల లోపం ఉన్న వారిని వివిధ రకాలుగా విభజీంచారు.
వీరిని ఇంగ్లీషులో హ్యాండికాప్డ్ (Disability-చేతకాని స్థితి, బలహీనము) అంటారు.
వీరికి చేయూత నందిస్తూ ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉన్నది.
28.12.2016 న అమల్లోకి వచ్చి 19.04.2017 నుండి అమల్లోకి వచ్చిన ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ వికలాంగుల హక్కు (ఆర్‌పిడబ్ల్యుడి) చట్టం ప్రకారం ఆధారంగా వైకల్యం నిర్వచించబడింది.
ఈ చట్టం క్రింది పేర్కొన్న వైకల్యాలను వర్తిస్తుంది: శారీరక వైకల్యం, లోకో మోటో ,కుష్టు వ్యాధి, పక్షవాతము,మరుగుజ్జు,కండరాల బలహీనత,యాసిడ్ అటాక్ బాధితులు,కను చూపులేక  పోవడం ,అంధత్వం,చెవిటి వినికిడి  లేక పోవడం , భాష వైకల్యం, మానసిక  వైకల్యం,మానసిక ప్రవర్తన,(మానసిక అనారోగ్యం మొదలైన వాటిని " వికలాంగులుగా నిర్వహించినారు    .
శారీరక వైకల్యం లో  రెండు రకములుగా  చెప్ప వచ్చును అవి అస్థిపంజర వైకల్యం,  కండరాల లేదా అస్థి వైకల్యాలు, వ్యాధులు , క్షీణత కారణంగా శరీర భాగాల కదలికలతో సంబంధం ఉన్న విలక్షణమైన కార్యకలాపాలను నిర్వహించలేకపోవడం  గా పేర్కొన వచ్చును .
శారీరక వైకల్యం ( అవయముల లోపం ) ఉన్న  వ్యక్తులు   నడవలేక పోవడం, తమంత తాముగా  స్నానం చేయలేక పోవడం,  తనకు సంబంధించిన ఏ  పనినైనా  స్వతంత్రంగా, కార్యాచరణ తో చేయలేక పోవడం వంటి వారిని మనము వికలాంగుల గా చెప్పవచును .
ఒక వ్యక్తి రెండు కారణాల వల్ల  శారీరకంగా వికలాంగుడు కావచ్చు  మొదటిది   పుట్టుకతో వచ్చే / వంశపారంపర్యంగా  వ్యక్తి పుట్టినప్పటి నుండి శారీరక వైకల్యం కలిగి ఉంటాడు లేదా జన్యుపరమైన సమస్యలు, కండరాల కణాలతో సమస్యలు,  పుట్టినప్పుడు గాయం కారణంగా క్రమేణా అవి  అభివృద్ధి కావడం తో వ్యక్తి  చెందిన అంగ  వైకల్యం గా చెప్ప వచ్చును .
రెండవ కారణం   నాడీ వ్యవస్థ యొక్క వ్యాధులు, వీటి  కారణంగా  శరీరములో ఉన్న  భాగాల యొక్క   కదలికలను చేయలేకపోవడం గా  చెప్పవచును .
వ్యక్తులు  రోడ్డు [ప్రమాదాలతో, పని చేసే కర్మాగారములలో గాయబడటం, పారిశ్రామిక ప్రమాదాలు, పోలియో వంటి అంటువ్యాధులు, గుండె పోటు , పక్ష పాతము   క్యాన్సర్ వంటి వ్యాధుల తో  మనుషులు అంగ వైకల్యం పొందుతాడు   .
శారీరక వైకల్యం ( అంగ వైకల్యం )  అనేది ఒక వ్యక్తి యొక్క శరీరంలోని ఒక భాగాన్ని ప్రభావితం చేసే గణనీయమైన, దీర్ఘకాలిక పరిస్థితి, ఇది వారి శారీరక పనితీరు, చైతన్యం,  ధృడత్వం , వక్తి  సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది.
శారీరక వైకల్యం తప్పనిసరిగా నిర్దిష్ట పనులను చేయకుండా  ఆపదు, కానీ వాటిని  ఎదుర్కొన దానికి వ్యక్తులకు  సవాలుగా చేస్తుంది.
మనుషులు చేసే ప్రతి పనిలో  ఎక్కవ సమయం తీసుకునే రోజువారీ పనులు  ఉన్నాయి .
శారీరక వైకల్యాన్ని నిర్వచించడం శారీరక స్థితి గురించి కాదు, పని కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యం ఒక వ్యక్తి  రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో గమనించాలి.
శారీరక వైకల్యం ( అంగ వైకల్యం )లో ఉన్న వారిని సమాజము సముచితముగా మానవతా దృక్పథంతో వారిని సమాజ అభివృద్హిలో వారిని ప్రోత్సహించడమే మన ప్రథమ కర్తవ్యం .
ఇది ప్రభుత్వ బాధ్యతే కాదు, సమాజములో ఉన్న మనుషుల సహకారం అవసరం.