286.txt 21.9 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97
సంతానలేమి

https://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B0%82%E0%B0%A4%E0%B0%BE%E0%B0%A8%E0%B0%B2%E0%B1%87%E0%B0%AE%E0%B0%BF

సంతానలేమి  అనగా పెళ్ళయిన తర్వాత కూడా స్త్రీలు మాతృత్వానికి నోచుకోకపోవడము.
ఇటువంటి స్త్రీలను గొడ్రాలు అని వ్యవహరించేవారు.
కాలం మారిన తర్వాత సంతానలేమి ని ఒక వ్యాధిగా గుర్తిస్తున్నారు.
ఆధునిక జీవన విధానం వల్ల మహిళల్లో సంతానలేమి సమస్య పెరిగిపోయింది.
దీనికి ప్రధాన కారణంగా చదువుకొని ఉద్యోగంలో స్థిరపడాలని, తమ రంగంలో రాణించడం కోసం రాత్రి-పగలు తేడా లేకుండా కృషి చేయాలనే కోరికతో మహిళలు సరైన వయసులో అనగా 18 నుండి 25 సంవత్సరాల వయసులో పెళ్ళి చేసుకోకపోవడం, ఫలితంగా రెండు పడవలపై కాళ్ళు పెట్టినచందంగా ఇల్లు - ఆఫీసు బాధత్యల మధ్య తీవ్రమైన మానసిక ఒత్తడికి లోవవడం వంటి సమస్యలు పుట్టుకొస్తున్నాయి.
పురుషులు కూడా వ్యాపారాలు, ఉద్యోగాల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవ్వడం వంటి సరికొత్త సమస్యలతో బాధపడుతున్నారు.
సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, కాలుష్య వాతావరణంలో జీవించడం, సెల్ ఫోనులు అధికంగా ఉపయోగించడం వంటివి ఇతర సంతానలేమి కారణాలుగా చెప్పుకోవచ్చు.
ఋతుచక్రంలో మార్పులు
కొన్ని వ్యాధుల వలన అండం సరిగా విడుదల కాకపోవడం.
గర్భాశయపు నిర్మాణంలోను, ఆకృతిలోను... పుట్టుకతో వచ్చే లోపాలు
గర్భాశయ మార్గంలో కండరాలు పెరగటం లేదా గర్భాశయ ముఖద్వారం వద్ద ఇన్‌ఫెక్షన్స్
గర్భాశయంలో గడ్డలు
కొన్ని ఇన్‌ఫెక్షన్స్ వలన నాళాలు (ట్యూబ్స్) మూసుకొనిపోవటం, నాళాలలో వాపు ఏర్పడటం.ఆయుర్వేద శాస్త్రం గర్భధారణలో నాలుగు ప్రధాన అంశాలు ప్రస్తావించింది
ఋతువు: సాధారణంగా స్త్రీకి బహిష్టు మొదలైన 12వ రోజు నుండి 16 వ రోజు వరకు ఋతుకాలంగా పరిగణిస్తారు.
12 నుండి 16 రోజుల ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా అండం విడుదల కావచ్చు.
అలాగే స్త్రీ యొక్క వయోపరిమితిని కూడా ఋతుకాలంగా పరిగణిస్తారు.
(సాధారణంగా 21 - 35 సంవత్సరాల వరకు)
క్షేత్రం: కొన్నిసార్లు గర్భాశయ మార్గాలను అవరోధించే కొన్ని వ్యాధుల కారణంగా శుక్ర కణాలు అండాన్ని చేరలేక పోవచ్చు.
కనుక విత్తనం మొలకెత్తటానికి భూమి సారవంతంగా ఉన్నట్లే గర్భాశయం మిగతా భాగాలు ఆరోగ్యంగా ఉండాలి.
అంబు: గర్భపోషణకు ఉపయోగపడే పోషకాలు, గర్భాధారణకు ఉపయోగపడే హార్మోన్లను అంబు అని ఆయుర్వేదం వర్ణించింది.
ఈ హార్మోన్లలో సమతుల్యత లేకపోతే గర్భం రాదు.
సంతానలేమికి శుక్రధాతువు లోపాలు కూడా ప్రధానంగా ఉంటాయి.
బీజం: ఆయుర్వేదంలో పురుషుల్లోని వీర్యాన్ని ‘బీజం’ అనే పదంతో సూచించారు.
అండం పరిమాణం, శక్తి, శుక్ర కణంలో కదలగలిగే సామర్థ్యం, శుక్రకణం నాణ్యత మీద గర్భధారణ ఆధారపడి ఉంటుంది.సంతానం కలగలేదంటే అందుకు మహిళను కారణంగా చూపడం మన సమాజంలో పరిపాటి.
ఇది కేవలం అపోహ మాత్రమే.
సంతానలేమికి కారణాలన్నవి అటు మహిళలలోనూ, ఇటు పురుషులలోనూ లేదా ఒక్కోసారి ఇద్దరిలోనూ ఉండే అవకాశం ఉంది.అసలు పురుషుల్లో సంతానలేమి ఎందుకు వస్తుంది?
ఈ సమస్యను నిరోధించే మార్గాలేంటి?
అనేది పరిశీలిస్తే ... కాలంతో పాటు పరిగెడుతున్న జీవితాలు, నిత్యం పలుసమస్యలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురికావడం కారణంగా సంతాన లేమి సమస్య తెలెత్తుతున్నట్లు నిర్ధార్ధించారు.
మన జీవనశైలితో పాటు కాలుష్యం, వాతావరణం, పొగతాగడం, మద్యం సేవించడం, బిగుతైన దుస్తులు ధరించడం, అధికబరువు, మానసిక ఒత్తిడి, కొన్నిరకాల మందులు, ఆరోగ్యకరమైన వీర్యం ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తాయి.
పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగినంతగా లేకపోవడం, ఉన్నా వాటిలో తగినంత చురుకుదనం లేకపోవడం లేదా వాటి ఆకృతి బాగా లేకపోవడం వంటి లోపాలు ఉన్నప్పుడు వారి భాగస్వామికి గర్భధారణ జరగడం కష్టమే.
మరికొందరి వీర్యంలో అసలు శుక్రకణాలే ఉండకపోవచ్చు.
భార్యాభర్తలు ఏ గర్భనిరోధక సాధనం వాడకుండా ఒక సంవత్సర వైవాహిక జీవితం కొనసాగించిన తరువాత కూడా సంతానం కలుగకపోతే దానిని సంతానరాహిత్యం లేదా సంతానలేమి అంటారు.
ఈ సమస్య ఇప్పుడు మగవారిలో అధికంగా పెరిగిపోతోంది.
ఆధునిక జీవన విధానం మగవారిలో ఈ సమస్యను పెంచుతోంది.
సంతానం కలగచేసే సామర్థ్యం పురుషుల్లో క్షీణిస్తోంది.
వారిలో వీర్య సామర్థ్యం తగ్గిపోతోంది.
దానినే మేల్‌ ఫెర్టిలిటిగా పేర్కొంటున్నారు.
పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగినంతగా లేకపోవడం కూడా సంతానలేమికి కారణం కావచ్చు.
ప్రతి మగవారిలో సాధారణంగా 3-6 మిల్లీలీటర్ల వీర్యం ఉత్పత్తి అవుతుంది.
ఈ వీర్యంలో దాదాపు 60 నుండి 150 మిలియన్ల వీర్యకణాలు ఉంటాయి.
ప్రతి వీర్యకణానికి తల, మెడ, తోక అనే భాగాలు ఉంటాయి.
80 శాతం వీర్యకణాలు మామూలు ఆకృతిని కలిగి వుంటాయి.
మామూలు వీర్యంలో దాదాపు 60 నుంచి 70 శాతం చురుకుగా కదిలే వీర్యకణాలుంటాయి.
పైన చెప్పిన విధంగా వీర్యం వీర్యకణాలను కలిగిఉంటే దానిని సంతానం కలిగించే వీర్యంగా అభివర్ణించవచ్చు.
సాధారణంగా సంతాన సాఫల్య సమస్యలను పరిశీలిస్తే మగవారిలో 40 శాతంగా ఉంటుంది.
ఇద్దరిలో కలిపి 10 శాతం సమస్యలు ఉంటే, తెలియని కారణాలు 10 శాతం ఉంటాయి.
మగవారిలో సంతానలేమి సమస్య తలెత్తడానికి పలు కారణాలున్నాయి.
హార్మోన్ల లోపం, మానసిక ఒత్తిడి, వెరికోసిల్ ఒక రకం కారణాలు ఐతే, ధూమపానం, మద్యపానం మరోరకం కారణాలుగా వైద్యులు నిర్ధారించారు.
బీజంలో వివిధ ఇబ్బందులు, అంగస్థంభన సమస్యలు, పుట్టుకతో వచ్చే లోపాల వల్ల ఇన్‌ఫెర్టిలిటీ తలెత్తుతుంది.
ఇన్‌ఫెర్టిలిటీ సమస్యను తెలుసుకోవడానికి పలు పరీక్షలున్నాయి.
ఆ పరీక్షల ద్వారా కారణం తెలుసుకొని వైద్యుల సలహాపై తగిన మందులు వాడితే ఫలితం ఉండే అవకాశం ఉంటుంది.
సాఫ్ట్‌వేర్, దాని అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సంతానలేమి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2013 సెప్టెంబరు 15 ‘ఫెడరేషన్ ఆఫ్ అబ్‌స్టెట్రిక్స్- గైనకాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ గైనకాలజీ అబ్‌స్టెట్రిక్స్’ సంయుక్తంగా హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ‘రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ’అంశంపై ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సు లో ఫిగో అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్.అరుల్‌కుమారన్, ఫోగ్సీ అధ్యక్షురాలు డాక్టర్ హేమదివాకర్, ఫిగో ప్రెసిడెంట్ ఎలక్ట్ సీఎన్ పురందరే, ఉపాధ్యాక్షురాలు డాక్టర్ శాంతకుమారితో పాటు దేశవిదేశాల నుంచి సుమారు వెయ్యి మంది వైద్య నిపుణులు ఈ సదస్సులో పాల్గొని సిజేరియన్ ఆపరేషన్లు, సంతానలేమి సమస్యలపై విస్తృతంగా చర్చించారు.
సదస్సులో నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు.
ఐటీ రంగాలలో పనిచేసే ఉద్యోగుల్లో ప్రతి ఏడుజంటల్లో ఒక జంట సంతాన లేమితో బాధపడుతోంది.
ఆలస్యపు వివాహాలు, మానసిక ఆందోళన, పని ఒత్తిడి,మారిన జీవన శైలి, ఊబకాయం, రుతుక్రమం తప్పడం వంటి అంశాలే ఇందుకు ప్రధాన కారణం
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎక్కువగా ల్యాప్‌ట్యాప్‌లను ఒడిలో పెట్టుకుని పని చేయడం వల్ల వీర్యకణాల ఉత్పత్తిపై రేడియన్ తీవ్ర ప్రభావం చూపుతోంది.
ప్రతి వంద జంటల్లో 15 శాతం మందికి సంతానలే మి సమస్య వల్ల చికిత్సతీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది.
ఆ పదిహేను శాతంలో కూడా 40 మంది పురుషులే.
ఈ పెరుగుదల రేటు ఆందోళనకరంగా ఉంది.
ఇటీవలి జనాభా లెక్కల ప్రకారం ఇన్‌ఫెర్టిలిటీ రేటు 50 శాతం పెరిగింది.
దేశవ్యాప్తంగా సుమారు మూడు కోట్ల జంటలు సంతానలేమితో బాధపడుతున్నాయి.
మధుమేహం, రక్తపోటు, గుండెపోటు జబ్బులతో సంతాన లేమి సమస్య పోటీపడుతోంది.
ఈ సమస్యకు ఆడవారినే బాధ్యులను చేయడం తగదు... స్త్రీ, పురుషులిద్దరూ ఇందుకు బాధ్యులే.
18 నుంచి 25 ఏళ్లలోపు ఉన్న ప్రతి ఐదుగురు యువకుల్లో ఒకరికి వీర్యకణాల సంఖ్య ఉండాల్సిన దానికంటే తక్కువ గా ఉంటోంది.
అతిగా మద్యం సేవించిడం, పొగతాగడం కూడా ఇందుకు మరో కారణం.ఆయుర్వేద శాస్త్రంలో త్రిదోషాల ప్రాధాన్యతను బట్టి, ఔషధసేవన చేయవలసి ఉంటుంది.
ముఖ్యంగా రసాయనాలు ఇందులో ప్రాధాన్యత కలిగి ఉన్నాయి.
ఇలాగే పంచకర్మలు... ముఖ్యంగా స్నేహ, స్వేద, విరేచన, వస్తి కర్మలు అవసరాన్ని బట్టి చేయవలసి ఉంటుంది.
మానసిక ఒత్తిడి ఉంటే శిరోధార, హార్మోనల్ సమస్య ఉంటే నస్యకర్మ, తక్రధార, ట్యూబల్ బ్లాక్స్ లాంటివి ఉన్నట్లయితే ఉత్తరవస్తి, నీటి బుడగలు, కణతలు... 
ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే యోని పిచు, ఇన్‌ఫెక్షన్స్ ఉన్నట్లయితే యోని ప్రక్షాళన (ఔషధ యుక్త కషాయాల) లాంటి శాస్త్రీయ చికిత్సా విధానాలు, చక్కని పరిష్కార మార్గాలుగా ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడినవి.
ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్ర పద్ధతిలో సత్ఫలితాలు రావాలంటే క్రమం తప్పకుండా ఒక సంవత్సరం ప్రసూతి, స్త్రీ వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పద్ధతులు పాటించవలసి ఉంటుంది.
అల్లోపతి లో సంతానలేమి ఉన్నవారికి ఇప్పుడు మూడు రకాల పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి.
అవి... 1) ఐ.యు.ఐ.
2) ఇక్సీ 3) ఐ.వి.ఎఫ్.
ఐ.యు.ఐ.
: భర్త నుంచి సేకరించిన వీర్యాన్ని ప్రయోగశాల లో పరీక్షించి, దానిలోనుంచి ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్న కణాలను మాత్రం వేరు చేసి సిద్ధం చేస్తారు.
వాటిని ఒక సన్నని గొట్టం ద్వారా స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు.
ఈ ప్రక్రియను అనుసరించడం వల్ల గర్భధారణకు 15 శాతం వరకు అవకాశం ఉంటుంది.
ఇలా ఆరు రుతుచక్రాల పాటు ఈ చికిత్స చేసినా ఫలితం లేకుంటే అప్పుడు ఐ.వి.ఎఫ్.
అనే ప్రక్రియను అనుసరించవచ్చు.
ఇక్సీ: స్త్రీ నుంచి సేకరించిన అండాల్లోకి, పురుషుని శుక్రకణాన్ని ఒక ప్రత్యేకమైన మైక్రో మానిప్యులేటర్ సహాయంతో ప్రవేశపెట్టి ఫలదీకరణం చెందిస్తారు.
వాటిని తిరిగి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు.
ఈ పద్ధతి ద్వారా గర్భధారణ విజయవంతం కావడానికి 40 శాతం వరకు అవకాశాలు ఉంటాయి.
శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉన్నవారిలో ఈ ప్రక్రియ మరింత ఉపయోగకరంగా ఉంటుంది.ఐ.వి.ఎఫ్.
:  దీన్నే ‘టెస్ట్‌ట్యూబ్’ విధానం అంటారు.
ముందుగా పక్వమైన అండాలను స్త్రీ నుంచి బయటకు తీసి, పురుషుడి శుక్రకణాలతో బయటే ఫలదీకరణం చెందిస్తారు.
ఇలా ఏర్పడిన తొలి దశ పిండాల్లో రెండు లేదా మూడింటిని తిరిగి స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు.
ఈ ప్రక్రియ ద్వారా సంతానం కలగడానికి 30 నుంచి 35 శాతం విజయావకాశాలు ఉంటాయి.
ఇటీవలికాలంలో సంతాన సాఫల్య చికిత్సలో మరెన్నో కొత్త విధానాలు అందుబాటులోకి వచ్చాయి.
ఫలదీకరించిన పిండాలలో గర్భాశయంలోకి ప్రవేశపెట్టగా మిగిలిన పిండాలను అతి శీతల పరిస్థితుల్లో ఉంచి తరువాత వాటిని వాడతారు.
అవసరాన్ని బట్టి అండాలను గాని శుక్రకణాలను గాని దాతల నుంచి స్వీకరించి వాడతారు.
వీటితోపాటు పిండాన్ని మరో స్త్రీ గర్భాశయంలో పెంచే వినూత్నమైన సరోగసీ విధానం కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.
"ఆర్కైవ్ నకలు".