సుడిదోమhttps://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B1%81%E0%B0%A1%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8B%E0%B0%AEసుడి దోమ అనేది ఒక కీటకం.దీని శాస్త్రీయ నామం నీల పర్వత ల్యూజెన్స్.ఇది హోమోప్టెర క్రమానికి చెందినది.ఇది వరి పంటను ఆశిస్తుంది.1.ప్రౌడ దశలో రెక్కలు కలిగి ఉండవచ్చు , ఉండక పోవచ్చు.2.ఈ పురుగులు గోధుమ రంగులో ఉంటాయి.3.పిల్ల పురుగులు ( శాభకాలు ) మొదట్లో తెలుపు రంగులో ఉండి తర్వాత గోధుమ రంగుకు మారుతాయి.పెద్ద పురుగులు, పిల్ల పురుగులు వరి దుబ్బుల మొదళ్ళలో చేరి రసాన్ని పీలుస్తాయి.అందువల్ల మొక్కపై భాగానికి పోషక పదార్థాలు అందక ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి .క్రమేపి మొక్కలు మొత్తం ఎండిపోతాయి మొక్కలు సుడులు సుడులుగా పొలంలో అక్కడక్కడ ఎండిపోతాయి.అందుచేత దీనిని " సుడి తెగులు " అని కూడా అంటారు.దీనినే " హాపర్ బర్న్ "అంటారు.ఈ పురుగు మొదట్లో పొలంలో అక్కడక్కడ అశించి ఒక వలయం ఆకారంలో పంటను నాశనం చేస్తుంది.ఈ పురుగు గ్రేసి స్టంట్ ,రేజ్డ్ స్టంట్ అనే వైరస్ తెగుళ్ళను కూడా వ్యాపింపజేస్తుంది.తల్లి పురుగు తన జీవిత కాలంలో 300-400 గుడ్లను ఆకుల తొడిమలలో వరుసగా పెడుతుంది .గుడ్డు దశ 5 రోజులలో గుడ్లు పొదగబడి పిల్ల పురుగులు ( శాభకాలు ) బయటకు వస్తాయి .పిల్ల పురుగులు 10 నుంచి 13 రోజుల్లో అభివృద్ధి చెంది రెక్కల పురుగులు గా మారుతాయి .1.సుడిదోమకు నిరోధక శక్తి గల చైతన్య , కృష్ణవేణి , చందన్ , త్రిగుణ , దీప్తి , నాగార్జున , ప్రతిభ , సస్యశ్రీ , వజ్రం , ధాన్యలక్ష్మి మొదలైన రకాలను సాగు చేయాలి.2.ప్రతి 2 మీటర్ల కు 20 సెంటీ మీటర్ల బాటను వదలాలి దీనినే అల్లేస్ అంటారు.1.దశపత్ర కషాయాన్ని పిచికారి చేయాలి 2.పచ్చిమిర్చి వెల్లుల్లి కషాయాన్ని పిచికారి చేయాలి."వరిలో సుడిదోమ పరేషాన్".ఆంధ్రజ్యోతి Oct 18, 2019.చీడ పీడల యాజమాన్యం నివారణ పద్దతులు.ఏకలవ్య ఫౌండేషన్ సేంద్రియ వ్యవసాయం.