స్పాండిలైటిస్https://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BE%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF%E0%B0%B2%E0%B1%88%E0%B0%9F%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8Dస్పాండిలైటిస్ ను తెలుగులో మెడనొప్పి గా చెప్పవచ్చును.తీవ్రమైన మెడనొప్పితో పాటు తల తిరగడం, తూలి పడిపోతున్నామనే భావన, వాంతులు, వికారం, మానసికంగా దిగులు, ప్రయాణమంటేనే భయం...వెరసీ స్పాండిలైటిస్ ముఖచిత్రమిది.జీవనవిధానంలో మార్పుల వల్ల అనేకమంది స్పాండిలైటిస్ సమస్యతో బాధపడుతున్నారు.మెడలో వెన్నెముక భాగంలో ఏడు పూసలు (డిస్క్) ఉంటాయి.ఈ డిస్కుల మధ్యలో నరాలు ఉంటాయి.ఈ న రాల మధ్య ఒత్తిడి పడటం వల్ల, నరాలు ఒత్తుకోవటం వల్ల మెడనొప్పి, నడుం నొప్పి వస్తుంటుంది.వయసుతోపాటు మన శరీరంలో ఎన్నో మార్పులు కలుగుతాయి.అలానే వెన్నెముకలో కూడా కొన్ని మార్పులు వస్తాయి.ఇది సాధారణంగా 30-50 సంవత్సరాల మధ్య రావచ్చు.వయసు మీరిన తర్వాత డిస్క్‌లలో మార్పులు జరిగి స్పాండిలైటిస్ రావటానికి ఆస్కారం ఉంది.ఈ సమస్య స్త్రీ, పురుషుల్లోనూ వచ్చే అవకాశముంది.వెన్నెముక నిర్మాణంలో, డిస్క్‌ల అమరికలో తమ సహజ స్థితిని కోల్పోయి, డిస్క్‌ల మధ్య ఉన్న ఖాళీ తగ్గి, వెన్నెముక మధ్యలో ఉండే కార్టిలేజ్, నరాలపై ఒత్తిడి కలిగిస్తుంది.ఈ కార్టిలేజ్ వల్ల ఇది డిస్క్ మధ్య కుషన్‌లాగా పనిచేసి సాధారణ ఒత్తిళ్ల వల్ల కలిగే బాధలను తగ్గిస్తుంది.అధిక ఒత్తిడి డిస్క్‌లపై పడినపుడు మన భంగిమల్లో అసౌకర్యం కనిపిస్తుంది.దీనివల్ల మెడ, భుజాలు బిగుసుకొని పోతాయి.సరైన భంగిమల్లో కూర్చోలేక పోవడం, ఎక్కువ సేపు నిలబడటం, కూర్చోవడం వల్ల డిస్క్‌ల్లో మార్పులు వస్తాయి.కంప్యూటర్ ఉద్యోగులు, కాల్‌సెంటర్‌లలో పనిచేసే వారు, ద్విచక్రవాహనాలు నడిపేవారు, అధిక బరువులు మోసేవారు ఈ వ్యాధికి గురవుతుంటారు.మెడనొప్పి, తీవ్రమైన నొప్పితో మెడ తిప్పలేక పోవటం, మెడ నుంచి భుజాల వరకు నొప్పి పాకటం, చేతివేళ్ల వరకు పాకడం, చేతివేళ్ల తిమ్మిరి, చేతిలో పట్టు తగ్గటం, పట్టుకున్న వస్తువులు పడిపోవటం, తలనొప్పి, ఉదయం లేచిన వెంటనే తల తిరగటం, వాంతి వచ్చినట్లు ఉండటం.ఈ వ్యాధి ముదిరితే చేతికి సంబంధించిన కండరాలు కృశించి పోతాయి.దీనివల్ల రక్తసరఫరాలో అంతరాయం ఏర్పడి జీవన్మరణ సమస్యగా మారే అవకాశముంది.చేతుల్లో స్పర్శ తగ్గడం, ఆందోళన, బలహీనత, చెవిలో శబ్దాలు రావడం, బ్యాలెన్సు తప్పి పడిపోవునట్లు అనిపించడం, తరచూ తలనొప్పి, అధిక రక్తపోటు, భుజాలను పైకి ఎత్తలేక పోవటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.నడుము వద్ద నొప్పి, నడుము పట్టినట్టుగా ఉండటం, కదిలితే నొప్పి, నిలబడలేక పోవటం, కాలు పైకి కిందకు ఎత్తలేక పోవటం, నడుము కింది భాగంలో నొప్పి, సయాటికా నరంపైన ఒత్తిడి, నరం కింది భాగంలో బలహీనత, స్పర్శ తగ్గడం, కాళ్లలో తిమ్మిరి వ్యాధి, నడవలేక పోవటం మొదలగు లక్షణాలు ఈ వ్యాధి ఉన్న వారిలో కనిపిస్తాయి.ఎక్స్‌రే సర్వికల్ స్పైన్, ఎంఆర్ఐ సర్వికల్ స్పైన్, డాప్లర్ స్టడీ లాంటి పరీక్షలతో వ్యాధిని నిర్ధారించవచ్చు.మెడకు సంబంధించిన వ్యాయామం చేయడం, మెడపై ఒత్తిడి పడకుండా చూసుకోవటం, అవసరమైతే కాలర్ వాడటం, ప్రయాణాల్లో డిస్క్‌లపై ఒత్తిడి లేకుండా చూసుకోవటం, ఎతైన ప్రదేశాలకు వెళ్లినపుడు జాగ్రత్తలు తీసుకోవటం, తల తిరిగినపుడు ఒంటరి ప్రయాణాలు మానుకోవాలి.శాస్త్రీయ బద్ధతతో కూడిన హోమియోపతి రోగి మూల కారణాన్ని గుర్తించి, సమూలంగా స్పాండిలైటిస్ వ్యాధిని నివారించగలుగుతుంది.సరైన హోమియో వైద్యుని ఎంపిక ముఖ్యం.అనుభవజ్ఞుడైన వైద్యుడు శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఈ సమస్యకు పరిష్కారం చూపించగలుగుతాడు.మానసిక, శారీరక లక్షణాలపై ఆధారపడి, ఆధునిక హోమియో వైద్య చికిత్సతో ఈ సమస్య నుంచి సాంత్వన కలగచేయవచ్చు.సొంత వైద్యంతో సమస్యలు తెచ్చుకోకుండా హోమియో మందులు సరిగా వాడితే స్పాండిలైటిస్ సమస్య మీ నుంచి దూరం అవుతుంది.రస్టాక్స్, బెల్లడొనా, స్పిజిలియా, నూక్స్‌వామ్, సిమ్సీఫీక్వా లాంటి మబందులు సత్వర ఉపశమనానికి తోడ్పడుతాయి.సరైన చికిత్సతో సరైన రీతిలో స్పాండిలైటిస్ బాధలు దూరమవుతాయి.