సుధా చంద్రన్https://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B1%81%E0%B0%A7%E0%B0%BE_%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A8%E0%B1%8Dసుధా చంద్రన్ ఒక భారతీయ భరతనాట్య నృత్యకారిణి, నటి.తాను 1981 జూన్ నెలలో తమిళనాడు లోని "త్రిచీ" వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలుతో నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ విస్మయపరిచిన నృత్యకారిణి.ఈవిడ తెలుగులో మయూరి సినిమాతో తన నట ప్రస్థానాన్ని ప్రారంభించి అనేక సినిమా, టెలివిజన్ ధారావాహికలలో నటించారు.సుధా చంద్రన్ సెప్టెంబర్ 21 1964 న కేరళ లోని కన్నూర్ లో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది.ఆమె ముంబైలో గల మిథీబాయి కళాశాల నుండి బి.ఎ డిగ్రీని ఆ తర్వాత ఎం.ఎ డిగ్రీని పొందారు.జూన్ 5 1981 న ఆమె ముంబై నుండి తమిళనాడుకు విహారయాత్ర సందర్భంగా జరిగిన ఘోర ప్రమాదంలో గాయపడింది.వైద్యులు ఆమె కాలికి తగిలిన గాయానికి కట్టుకట్టారు.రెండు వారముల తర్వాత ఆమె మద్రాసు వచ్చి అచ్చటి వైద్యులను సంప్రదించగా వారు ఆ గాయం కారణంగా ఆమె కాలు తొలగించుటే సరియైన మార్గం అని చెప్పారు.ఆమెకు ఒక కాలిని తొలగించారు.ఆమె జైపూర్ లో వైద్యులు 'జైపూర్ కాలు' ను కృత్రిమంగా అమర్చారు.ఆ తర్వాత ఆమె ఆత్మ సడలని విశ్వాసంతో కృషిచేసి ఆ కృత్రిమ కాలితోనే నాట్య ప్రదర్శనలిచ్చి అందరినీ అబ్బురపరిచారు.ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థల నుండి ఆహ్వానాలు లభించాయి.ఆమెకు అనేక అవార్డులు లభించాయి.ఆమె భారతదేశంతోపాటు ఐరోపా, కెనడా అంరియు మధ్య తూర్పు దేశాలలో అనేక ప్రదర్శనలిచ్చారు.ఆ తర్వాతి కాలంలో ఆమె సినిమా రంగం, టెలివిజన్ రంగంలో ప్రవేశించారు.ఆమెకు ప్రమాదం జరిగిన తర్వాతే ఈ గుర్తింపులన్నీ లభించాయి.ఆమె అనేక మందికి స్ఫూర్తిప్రదతగా నిలిచారు.ఆమె 1984 లో తెలుగులో మయూరి సినిమాలో ఆమె జీవిత చరిత్రకు ప్రభావితురాలైన నృత్యకారిణిగా నటించారు.1986 లో ఆమె హిందీలో "నాచే మయూరి"లో నటించారు.ఆమె 1986 లో రవి డాంగ్ ను వివాహమాడారు.ఆమెకు పిల్లలు లేరు.