304.txt 2.4 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
సురేష్ అద్వానీ

https://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B1%81%E0%B0%B0%E0%B1%87%E0%B0%B7%E0%B1%8D_%E0%B0%85%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A8%E0%B1%80

డా.సురేష్ అద్వానీ (Suresh H Advani) ప్రముఖ భారతీయ వైద్యుడు, క్యాన్సర్ నిపుణుడు.
ఇతడు రక్తంలోని మూలకణాల మార్పిడి (Hematopoietic stem cell transplantation) గురించి విశేష కృషిచేశారు.
భారత ప్రభుత్వం ఇతని వైద్య సేవలకు పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది.
వీరు 8 సంవత్సరాల వయసులోనే పోలియో వ్యాధి బారిన పడినా, చక్రాలకుర్చీ తోనే గ్రాంట్ వైద్యకళాశాలలో పట్టాపొంది ఆంకాలజీలో మాస్టర్స్ డిగ్రీ సంపాదించారు.
ఆ పిదప మూలకణాల మార్పిడి గురించి వాషింగ్టన్ లోని ఫ్రెడ్ హచిన్సన్ కాన్సర్ పరిశోధనా కేంద్రం (Fred Hutchinson Cancer Research Center)లో పరిశోధనలు జరిపారు.
రాష్ట్రీయ క్రాంతివీర్ పురస్కారం, ఉజ్జయినీ (2014)
భారత ప్రభుత్వం నుండి 2002లో పద్మశ్రీ పురస్కారం, 2012లో పద్మభూషణ పురస్కారం తో గౌరవించబడ్డారు.
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి 2005 లో బి.సి.రాయ్ జాతీయ పురస్కారం పొందారు.
హార్వర్డ్ అంతర్జాతీయ వైద్యసంస్థ నుండి ఆంకాలజీలో జీవిత సాఫల్య పురస్కారం (2005) పొందారు.
వైద్యశాస్త్రంలో విశేషసేవలకు గాను ధన్వంతరీ పురస్కారం (2002) పొందారు.