అవని లేఖరాhttps://te.wikipedia.org/wiki/%E0%B0%85%E0%B0%B5%E0%B0%A8%E0%B0%BF_%E0%B0%B2%E0%B1%87%E0%B0%96%E0%B0%B0%E0%B0%BEఅవని లేఖరా(ఆంగ్లం:Avani Lekhara జననం 2001 నవంబర్ 8) భారతదేశానికి చెందిన పారాలింపియన్, రైఫిల్ షూటింగ్ క్రీడాకారిణి.లేఖరా 2020 నాటికి షూటింగ్ క్రీడలో ప్రపంచంలోనే మొదటి అయిదు స్థానాల్లో గల ఉత్తమ క్రీడాకారిణి.2018 పారాలింపిక్స్ లో కూడా పాల్గొన్నది.2020 వేసవి పారాలింపిక్స్ లో 10 మీటర్ల షూటింగ్ లో స్వర్ణ పతకం,50 మీటర్ల షూటింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించి ఒకే పారాలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారత మహిళగా నిలిచింది.అవని 2001 నవంబర్ 8న రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో జన్మించింది.2012లో జరిగిన కారు ప్రమాదంలో పదకొండు సంవత్సరాల వయసులో అవని అంగవైకల్యం పాలైంది.అవని తండ్రి తనను క్రీడలలో పాల్గొనమని ప్రోత్సహించాడు, షూటింగ్ అకాడెమీలో చేర్పించి శిక్షణ ఇప్పించాడు.అవని రాజస్థాన్లో న్యాయ విద్య చదువుతుంది.అవని భారత దేశానికి షూటింగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అభినవ్ బింద్రా ను ఆదర్శంగా భావిస్తుంది.అతని విజయం చూసి తాను కూడా ఆ దిశలో కృషి చేయడం మొదలెట్టింది.2015 లో జైపూర్లోని జగత్పురా క్రీడా భవనంలో తన శిక్షణ ప్రారంభించింది.2017 యూఏఈ లో జరిగిన పారా షూటింగ్ ప్రపంచ కప్ క్రీడల్లో పాల్గొన్నది.అవనీ లేఖరా 13 నవంబర్ 2021న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ అవార్డును అందుకుంది.అవనీ లేఖరాకు 2022లో పద్మశ్రీ పౌర పురస్కారం లభించింది.పారాలింపిక్స్ లో భారత్