310.txt 3.27 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15
భవీనా పటేల్

https://te.wikipedia.org/wiki/%E0%B0%AD%E0%B0%B5%E0%B1%80%E0%B0%A8%E0%B0%BE_%E0%B0%AA%E0%B0%9F%E0%B1%87%E0%B0%B2%E0%B1%8D

భవీనాబెన్‌ పటేల్‌ భారతదేశానికి చెందిన  పారాలింపిక్ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి.
ఆమె 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లో మహిళల టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో రజత పతకం గెలిచింది.
భవీనా ఇప్పటివరకు ఐదు స్వర్ణాలు, 13 రజత పతకాలు, ఎనిమిది కాంస్య పతకాలను గెలిచింది.
భవీనా పటేల్‌ 12 నెలల వయసులో పోలియో బారిన పడింది.
ఆమె నాలుగో తరగతి చదువుతున్న సమయంలో తల్లిదండ్రులు శస్త్ర చికిత్స కోసం భవీనాను విశాఖపట్నం తీసుకవచ్చి చికిత్స ఇప్పించిన ఆరోగ్యం కుదుట పడకపోగా రోజులు గడుస్తున్నకొద్దీ ఆమె కాళ్లు అచేతనంగా మారిపోయాయి.
భవీనా ను 2004లో ఆమె తండ్రి అహ్మదాబాద్‌లోని బ్లైండ్‌ పీపుల్‌ అసోసియేషన్‌లో సభ్యత్వం ఇప్పించాడు.
ఆ అసోసియేషన్‌లో క్రీడా కార్యకలాపాలు కూడా ఉండటంతో భవీనా టేబుల్‌ టెన్నిస్‌ను ఎంచుకుంది.
ఆమె  జాతీయస్థాయిలో టేబుల్‌ టెన్నిస్‌లో అనేక పతకాలు సాధించింది.
భవీనా పటేల్‌ జోర్డాన్, చైనీస్‌ తైపీ, చైనా, కొరియా, జర్మనీ, ఇండోనేసియా, స్లొవేనియా, థాయ్‌లాండ్, స్పెయిన్, నెదర్లాండ్స్, ఈజిప్ట్‌ దేశాల్లో జరిగిన అంతర్జాతీయ టోర్నీలలో పాల్గొన్నది.
ఆమె 2011లో థాయ్‌లాండ్‌ ఓపెన్‌ పారా టేబుల్‌ టెన్నిస్‌లో రజత పతకం,   2013లో ఆసియా చాంపియన్‌షిప్‌లో రజతం, 2018 ఆసియా పారా గేమ్స్‌లో డబుల్స్‌ విభాగంలో రజత పతకం గెలిచింది.
భవీనాబెన్ పటేల్ 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లో మహిళల టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో రజత పతకం గెలిచింది.