వినోద్ కుమార్ (క్రీడాకారుడు)https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8B%E0%B0%A6%E0%B1%8D_%E0%B0%95%E0%B1%81%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D_(%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%A1%E0%B0%BE%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81%E0%B0%A1%E0%B1%81)వినోద్ కుమార్ భారతదేశానికి చెందిన పారా అథ్లెట్స్ క్రీడాకారుడు.ఆయన 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లో డిస్కస్ త్రో విభాగంలో కాంస్య పతకం గెలిచాడు.వినోద్ బీఎస్‌ఎఫ్‌లో సైనికుడిగా చేరి లఢఖ్‌లోని లేహ్‌లో శిక్షణ పొందుతుండగా ప్రమాదవశాత్తు కొండ అంచు నుంచి కిందపడిపోవడంతో తీవ్రమైన గాయాలై, వెన్నెముకకు దెబ్బ తగలడంతో శరీర భాగాల్లో చలనం లేకుండా దాదాపు పదేండ్లకు పైగా పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు.అంతటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొని మళ్లీ జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదలతో డిస్కస్ థ్రోపై పట్టు సాధించాడు.ఆయన 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లో డిస్కస్ త్రో విభాగంలో కాంస్య పతకం గెలిచాడు.అయితే, వైకల్య వర్గీకరణ విషయంలో తోటి అథ్లెట్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వర్గీకరణ ప్రక్రియను సమీక్షించిన నిర్వాహకులు వినోద్ కుమార్‌ను అనర్హుడిగా తేల్చి పతకాన్ని రద్దు చేశారు.