322.txt 1.62 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
అమీబియాసిస్

https://te.wikipedia.org/wiki/%E0%B0%85%E0%B0%AE%E0%B1%80%E0%B0%AC%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B8%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D


అమీబియాసిస్ వ్యాధి 'ఎంటమీబా హిస్టోలిటికా' అనే ప్రోటోజోవా పరాన్న జీవి వల్ల వస్తుంది.
ఈ జీవి కోశీయ దశలో కలుషితమైన నీరు, ఆహారం ద్వారా మానవుడిలో ప్రవేశిస్తుంది.
పేగులో కోశీయ దశ నుంచి వెలువడిన జీవులు పేగు గోడపై దాడి చేసి పుండ్లను ఏర్పరుస్తాయి.
దీనివల్ల రక్తం, జిగట పదార్థాలతో కూడిన విరోచనలవుతాయి.
మలం దుర్వాసనతో ఉంటుంది.
ఈ వ్యాధినే అమీబిక్ డీసెంటరీ అనికూడా పిలుస్తారు.
సరైన ఔషధంతో అమీబియాసిస్ ను పూర్తిగా నయం చేయవచ్చు.
ఆహారం, నీటిపై మూతలను ఉంచడం, వంట, భోజనానికి ముందు చేతులను శుభ్రపరచుకోవడం, కూరగాయలను, పండ్లను కడగడం లాంటి చర్యల ద్వారా వ్యాధి రాకుండా చేయవచ్చు.