323.txt 4.9 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18
అస్సాంలో కోవిడ్-19 మహమ్మారి

https://te.wikipedia.org/wiki/%E0%B0%85%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B8%E0%B0%BE%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B_%E0%B0%95%E0%B1%8B%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%8D-19_%E0%B0%AE%E0%B0%B9%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF

అస్సాంలో కోవిడ్19  మహమ్మారి మొదటి కేసు 2020 మార్చి 31 నమోదైనది.
అస్సాం ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుండి , విదేశాల నుండి వచ్చే ప్రజలకు 14 రోజుల నిర్బంధ అమలుపరిచారు.సోనాపూర్ ఆసుపత్రిలో 200 పడకల ఐసోలేషన్ వార్డులు, గౌహతి మెడికల్ కాలేజీ  ఆసుపత్రిలో 30 పడకల ఐసియు వార్డు, మహేంద్ర మోహన్ చౌదరి ఆసుపత్రిలో 150 పడకలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.అస్సాం పోలీసు సిబ్బంది కోసం 1500 పడకల దిగ్బంధం వార్డులను కూడా ఏర్పాటు చేశారు.
30 మంది వైద్యులు  200 మంది నర్సులను కూడా పోలీసు సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఉంచారు.
అస్సాం అంతటా దాదాపు 5 లక్షల మందిని పరీక్షించారు.
వారిలో 36,818 మంది ప్రయాణికులు రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాలలో పరీక్షలు చేశారు.
మార్చి 15 న అస్సాం ప్రభుత్వం వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని విద్యాసంస్థలు, సినిమా హాళ్ళు, మల్టీప్లెక్సులు, జిమ్‌లు మూసివేశారు.ఏప్రిల్ 27 న అస్సాం ముఖ్యమంత్రి జర్నలిస్టులకు రూ .50 లక్షల జీవిత బీమా రక్షణను ప్రకటించారు.
లాక్డౌన్ సమయంలో రాష్ట్రానికి తిరిగి రాని అస్సాం ప్రజలకు మూడు నెలలకు 2000 రూపాయలు.
విదేశాలలో చిక్కుకున్న 34 మంది అస్సామీ ప్రజలకు ప్రభుత్వం రెండు విడతలుగా 2000 ఇచ్చింది.
కోవిడ్-19 గురించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలలో అవగాహన కల్పించడానికి అస్సాం ప్రభుత్వం యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది.
లాక్డౌన్ 3.0 సమయంలో, అస్సాం ప్రభుత్వం 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిని 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను వైద్య కారణాల వల్ల తప్ప వారి ఇళ్ళ నుండి బయటకు రావద్దని అస్సాం ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్రంలోని అన్ని మండలాల్లో సాయంత్రం 6 నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు.
వైద్య సేవలు, అగ్నిమాపక సేవలు అత్యవసర సేవలు మినహాయింపు ఇచ్చారు.జ్వరాలతో బాధపడుతున్న ప్రజలను తనిఖీ చేయడానికి  రాష్ట్రవ్యాప్తంగా 25000 గ్రామాలకు వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది ఆరోగ్య కార్యకర్తలతో సహా 1,000 వైద్య బృందాలను నియమించింది.
బహిరంగంగా ప్రదేశాలకు వచ్చినప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు.
నియమాలు పాటించలేని వారిపై రూ .500 జరిమానా విధించారు.ఉల్లేఖన లోపం.