325.txt 2.48 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20
కండ్లకలక

https://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B2%E0%B0%95%E0%B0%B2%E0%B0%95

కండ్లకలక (ఆంగ్లం: Conjunctivitis) ఒక రకమైన కంటికి సంబంధించిన అంటువ్యాధి.
వ్యాధిగ్రస్తుల కళ్ళు ఎరుపెక్కి, నీరు కారుతూ ఉంటాయి.
కంటిరెప్పలు ఉబ్బి ఉండవచ్చును.
కళ్ళలో మంట, నొప్పి, కొద్దిపాటి దురద ఉంటాయి.
వెలుతురు చూడటం కష్టం.
కళ్ళలో పుసులు పడతాయి.
ఈ లక్షణాలు ఒక కంటిలో ప్రారంభమై రెండవ కంటికి వ్యాపించవచ్చును.
నిద్ర తరువాత కళ్ళరెప్పలు అంటుకొని తెరవడం కష్టమౌతుంది.
ఈ వ్యాధి త్వరగా వ్యాప్తి చెంది ఎపిడెమిక్ రూపం దాలుస్తుంది.
పొంగు వ్యాధిలోను, సుఖవ్యాధులతోను బాధపడే గర్భవతులకు పుట్టిన బిడ్డలకు కూడా కండ్లకలక సోకే అవకాశాలున్నాయి.
కండ్ల నుండి కారే నీటిని, స్రావాన్ని శుభ్రమైన తడిబట్టతో శుభ్రపరచాలి.
రోగి వాడే బట్టలు, పక్క బట్టలు, తువ్వాళ్ళు మొదలైన వాటికి కళ్ళ రసి అంటి వాటిని ఇతరులు వాడితే వ్యాధి వారికి సోకుతుంది.
కనుక రోగి బట్టలను ప్రతిరోజు నీటితో ఉడికించి క్రిమిరహితం చెయ్యాలి.
రోగి కళ్ళను శుభ్రపరచిన దూది లేక బట్ట ముక్కలను వేరే పోగుచేసి కాల్చివేయడం మంచిది.
 కండ్లకలకకు సహజ చికిత్స
కండ్లకలక దిద్దుబాటు పాలు , తేనతో