330.txt 2.36 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
కలరా

https://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B0%B2%E0%B0%B0%E0%B0%BE

కలరా (Cholera) అనునది అతిసార వ్యాధి.
ఈ వ్యాధి విబ్రియో కలరే అను బాక్టీరియా వలన కలుగుతుంది.
ఇది నీరు ద్వారా లేదా ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతుంది.
ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రాణాంతక వ్యాధి.
ఆతి విరోచనాలతో మొదలయ్యే ఈ వ్యాధి సోకిన వెంటనే వైద్య సహాయం అందకపోతే రోగి మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ప్రపంచంలో నమోదవుతున్న కలరా కేసులు ఎక్కువగా ఆఫ్రికా ఖండం నుంచి నమోదవుతున్నవే.
ఇంకా పర్యవేక్షణా లోపం వల్ల చాలా కేసులు సకాలంలో అధికారుల దృష్టికి రాకుండా ఉన్నాయి.
కలరా సోకిన తర్వాత ఆఫ్రికాలో 5% మంది చనిపోతున్నారు.
అదే ఇతర దేశాల్లో అయితే ఇది కేవలం 1% మాత్రమే.
చాలావరకు కలరా కేసులను ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ ద్వారా నయం చేయవచ్చు.
కలరా వ్యాధి ప్రాణాంతకమైనా దీన్ని మన దైనందిన కార్యక్రమాలన్నింటిలో పరిశుభ్రతను పాటించడం ద్వారా సులభంగా నివారించవచ్చు.
అభివృద్ధి చెందిన దేశాల్లో నీటిని శుద్ధం చేయడానికి మంచి సాంకేతిక పద్దతులు అమలులో ఉండటం వలన ఇది ఆ దేశాల్లో చాలా అరుదు గా కనిపిస్తుంది.