334.txt 6.81 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32
క్షయ

https://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%AF

క్షయ వ్యాధి (Tuberculosis) ఒక అంటువ్యాధి.
ఇది ఊపిరితిత్తులకు సంబంధించినదైనా, చర్మము నుండి మెదడు వరకు శరీరంలో ఏ భాగానికైనా ఈవ్యాధి వచ్చే అవకాశం ఉంది.
భారతదేశంలో దీర్ఘకాలిక రోగాలలో ప్రధానమైనది ఈ క్షయవ్యాధి.
మైకోబాక్టీరియా లేదా మైకో బ్యాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్ అనే సూక్ష్మక్రిమివలన ఈ వ్యాధి వస్తుంది.
క్షయవ్యాధి సోకని శరీరావయవాలు క్లోమము, థైరాయిడ్ గ్రంథి, జుట్టు.
మిగిలిన అవయవాలన్నింటికి క్షయవ్యాధి కలిగే అవకాశం ఉంది.
ఈ వ్యాధి ప్రధానంగా శ్వాసకోశాన్ని దెబ్బ తీస్తుంది.
డా.రాబర్ట్ కోచ్ క్షయ వ్యాధికారక సూక్ష్మక్రిములను మొదటిసారిగా మార్చి 24, 1882 న గుర్తించారు.
ఇందుకుగాను 1905 లో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రదానం చేయబడింది.
ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మార్చి 24 న ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం నిర్వహించబడుతుంది.
సూక్ష్మక్రిముల్ని గుర్తించడం వీటిలో ముఖ్యమైన పరీక్షలు.
కొద్ది నెలల తేడాలో ఆకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం, రాత్రి పూట స్వల్పస్థాయిలో జ్వరం రావడం, జ్వరం వచ్చినప్పుడు బాగా చెమట పట్టడం, నెలల తరబడి తగ్గని దగ్గు వంటివి ముఖ్యమైన రోగలక్షణాలు.
ఎప్పుడైతె క్షయ జబ్బు ఉన్నవారు దగ్గినా, తుమ్మినా లేదా వూసినా, గాలి ద్వారా వేరే వారికి అంటుకుంటుంది.
ప్రపంచ జనాభాలో ప్రతి ముగ్గురులో ఒక్కరికి ఈ వ్యాధి సోకుతుంది.
ప్రస్తుతం క్షయ నిర్ధారణకు వ్యక్తుల నుంచి నమూనాలు సేకరించి, పరిశోధనశాలల్లో బ్యాక్టీరియాను అభివృద్ధి చేస్తున్నారు.
దీనికి దాదాపు ఎనిమిది వారాల సమయం పడుతుంది.
ఇంతకంటే వేగంగా పనిచేసే పరీక్షలు ఉన్నప్పటికీ అవి అన్ని రకాల క్షయ బ్యాక్టీరియాలను గుర్తించలేవు.
క్షయ వ్యాధి నిర్ధారణకు ఇకపై వారాల కొద్దీ వేచి ఉండాల్సిన అవసరం లేదు.
కేవలం ఒక్క గంటలో వ్యాధి తాలూకూ బ్యాక్టీరియాను గుర్తించేందుకు డీఎన్‌ఏ ఆధారిత పద్ధతిని అభివృద్ధి చేసినట్లు బ్రిటన్ హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హెచ్‌పీఏ) శాస్తవ్రేత్తలు ప్రకటించారు.
ఐరోపాలో క్షయ బ్యాక్టీరియా 7 వేల ఏళ్లక్రితమే మనుగడ సాగించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఐరోపాలో ఏడువేల ఏళ్లక్రితమే అత్యంత ప్రాచీన క్షయ కేసు ఉన్నట్లు స్జెగెడ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మురియెల్ మాసన్ పరిశోధనలో వెల్లడైంది.
హైపర్‌ట్రోఫిక్ పల్మనరీ ఆస్టియోపతి (హెచ్‌పీవో) అనే వ్యాధికి వేల సంవత్సరాల క్రితం క్షయ కారణమనీ, పురావస్తు రికార్డుల్లో నమోదైన వివరాల ప్రకారం గుర్తించారు.
ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు దక్షిణ హంగరీలో ఏడువేల సంవత్సరాల క్రితంనాటి ప్రదేశంలో 71 మానవ అస్థిపంజరాలను పరీక్షించారు.
వీటి ఆధారంగా ఇన్ఫెక్షన్లు, జీవక్రియ సంబంధ వ్యాధులకు సంబంధించి పలు కేసులను గుర్తించారు.
కొన్ని అస్థిపంజరాల్లో హెచ్‌పీవోకు సంబంధించిన సంకేతాలు కూడా గుర్తించడంతో క్షయ అప్పట్లోనే ఉన్నట్లు భావిస్తున్నారు.
డీఎన్ఏ, లిపిడ్స్ పరీక్షలు చేపట్టడం ద్వారా క్షయకు సంబంధించిన బ్యాక్టీరియా మనుగడను నిర్ధరించారు.
ఇప్పటి వరకూ హెచ్‌పీవో, క్షయకు సంబంధించి ఇదే అత్యంత ప్రాచీన కేసుగా భావిస్తునట్లు పరిశోధకులు మాసన్ పేర్కొన్నారు.
క్షయవ్యాధి చికిత్స