344.txt 50.5 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177
భారతదేశలో కోవిడ్-19 మహమ్మారి

https://te.wikipedia.org/wiki/%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%B2%E0%B1%8B_%E0%B0%95%E0%B1%8B%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%8D-19_%E0%B0%AE%E0%B0%B9%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF

భారతదేశంలో 2019–2020 కరోనా వైరస్ మొదటి కేసు 2020 జనవరి 30 న నమోదైనది.
వుహాన్ నుండి తిరిగి వచ్చిన కేరళ విద్యార్థికి మొదటి పాజిటివ్ కేసు నమోదయింది.
భారత ప్రభుత్వం తన పౌరులకు, ముఖ్యంగా వుహాన్ లో ఉన్న 500 మంది భారతీయ వైద్య విద్యార్థులకు ప్రయాణంలో సలహా ఇచ్చింది.
చైనా నుండి వచ్చే ప్రయాణీకుల థర్మల్ స్క్రీనింగ్ చేయడానికి ఏడు ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాలను ఆదేశించింది.
మార్చి మొదటి వారంలో, భారతదేశంలో వైరస్ తీవ్రత ఎక్కువ కావడంతో భారత ప్రభుత్వం నివారణ చర్యలు ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఇందులో దేశవ్యాప్తంగా చికిత్సా సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ఏడు మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తున్నాయి.
మార్చి 15 న రాజస్థాన్‌లో కరోనావైరస్ గురించి అవగాహన పెంచడానికి భారతీయ జనతా పార్టీ బహిరంగ ప్రచారం నిర్వహించింది.
కరోనా వైరస్ క్రమంగా దేశంలో వేగంగా విస్తరిస్తుండటంతో భారత ప్రభుత్వం వైరస్ వ్యాప్తి చెందకుండా నిర్ణయాలు తీసుకుంది.
అన్ని థియేటర్లు,వ్యాయామశాలలు, మ్యూజియంలు, సాంస్కృతిక, సామాజిక కేంద్రాలు, మూసేయాలని నిర్దేశించింది.
విద్యార్థులంతా ఇళ్లకే పరిమితం కావాలని, సామాజికంగా ఒకరికొకరు దూరంగా ఉండడమే కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి నివారణకు మంచి మార్గమని పేర్కొంటూ కేంద్ర వైద్యారోగ్యశాఖ 15 నిబంధనలను విధించింది.అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఏవైనా చర్యలు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చని సూచించింది.
మార్చి 31 తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి వీటిని సమీక్షిస్తామని పేర్కొంది.
కేంద్రం 15 షరతులు నిర్దేశించింది.కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యలపై చర్చించేందుకు సార్క్‌ సభ్య దేశాలు మార్చి 13 న,సమావేశమయ్యాయి.
ఈ సమావేశంలో భారత్‌, శ్రీలంక, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, మాల్దీవులు, అఫ్గానిస్థాన్‌, భూటాన్‌, నేపాల్‌ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.
కరోనాను అడ్డుకునే కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం10మిలియన్‌ డాలర్లతో నిధి ఏర్పాటు చేసింది.
మార్చి 22వ తేదీన ప్రజలందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని దేశ ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.
ఇది ప్రజల కోసం, ప్రజలే పాటించే కర్ఫ్యూ కావాలని తెలిపారు.
మార్చి 22వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ దేశప్రజలందరూ రోజంతా మీరు మీ ఇళ్లలోనే ఉండాలని సూచించారు.
మార్చి 24:భారతదేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
ఈ లాక్ డౌన్ 21 రోజులు అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.
సామాన్య ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
ఏప్రిల్ 14:
ఏప్రిల్ 14 న, ప్రధానమంత్రి మోదీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ మే 3 వరకు పొడిగించారు.
మే 1
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం  మరోసారి లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది.
మే 4 నుంచి 17 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
20 మార్చి 2020 న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సింగ్ నిర్వహించారు.COVID-19 ను ఎదుర్కోవటానికి కేసులను నివారించడానికి చర్చించారు
ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు విద్యుత్ లైట్లు ఆపేసి దీపాలు 
దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ ఫ్లాష్ లైట్లు వెలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ చీకటి కాలంలో 130 మంది కోట్ల భారతీయుల మహా సంకల్పాన్ని చాటాలని, ఆ చీకటి వైరస్‌కు వెలుగు శక్తిని పరిచయం చేయాలని ఆయన పేర్కొన్నారు.
వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి మార్చి 9 న మిజోరాం ప్రభుత్వం బంగ్లాదేశ్,మయన్మార్‌ అంతర్జాతీయ సరిహద్దులను మూసివేశారు.
మార్చి 13 న, భారత ప్రభుత్వం ఇండో-బంగ్లాదేశ్,ఇండో-నేపాల్, ఇండో-భూటాన్, ఇండో-మయన్మార్ సరిహద్దు మూసివేశారు.
మార్చి 5 : ఢిల్లీ ప్రభుత్వం ముందుజాగ్రత్తగా అన్ని ప్రాథమిక పాఠశాలలను మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
మార్చి 7 :జమ్మూ జిల్లాలో, సాంబా జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలు మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
మార్చి 9 : కేరళలోని పతనమిట్ట జిల్లా జిల్లా కలెక్టర్ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు మూడు రోజుల సెలవు ప్రకటించారు.
మార్చి 11: కేరళ మార్చి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
మార్చి 12: ఢీల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ న్యూ ఢీల్లీలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్ళను మార్చి 31 వరకు మూసివేస్తామని ప్రకటించారు.
మార్చి 12 : కర్ణాటక ముఖ్యమంత్రి యెడియరప్ప రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు, మాల్స్, సినిమా హాల్స్, పబ్బులను ఒక వారం పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
పార్టీలు, వివాహాలు వంటి బహిరంగ కార్యక్రమాలపై నిషేధ ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
ఒడిశా ప్రభుత్వం, ఈ వ్యాప్తిని "విపత్తు"గా ప్రకటించింది, మార్చి 31 వరకు విద్యాసంస్థలు, సినిమా హాళ్ళను మూసివేస్తున్నట్లు ప్రకటించింది, అలాగే అధికారిక సమావేశాలను నిషేధించింది.
మార్చి 13: పంజాబ్ చత్తీస్గడ్ ప్రభుత్వాలు మార్చి 31 వరకు అన్ని పాఠశాలలు,కళాశాలలలో సెలవులను ప్రకటించాయి.
అదే రోజు మణిపూర్ ప్రభుత్వం మార్చి 31 వరకు సెలవులు ప్రకటించింది.కరోనావైరస్ ముప్పును దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యగా మార్చి 31 వరకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ అన్ని విద్యాసంస్థలు, థియేటర్లు మూసి వేస్తున్నట్లు ప్రకటించారు.
అలాగే, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలను మార్చి 31 వరకు మూసివేస్తామని ప్రకటించింది, అయితే పరీక్షలు యధావిధిగా
నిర్వహించబడతాయి పేర్కొన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం షాపింగ్ మాల్స్, స్విమ్మింగ్ పూల్స్, సినిమా థియేటర్లు, జిమ్‌లను మూసివేసింది, రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలను 2020 మార్చి 31 వరకు సెలవులు ప్రకటించింది.
అన్ని విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది.
అయితే కళాశాల పరీక్షలు యధావిధిగా కొనసాగుతాయి పేర్కొన్నారు.
మార్చి 15: ఐఐటి, బొంబాయి అన్ని విద్యా కార్యకలాపాలను మార్చి 29 వరకు నిలిపివేసింది.
మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు మూసివేయబడతాయని గోవాలో ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు.
కాగా, 10,12 పరీక్షల షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని పేర్కొన్నారు.
గుజరాత్ ప్రభుత్వం అన్ని పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్ళు మార్చి 31 వరకు మూసి వేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే పరీక్షలు యధావిధిగా నిర్వహించబడతాయి అని పేర్కొన్నారు .బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బిపిఎస్సి) అన్ని పరీక్షలను మార్చి 31 వరకు వాయిదా వేసింది.
తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు మార్చి 31 వరకు పాఠశాలలు, మాల్స్, థియేటర్లను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి.
మార్చి 17 : ఉత్తర ప్రదేశ్‌లోని పాఠశాలలు, కళాశాలలు, మల్టీప్లెక్స్‌లు ఏప్రిల్ 2 వరకు మూసి వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
మహారాష్ట్రలో, ప్రభుత్వ కార్యాలయాలు ఏడు రోజులు మూసి వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
పాండిచేరి మార్చి 31 వరకు పాఠశాలలు, కళాశాలలు, సినిమాహాల్స్ జిమ్‌లను మూసి వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 31 వరకు కళాశాలలు పాఠశాలలు థియేటర్లు మూసివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
అయితే పదవతరగతి పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ప్రకటించింది .
మార్చి 24: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు
రెండు వారాలపాటు పరీక్షలు వాయిదా వేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు.
కరోనా వైరస్‌ దృష్ట్యా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌  విధించిన వేళ కేంద్రం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది.
ఆహార అవసరాలు, రోజువారీ అవసరాలకు సాయంగా గరీబ్‌ కల్యాణ్‌ స్కీమ్‌ పేరుతో రూ.1.70లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.
వలస కార్మికులు, పట్టణ, గ్రామీణ పేదలను ఆదుకునేలా ప్యాకేజీ రూపొందించినట్లు చెప్పారు.శానిటేషన్‌ వర్కర్లు, ఆశా, పారామెడికల్‌, వైద్యులు, నర్సులకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున ప్రత్యేక బీమా  సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు
నెలకు 5 కేజీల బియ్యం లేదా 5 కేజీల గోధుమలు,కేజీ పప్పు దీనికి అదనంగా మరో 5 కేజీలను వచ్చే మూడు నెలలూ ఉచితంగా అందిస్తాం అని స్పష్టం చేశారు.రైతులకు : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ₹6000 లో మొదటి భాగం ₹.2000 ఇప్పుడే ఇస్తామని తెలిపారు.ఉపాధి హామీ పథకం: ఈ పథకం  ద్వారా 5 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది.
ఈ పెంపు ద్వారా అదనంగా రూ.2000 ప్రతి కుటుంబానికీ అందుతుంది.జన్ ధన్ యోజన: 20 కోట్ల మంది మహిళా జన్ ధన్ అకౌంటుదారులు రూ.500 ఎక్స్‌గ్రేషియాను వచ్చే 3 నెలలపాటు అందిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
వితంతువులు, దివ్యాంగులు వృద్ధులు ₹1000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.3 కోట్ల మందికి ప్రయోజనం పొందుతున్నారు.
ఉజ్వల పథకం: మూడు నెలల పాటు ఉచిత సిలిండర్లు అందించాలని నిర్ణయించారు.స్వయం సహాయక సంఘాలు: దీన్ దయాళ్ యోజన లైవ్లీహుడ్ మిషన్ ద్వారా అందిస్తున్న కొలేటరల్ రుణాలను రెట్టింపు చేశారు.
దీని పరిమితి రూ.20 లక్షలు.
ఇధి 7 కోట్ల మంది కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తుంది.
భవన నిర్మాణ కార్మికులు: 3.5 కోట్లమంది రిజిస్టర్డ్ కార్మికులకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ నిధి నుంచి సహాయం అందించేందుకు సంబంధిత శాఖలకు తక్షణం ఆదేశాలు జారీచేశారుడిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్: అన్ని రకాల వైద్యపరీక్షలు, స్క్రీనింగ్ పరీక్షలు, అవసరమైన ఇతర అన్ని పరీక్షలు చేయడానికి ఈ నిధిని ఉపయోగించాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకూ సూచించారు.
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం ద్వారా ప్రకటించిన ఈ ప్యాకేజీ ద్వారా పేదలెవరూ కూడా ఆకలితో మరణించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు నిర్మల స్పష్టం చేశారు.
ఈ ప్రయోజనాలకు సంబంధించిన నగదు పేదల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేస్తామని ఆమె తెలిపారు.వ్యవస్థీకృతరంగ కార్మికులు: వీరికి సంబంధించి రెండు ప్రకటనలు వెల్లడించారు.1.ప్రావిడెంట్ ఫండ్: ఉద్యోగి, సంస్థల నుంచి చెల్లించే ఈపీఎఫ్ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది.
ఇది ఉద్యోగుల సంఖ్య 100లోపు ఉన్న కంపెనీలకు, ఉద్యోగి వేతనం రూ.15000కు మించనివారికి మాత్రమే వర్తిస్తుంది.
ఈ ప్రయోజనం వచ్చే 3 నెలల పాటు కొనసాగుతుంది.
2.తిరిగి చెల్లించనవసరం లేని అడ్వాన్స్‌ను అందించేందుకు పీఎఫ్ రెగ్యులేషన్ నిబంధనలను సవరిస్తాం.
ఉద్యోగులు తమ పీఎఫ్ మొత్తంలోని 75శాతం వరకూ లేదా 3 నెలల వేతనం ఈ రెండిట్లో ఏది తక్కువైతే అది తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తాం అని పేర్కొన్నారు.
కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ స్థాయి నుంచి గ్రామ వాలంటీర్లు, సచివాలయం ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించింది.
విశాఖలో పాజిటివ్ కేసు వచ్చిన చోట, ఆ ఇంటి నుంచి ౩ కిమీ వరకూ చర్యలు తీసుకున్నారు.
335 బృందాలు 25,950 ఇళ్లు సర్వే చేశాయి.
ఆ ప్రాంతంలో మరెవరికీ కరోనా లక్షణాలు లేవని నిర్ధారించారు.
నెల్లూరు, ప్రకాశంలో జిల్లాలో పాజిటివ్ కేసుల నివాస స్థలం నుంచి ౩ కిమీ పరిధిలో సర్వే పూర్తి చేసి, అనుమానితులను ఐసోలేషన్ లో ఉంచారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల క్వారంటైన్ సౌకర్యం ఏర్పాటు చేశారు.ప్రతి జిల్లా కేంద్రంలో 200 నుంచి 300 వందల పడకల కరోనా వైద్య చికిత్స ఏర్పాటు చేశారు.
నిత్యావసరాల వస్తువుల ధరలు పెరగకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.
మార్చి 29 నాటికి రేషన్‌ సరుకులు ,కేజీ పప్పు ప రేషన్‌ సరుకును ఉచితంగా పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఏప్రిల్‌ 4న ₹1000 గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఇవ్వాలని నిర్ణయించారు.
కరోనా బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూపొందించింది.
మార్చి 23: న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్ డౌన్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈనెల 31వ తేదీ వరకు ఉంటుందని తెలిపారు.
నిత్యావసర వస్తువులు అందరికి అందుబాటులోనే ఉంటాయని, ఏ వస్తువు ఎంతకు అమ్మాలి అన్నది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం 87.59 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారుల కుటుంబాలకు 12 కేజీల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తాం అని వెల్లడించింది.
నిత్యవసరాలు కొనుగోలు చేయడానికి వీలుగా తెల్ల రేషన్ కార్డుదారులందరికీ రూ.1500 చొప్పున నగదు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపిందిమార్చి 22 న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది.
మార్చి 23 న రాష్ట్ర ప్రభుత్వం రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించింది.
తెలంగాణ ప్రభుత్వం అన్ని సరిహద్దులను మూసివేసి రవాణాను నిలిపివేసింది.
మార్చి 24 అర్ధరాత్రి నుండి కర్ఫ్యూ విధించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ముందస్తుగా గా మార్చి 31 వరకు అన్ని ప్రాథమిక పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
ఢీల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ 72 లక్షల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నట్లు ప్రకటించారు.
మార్చి 22 న, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తరువాత, మార్చి 23 నుండి మార్చి 31 వరకు ఢిల్లీ 
యొక్క పూర్తి లాక్ డౌన్ ప్రకటించారు.
నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
మార్చి 23 న గుజరాత్ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది.
మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది అని గుజరాత్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
అలాగే రాష్ట్ర సరిహద్దులు మూసివేశారు.
హర్యానా ప్రభుత్వం మార్చి 24 న,లాక్ డౌన్ ప్రకటించింది.
హిమాచల్ ప్రభుత్వం మార్చి 23 లాక్ డౌన్  ముఖ్యమంత్రి  జై రామ్ ఠాకూర్  అసెంబ్లీలో ప్రకటించారు.
కరోనావైరస్ వ్యాప్తిని ఎదుర్కోవడానికి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం  మార్చి 24, రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించింది.
మంగళవారం సాయంత్రం 5 గంటలకు కొండ రాష్ట్రంలోని మొత్తం 12 జిల్లాల్లో కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ తెలిపారు.
కర్ణాటక ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా మార్చి 18 నుండి మాల్స్, విశ్వవిద్యాలయాలు , కళాశాలలు, సినిమా థియేటర్లు, నైట్ క్లబ్‌లు, వివాహాలు సమావేశాలు రద్దు చేసింది.
కర్ణాటక కేరళ సరిహద్దులను మూసివేసింది.7 నుండి 9 తరగతుల పరీక్షలను వాయిదా వేసింది.
కేరళ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 4 నుండి 8 వరకు హై అలర్ట్ ప్రకటించింది.
మార్చి 10 న  కేరళ ప్రభుత్వం  పాఠశాలలు, కళాశాలలు మూసివేసింది.
తీర్థయాత్రలు చేయవద్దని, వివాహాలు, సినిమా ప్రదర్శనలు వంటి పెద్ద సమావేశాలకు హాజరుకావద్దని ప్రభుత్వం ప్రజలను కోరింది.
మార్చి 15 న కేరళ ప్రభుత్వం ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత  ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో 'బ్రేక్ ది చైన్' అనే కార్యక్రమం  ప్రవేశపెట్టింది.
కరోనావైరస్ బారిన పడి ఇతర  దేశాల నుండి తిరిగి వచ్చేవారికి 28 రోజుల ఇంటి నిర్బంధాన్ని తప్పనిసరి అని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది.
మార్చి 22 న మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సెక్షన్ 144  ప్రకటించింది.
మార్చి 23 మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది.
మార్చి 23 న సిఎం ఉద్ధవ్ ఠాక్రే అన్ని జిల్లాల సరిహద్దులను మూసివేస్తున్నట్లు రాష్ట్రవ్యాప్తంగా కఠినమైన కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు.
ఒరిస్సా ప్రభుత్వం మార్చి 21 న రాష్ట్ర రాజధాని భువనేశ్వర్తో సహా 70 శాతం లాక్ డౌన్ చేయాలని నిర్ణయించింది.
మార్చి 22 న, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రమంతా లాక్ డౌన్ చేసింది.
బస్సు సర్వీసులు, ప్యాసింజర్ రైళ్లు కూడా నిలిపివేశారు.పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 13 నుండి మార్చి 31 వరకు అన్ని పాఠశాలలు , కళాశాలలలో సెలవులను ప్రకటించింది.మార్చి 16 న పంజాబ్ ప్రభుత్వం జిమ్‌లు, రెస్టారెంట్లు మొదలైనవాటిని మూసివేయాలని ఆదేశాలు ఇచ్చింది.
మార్చి 19 న  10,12 తరగతుల అన్ని బోర్డు పరీక్షలను వాయిదా వేసింది.మార్చి 20, ప్రజా రవాణాను నిలిపివేసింది.
మార్చి 22 న, పంజాబ్ ప్రభుత్వం అత్యవసర సేవలు మినహాయించి,  2020 మార్చి 31 వరకు రాష్ట్రం పూర్తి లాక్ డౌన్ ప్రకటించింది.మార్చి 23 న పంజాబ్ ప్రభుత్వం ఎటువంటి సడలింపు లేకుండా పంజాబ్ అంతటా పూర్తి కర్ఫ్యూ విధించింది.ఉచిత ఆహారం కోసం పంజాబ్ ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు, సిఎం రిలీఫ్ ఫండ్ నుండి పేదలకు మందులు, COVID-19 ను నియంత్రించే ప్రయత్నాల కోసం మంత్రులు నెల జీతం ఇచ్చారు.పంజాబ్ ముఖ్యమంత్రి రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులందరికీ ₹ 3,000 ఇస్తామని ప్రకటించారు.
రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం  మార్చి 19 న రాజస్థాన్‌లో సెక్షన్ 144 అమలు చేసింది.మార్చి 22 న రాజస్థాన్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజా రవాణా సేవలను నిషేధించింది.
మార్చి 24 న, రాష్ట్రంలో COVID-19 కేసులు 32 దాటిన తరువాత అన్ని ప్రైవేట్ వాహనాలను రోడ్లపై నిషేధించింది.
జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల పాటు ఉచిత రేషన్ ప్రకటించింది.
తమిళనాడు ప్రభుత్వం జనవరి 30 న, చైనా నుండి వచ్చిన 78 మందిని నిర్బంధంలో ఉంచారు.
మార్చి 20 న, తమిళనాడు ప్రభుత్వం కర్ణాటక ,కేరళ,ఆంధ్రప్రదేశ్ లతో తన సరిహద్దులను మార్చి 20 న మార్చి 31 వరకు మూసివేసింది.
మార్చి 21 న, రాష్ట్ర ప్రభుత్వం  10 తరగతి పరీక్షలు  ఏప్రిల్ 14 కి వాయిదా వేసింది.మార్చి 22 న రాష్ట్ర ప్రభుత్వం 'జనతా కర్ఫ్యూ'ను సోమవారం ఉదయం 5 గంటలకు పొడిగించింది.
మార్చి 23 న, సెక్షన్ 144 ను విధించింది.
పాఠశాలల మూసివేత కారణంగా రాష్ట్రంలో 1-9 తరగతి విద్యార్థులకు పరీక్షలు రద్దు చేసి, హాజరు బట్టి పై తరగతికి వెళ్లేలా ముఖ్యమంత్రి కె పళనిస్వామి ప్రకటించారు.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అయిన కొన్ని రోజుల తరువాత, మార్చి 26 న స్విగ్గి , జోమాటో వంటి సేవలను నిషేధించింది.
కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రోజువారీ కూలీ కార్మికులందరికీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ₹ 1,000 ఇస్తామని అని యోగి ఆదిత్యనాథ్ మార్చి 21 న ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మార్చి 23 నుండి పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాలను మార్చి 27 వరకు లాక్ డౌన్ చేశారు.మార్చి 24 న, సాయంత్రం 5 గంటలకు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మొత్తం మార్చి 31 వరకు లాక్ డౌన్ గా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించిందిమాంసం తింటే కరోనా వైరస్ వస్తుందని, ఒక పుకారు సోషల్ మీడియాలోలో వైరల్ అయ్యింది.దీని వలన ట్విట్టర్‌లో "#NoMeat_NoCoronaVirus" ట్విట్టర్‌లో వైరల్ అయింది.
ఈ పుకార్లను అరికట్టడానికి క్షీణిస్తున్న అమ్మకాలను ఎదుర్కోవటానికి, కొన్ని పౌల్ట్రీ పరిశ్రమ సంఘాలు హైదరాబాద్‌లో "చికెన్ అండ్ ఎగ్ మేళా"ను నిర్వహించాయి.
అనేక తెలంగాణ రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో చేయబడిన కొన్ని ఉచిత గుడ్లు, వేయించిన చికెన్లను తిన్నారు.
కరోనా వైరస్ గాలి ద్వారా సోకుతుందని బాగా ప్రచారం జరిగింది.
కానీ అది తప్పుడు సమాచారం అని నిరూపితం అయింది.
మార్చి 16 న,పాఠశాలలు,కళాశాలలను దేశవ్యాప్తంగా మూసి వేస్తున్నట్లు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
కరోనావైరస్ కేసులు పెరగడం చూసి మార్చి 18 న సిబిఎస్‌ఇ పరీక్షా కేంద్రాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
పరీక్ష రాసే విద్యార్థుల మధ్య కనీసం 1 మీటర్ దూరం ఉండాలి.
పరీక్ష హాలులో 24 మంది విద్యార్థులకు కంటే ఎక్కువ ఉండరాదు.పరీక్షా కేంద్రాల గదులు చిన్నవి అయితే, విద్యార్థులను విభజించి వేర్వేరు గదుల్లో రాసే విధంగా ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది.మార్చి 19 న, సిబిఎస్ఇ,జెఇఇ పరీక్షలు 31 మార్చి వరకు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
భారతదేశంలో 2019–20 కరోనావైరస్ మహమ్మారి ఆర్థిక ప్రభావం చాలా తీవ్రంగా ఉంది.
ప్రపంచ బ్యాంక్, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు 2021 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధిరేటుని తగ్గించాయి, 1990లలో జరిగిన భారతదేశ ఆర్ధిక సరళీకరణ తర్వాత మూడు దశాబ్దాలలో నమోదైన గణాంకాలలో అత్యల్పం ఇదే ఐతే, అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా వేస్తున్న 1.21% భారత జిడిపి వృద్ధి 2021-22 ఆర్థిక సంవత్సరానికి మొత్తం జి -20 దేశాలలోకెల్లా అత్యధికం.
హెలికాప్టర్ మనీ విధానంపై చర్చలు వచ్చాయి.
భారత దేశ పర్యటక రంగంపైనా కరోనా ప్రభావం పడింది.
ఈ రంగంలో రూ.5లక్షల కోట్ల విలువైన వ్యాపారం దెబ్బతిందని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి పర్యాటక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
మార్చి 17 న, దేశంలోని చారిత్రక భవనాలన్నీ మార్చి 31 వరకు మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు,ఆగ్రాలో, తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్, ఫతేపూర్ సిక్రీ, మహాతాబ్ బాగ్ సహా స్మారక చిహ్నాలన్ని మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు .
అదే సమయంలో అజంతా ఎల్లోరా గుహలతో సహా 200 కి పైగా చారిత్రక భవనాలను, మూసివేయాలని ఆదేశించారు.246
కరోనా వైరస్ కారణంగా సినిమా మా హాళ్ళను చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మూసివేసాయి.
మార్చి 31 వరకు సినిమాలు ఆపాలని చిత్ర సంస్థలు నిర్ణయించాయి.
లాక్ డౌన్ మే 3 పొడిగించడం తో భారత దేశం లో ఉన్న హాళ్ళను మూసివేసారు.
కరోనా వైరస్‌ ప్రభావంలో మహారాష్ట్రలోని పలు ఆలయాలు మూతపడ్డాయి.
ముంబయిలోని అతి ప్రాచీన సిద్ధివినాయక ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ ట్రస్టు ప్రకటించింది.
మహారాష్ట్రలోని మరో ప్రముఖ ఆలయం తుల్జా భవాని ఆలయం.
మార్చి 17 నుంచి 31 వరకూ ఆలయంలోకి ఎవరికీ ప్రవేశం ఉండదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
మార్చి 19 న, జగన్నాథ్ ఆలయం, మార్చి 31 వరకు సందర్శకుల కోసం మూసివేయబడింది.
అదే రోజు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమలలోని వెంకటేశ్వర ఆలయానికి మార్చి 31 వరకు సందర్శనలను మూసివేసింది.
ఏప్రిల్ 14 న, ప్రధానమంత్రి మోదీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ మే 3 వరకు పొడిగించడం తో మే 3 అన్ని దేవాలయాల దర్శనాలు రద్దు చేశారు.
కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా జరిగే పలు క్రీడల పోటీలను వాయిదా పడ్డాయి.
ఐపీఎల్ తోపాటు క్రికెట్ పోటీలను వాయిదా వేస్తూ బీసీసీఐ, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లు రద్దు చేయబడ్డాయి.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎయిరో ఇండియా ఏప్రిల్ 30 వరకు ఇటలీ, దక్షిణ కొరియా, కువైట్ వెళ్లే విమానాలు రద్దు చేసింది.
ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇజ్రాయిల్, శ్రీలంకకు వెళ్లే విమాన సేవలు తగ్గించింది.
అంతర్జాతీయ విమాన సర్వీసులపైనా కేంద్రం ఆంక్షలు విధించింది.
ఈ నెల 22 నుంచి 29వతేదీ వరకు అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను నిషేధించారు.
మార్చి 14 :ఎసి బోగీల్లో కర్టెన్లు, దుప్పట్లను తొలగించారు.
మార్చి 17 : రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఛార్జీలను రూ.
10 నుండి 50 పెంచినది .23 రైళ్లను రద్దు చేసింది.
మార్చి 22: భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 31 వరకు అన్ని రైల్వే కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
కేవలం గూడ్స్ రైళ్లు మాత్రమే నడుస్తాయని భారతీయ రైల్వే తెలిపింది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బాధితులకు సహకరించేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన హెల్ప్‌లైన్ నంబర్ల జాబితాను కేంద్రం విడుదల చేసింది.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ జాబితా పొందుపరిచారు.
ఢిల్లీలో ఉన్న వారు సహాయం కోసం 011-23978046 ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ : 0866-2410978అరుణాచల్ ప్రదేశ్ : 9436055743అసోం: 6913347770ఛత్తీస్‌గఢ్ : 07712235091ఢిల్లీ : 01122307145హర్యానా: 8558893911జమ్మూ: 01912520982కశ్మీర్: 01942440283కేరళ: 04712552056లడఖ్: 01982256462మధ్యప్రదేశ్ : 0755-2527177మహారాష్ట్ర: 020-26127394నాగాలాండ్: 7005539653ఒడిశా: 9439994859రాజస్థాన్: 01412225624తమిళనాడు: 04429510500త్రిపుర: 03812315879ఉత్తరప్రదేశ్: 18001805145పశ్చిమబెంగాల్: 3323412600అండమాన్ & నికోబోరా : కరోనా వైరస్, కోవిడ్-19 ల గురించి ఐక్యరాజ్యసమితి వారి ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ వెబ్‌సైటులో ఉంచిన వివరాలు చూడండి.