352.txt 5.42 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
దీర్ఘ దృష్టి

https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D%E0%B0%98_%E0%B0%A6%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF

ఈ దృష్టి దోషం గలవారికి దూరం గల వస్తువులు కనబడతాయి.
దగ్గరగా గల వస్తువులను చూడలేరు.
దీనికి కారణం దూరంగా ఉన్న వస్తువుల ప్రతిబింబాలు రెటీనా మీద కాకుండా రెటీనా వెనుక భాగంలో కేంద్రీకరింపబడతాయి.
వీరికి తగిన కుంభాకార కటకములు గలిగిన కళ్ళద్దాలు యిచ్చి దోష నివారణ చేయవచ్చు.
సాధారణంగా మన కన్ను ఒక కెమేరా లా పనిచేస్తుంది.
మనకన్ను ముందు భాగం లో గల గుడ్దు ఒక కుంభాకార కటకం లాగ పనిచేస్తుంది.
వస్తువుల ప్రతిబింబాలు మన కంటి లోని రెటీనా పై పడినపుడు మనకు వస్తువులు కనబడతాయి.
మన శరీరానికి ఏ విధంగా వ్యాయామం అవసరమో కంటికి కూడా వ్యాయామం అవసరం.
మన కంటి ముందు గల కుంభాకారకటకం స్వయంచోదితంగా ఉంటుంది.
అనగా ఆ కటకం నాభ్యాంతరాలను స్వయంగా తానే మార్చుకుంటుంది.
సాధారణంగా 40 సం.
అయినపుడు ఆ కుంభాకార కటకం స్వయంచోదియ తత్వం క్రమంగా తగ్గుతుంది.
ఈ విధంగా తగ్గినపుడు దృష్టి దోషాలు యేర్పడతాయి.దీర్ఘ దృష్టి యేర్పడుటకు కారణం దూరంగా ఉన్న వస్తువుల ప్రతిబింబాలు రెటీనా మీద కాకుండా రెటీనా వెనుక భాగంలో  కేంద్రీకరింపబడతాయి.
ఈ దోషం నివారించుటకు తగిన నాభ్యాంతరం గలిగిన కుంభాకార కటకం గల కళ్ళద్దాలను వాడాలి.ఇలా వాడినపుడు కాంతి కిరణములు రెటీనా పై కేంద్రీకరింపబడి దోషం నివారణ జరుగుతుంది.
దృష్టి దోషంఉన్నవారు అక్షరాస్యులైతే వారికి ఒక చార్టు నందలి వివిధ పరిమాణములు గలిగిన అక్షరాలను చదవమని చెబుతారు.
అందులో చదవలేని వరుసను బట్టి వారు వాడవలసిన కుంభాకార కటక నాభ్యాంతరాన్ని నిర్ణయిస్తారు.
దృష్టి దోషంఉన్నవారు నిరక్షరాస్యులైతే వారికి ఒక చార్టు నందలి వివిధ పరిమాణములు గలిగిన చిత్రాలను చూపి వాటిని రోగిని మూడు వేళ్ళతో చిత్రంలోని బొమ్మలవలె చూపమని చెపుతారు.
వారికి కనబడని చిత్ర వరుసను  వారు వాడవలసిన కుంభాకార కటక నాభ్యాంతరాన్ని నిర్ణయిస్తారు.
ఈపరీక్షను రెండు కళ్ళకు విడి విడి గా చేస్తారు.
రెండు కళ్ళకు ఒకే విధమైన దోషం ఉండవచ్చు లేక ఉండక పోవచ్చు.
దృష్టి దోషం నివారించుటకు వాడే కటకాల నాభాంతర విలువలని "కటక సామర్థ్యం" గా వ్యవహరిస్తారు.
కటక సామర్థ్యము ఆ కటక నాభ్యంతర విలువ (మీటర్లలో) విలోమానికి సమానం.
కటక సామర్థాన్ని డై ఆప్టర్లు లో సూచిస్తారు.
కటక సామర్థ్యం=1/కటక నాభ్యాంతరం(మీటర్లలో)
ఉదా: ఒక వ్యక్తి దృష్టి దోష నివారణకు 25 సెం.మీ నాభ్యాంతరం కల కుంభాకార కటకం అవసరమైతే ఆ కటక సామర్థ్యం 1/0.25 అనగా 4 డై ఆప్టర్లు అవుతుంది.
ఆ వ్యక్తి 4 డై ఆప్టర్ల సామర్థ్యం గల కటకాన్ని తీసుకోవాలి.