357.txt 1.97 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12
రేచీకటి

https://te.wikipedia.org/wiki/%E0%B0%B0%E0%B1%87%E0%B0%9A%E0%B1%80%E0%B0%95%E0%B0%9F%E0%B0%BF

రేచీకటి (Night blindness) ఆహారంలో విటమిన్-A లోపం కారణంగా ఎక్కువగా పిల్లలకు సంభవిస్తున్న వ్యాధి.
కంటిలోని తెల్లపొర ప్రకాశిస్తూ ఉండకుండా, పొడి ఆరిపోయినట్లుగా ఉండును.
కంటి గ్రుడ్డు మీక తెల్లని మచ్చలు కనబడును.
వ్యాధిగ్రస్తులు మసక వెలుతురులో వస్తువులను సరిగా చూడలేరు.
ఇంకా అశ్రద్ధ చేస్తే అంధత్వము కలుగవచ్చును.
విటమిన్ ఎ ఎక్కువగా ఉన్న బొప్పాయి, కారట్, కోడిగ్రుడ్డు, తాజా ఆకుకూరలు, పాలు మొదలైనవి ఆహారంలో సమృద్ధిగా ఇవ్వాలి.
అంధత్వ నిర్మూలన పధకం క్రింద దేశంలోని పిల్లల్ని రేచీకటి నుండి రక్షించడానికి 9 నెలల నుండి 3 సంవత్సరాల వయస్సు పిల్లలకి 6 నెలల కొకసారి విటమిన్ ఎ ద్రావణం నోటిద్వారా ఇస్తున్నారు.
పగలు కనిపిస్తూ రాత్రి సమయానికి అనగా రేయి సమయానికి వెలుతురులో కూడా చీకటిగా ఉండుట వలన ఈ వ్యాధిని రేయి చీకటి అని రేచీకటి అని అంటారు.