364.txt 8.83 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44
అలోపీసీయా ఎరేటా

https://te.wikipedia.org/wiki/%E0%B0%85%E0%B0%B2%E0%B1%8B%E0%B0%AA%E0%B1%80%E0%B0%B8%E0%B1%80%E0%B0%AF%E0%B0%BE_%E0%B0%8E%E0%B0%B0%E0%B1%87%E0%B0%9F%E0%B0%BE

అలోపీసియా ఎరేటా (ఎ.ఎ.)
అనే వ్యాధిని సాధారణంగా జుట్టు రాలుట లేదా బట్టతల అని పిలుస్తారు.
ఇది వంశ పారంపర్యంగా వచ్చే సహజ సిద్ధ నిరోధక శక్తిని తగ్గించే వ్యాధి అని చెప్పవచ్చు.
శరీరం తనను తాను రక్షించుకోగలిగే శక్తిని కోల్పోయినప్పుడు తల పై ఉండే జుట్టు రాలిపోతుంటుంది.
చాలా సార్లు తలపై అక్కడక్కడ బట్టతల తో కూడిన మచ్చలు ఏర్పడుతాయి.
1–2% కేసుల్లో ఈ పరిస్థితి తల అంతా విస్తరించి పూర్తి స్థాయి బట్ట తల(అలోపీసియా టోటలైస్) కు దారి తీస్తుంది.
లేదా మొత్తం బాహ్య చర్మం (అలోపీసియా యునివర్సలైస్)కు విస్తరిస్తుంది.
సాధారణంగా అలోపీసీయా ఎరేటా (బట్టతల) జుట్టు రాలుతూ తలపై ఒకటి, రెండు గుండ్రటి మచ్చలు ఏర్పడుతాయి.
తలపై మచ్చలు అన్ని వైపులా విస్తరిస్తూ జుట్టు ఊడిపోవడాన్ని డిఫ్యూజ్ అలోపీసీయా ఎరేటా అంటారు.
ఒకే మచ్చతో ఆగిపోయే వ్యాధిని అలోపీసీయా ఎరేటా మోనోలోక్యూలరైస్ అంటారు.
తలపై ఎక్కువ చోట్ల జుట్టు ఊడిపేతే దాన్ని అలోపీసీయా ఎరేటా మల్టీలోక్యులరైస్ అంటారు.
ఒపియాసిస్ అనేది తల చుట్టూ జుట్టు తెల్లబడి, ఒక తరంగం ఆకృతిలో మచ్చలు ఏర్పరిచే వ్యాధి.
గడ్డానికే పరిమితమయితే ఈ వ్యాధిని అలోపీసీయా ఎరేటా బార్బే అంటారు.
రోగిపై తల పై ఉన్న జుట్టంతా ఊడిపోతే ఆ వ్యాధిని అలోపేసియా టోటలైస్ అంటారు.
శరీరంపై ఉండే అన్ని భాగాల్లోని జుట్టంతా ఊడిపోయే వ్యాధిని అలోపేసియా యునివర్సలైస్ అంటారు.
అలోపీసీయా ఎరేటా టోటలైస్, యునివర్సలైస్ అనే వ్యాధి చాలా అరుదుగా ఉంటుంది.
జుట్టు రాలడం అనేది కొన్ని సార్లు హార్మోన్ల మార్పుల వల్ల కూడా జరుగుతుంది.
తలపై ఎక్కువ మొత్తంలో జుట్టు ఊడిపోయి బట్టతల లక్షణాలు కనిపిస్తాయి.
ఇది ప్రాణాంతకమైన వ్యాధి కానప్పటికీ, మానసిక ఆందోళనకు ఇది దారి తీస్తుంది.
అలోపీసీయా ఎరేటా: ఈ వ్యాధి ప్రాథమిక లక్షణం తలపై అక్కడక్కడ గుండ్రగా జుట్టు ఊడిపోయి పలచటి బట్టతల ఏర్పడుతుంది.
తలలో అక్కడక్కడ అతుకుల్లాగా ఏర్పడుతాయి.
సాధారణంగా గుండ్రగా లేదా అండాకృతిలో ఈ మచ్చలు వస్తాయి.
ఈ వ్యాధి ఎక్కువగా తలపై, గడ్డంపై ఉండే జుట్టుపై ప్రభావం చూపుతుంది.
జుట్టు ఉండే మిగతా శరీర భాగాల్లోను ఇది రావచ్చు.
అలోపీసీయా ఎరేటా (బట్టతల) వ్యాధిని సాధారణంగా వైద్య పరీక్షల ద్వారా మాత్రమే నిర్ధారిస్తారు.
ట్రైకోస్కోపీ విధానంలో ఈ వ్యాధిని గుర్తిస్తారు.
చాలా అరుదుగా బయాప్సీ తోనూ ఈ వ్యాధి నిర్ధారిస్తారు.
హిస్టోలాజిక్ , పెరిబుల్ బార్ లింపోసైటిక్ ఇన్ ఫిల్ట్రేట్ , పిగ్మెంట్ ఇన్ కాంటినెన్స్ , ఫోలీక్యులర్ స్టీలే వంటి పలు పరీక్షలు అవసరాన్ని బట్టి నిర్వహించి అలోపీసీయా ఎరేటా వ్యాధి ని నిర్ధారిస్తారు.
అలోపీసీయా ఎరేటా అనేది అంటువ్యాధి కాదు.
ఈ వ్యాధి ఎక్కువగా వంశపారంపర్యం జన్యుసంబంధ కారణంగా రావచ్చు.
జన్యుశాస్త్ర నిపుణులు జరిపిన పరిశోధనల ప్రకారం ఈ వ్యాధి ఉన్న కుటుంబాల్లో ఒకరిద్దరి సభ్యులకు అలోపీసీయా ఎరేటా ఉన్నట్లు గుర్తించారు.
ఎక్కువగా ఇది 15 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల స్త్రీ, పురుషులిద్దరిలోనూ కనిపిస్తుంది.
ఇవే గాక హర్మొన్ల అసమతుల్యత, ప్రొటీన్ల లొపం, మానసిక వత్తిడి లాంటి ఇతర కారణాలు కూడా ఉంటాయి.
కొంతమేర మాత్రమే జుట్టు ఊడిపోతే వెంటనే చికిత్స తీసుకుంటే తిరిగి జుట్టు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అయితే జుట్టు రాలడం ఎక్కువైతే మాత్రం క్రిటికో స్టెరాయిడ్స్ ఇంజక్షన్లు వాడాల్సి రావచ్చు.
వ్యాధి తీవ్రత, అవసరాన్ని బట్టి రక రకాల మందులు, ఇంజక్షన్ల ద్వారా వ్యాధిని తగ్గించే అవకాశాలుంటాయి.
చాలా వరకు కేసుల్లో కొద్ది గా తలపై జుట్టు ఊడిపోయి మచ్చలు ఏర్పడితే వాటికి సకాలంలో చికిత్స అందించి కొద్ది నెలలు లేదా ఏడాది లోగా తిరగి జుట్టు మొలిచేలా చేయవచ్చు.
చాలా మొత్తంలో జుట్టు రాలిన మచ్చలుంటే మాత్రం ఇది ఏఏ టోటలైజ్ లేదా ఏఏ యునివర్సలైజ్ గా మారవచ్చు.
ఇలాంటి పరిస్థితి 0.1%–0.2% ఆడ, మగ వారిలో ఏర్పడుతుంది.. ఈ వ్యాధి గ్రస్తులు పైకి ఎంతో ఆరోగ్యంగా, ఎలాంటి చర్మవ్యాధులు లేకుండా కనిపిస్తారు.
ఈ వ్యాధి భారిన పడివారిలో రోగ నిరోధక శక్తి తగ్గి పోయి అస్తమా, అలర్జీలు వంటి ఇతర రుగ్మతలు వచ్చే అవకాశాలుంటాయి.