365.txt 2.61 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18
ఇక్థియోసిస్ వల్గారిస్

https://te.wikipedia.org/wiki/%E0%B0%87%E0%B0%95%E0%B1%8D%E0%B0%A5%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%B8%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D_%E0%B0%B5%E0%B0%B2%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D

ఇక్థియోసిస్ వల్గారిస్ (Ichthyosis vulgaris) అనునది వంశ పారంపర్యంగా సంక్రమించు చర్మ సంబంధ అసాధారణ స్థితి.
ఈ వ్యాధి ఉన్నవారి చర్మం పొడిబారి, పొలుసులుగా విడిపోతుంది.
ప్రతి 250 మందిలో ఒక్కరు దీని బారిన పడతారు.
తల్లిదండ్రులలో ఎవరి ద్వారా నైనా ఒక అసాధారణ జన్యువు సంక్రమించటంతో ఈ వ్యాధి సోకుతుంది.
ఈ వ్యాధి ప్రాణాంతకం కాదు.
చాలా తక్కువగా దురద ఉండటం, శరీరం కనిపించే లాగా బట్టలు వేసుకోలేకపోవటం తప్పితే వేరే ఎటువంటి హాని ఉండదు.
స్వేదం ఈ వ్యాధి తీవ్రతని తగ్గించటం మూలాన, తేమ వాతావరణం ఉన్న ప్రదేశాలు వ్యాధిగ్రస్తులకి క్షేమం.
ఎయిర్-కండిషన్, మద్యం దీని తీవ్రతని పెంచవచ్చును.
మాయిశ్చరైజింగ్ క్రీములు, లోషన్ లు, స్నోలు వాడాలి
మరీ వేడినీటితో కాకుండా, గోరువెచ్చటి నీటితో మాత్రమే స్నానం చేయాలి (చలికాలంలో కూడా).
స్నానం చేసి, తువ్వాలుతో తుడుచుకొన్న వెంటనే, ఆ తడి ఆరక ముందే, క్రీము రాయాలి.
ప్యారాఫిన్ మైనం గల క్రీములు శ్రేయస్కరం.
(ఉదా: వ్యాజ్లిన్).
వీటివల్ల జిడ్డు ఎక్కువగా ఉంటే ఎమోలియంట్, హ్యూమెక్టెంట్, కెరటాలిటిక్ క్రీములు వాడాలి.