గజ్జిhttps://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9C%E0%B0%BFగజ్జి (ఆంగ్లం: Scabies) ఒక విధమైన పరాన్న జీవి వలన కలిగే అంటు వ్యాధి.ఇది చర్మంలో సొరంగాలు చేసి దాని మూలంగా విపరీతమైన దురద, పుండ్లు, వాపు కలుగుతుంది.ఈ పరాన్న జీవి పేరు "సార్కాప్టిస్ స్కేబీ" (Sarcoptes scabei).స్కేబీస్ అనే పదం లాటిన్ స్కేబెర్ అనగా గోకడం నుండి వచ్చింది.సార్కాప్టిస్ స్కేబీ కొన్ని జంతువులలో, మనుషులలో గజ్జి వ్యాధిని కలుగజేస్తుంది.ఇవి ఒకవిధమైన పరాన్నజీవి కీటకాలు.ఇవి కంటికి కనిపించనంత సూక్ష్మంగా 0.3-0.4 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటాయి.ఇవి చర్మంలోని పల్చని పైపొర (స్ట్రేటమ్ కార్నియమ్) క్రిందనే ఉండి అక్కడ 2-3 మి.మీ.బొరియల్లాంటివి ఏర్పరచి వాటిలో గుడ్లు పెడుతుంది.చర్మంపై వీటి జీవిత చక్ర కాలం (life cycle) రెండు వారాలు మాత్రమే ఉండవచ్చును.స్కేబీస్‌తో బాధపడే వ్యక్తి శరీరంపై ఒక డజన్ కంటే ఎక్కువ ఈ విధమైన క్రిములు ఉండవు.అరుదుగా ఒక రకమైన నార్వీజియన్ స్కేబీస్ (Norwegian scabies) లో వీటి సంఖ్య లక్షల్లో ఉండవచ్చును.ఇవి ఎయిడ్స్, మధుమేహం మొదలైన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది.చర్మం లోపలికి తొలుచుకుపోయి ఈ క్రిములు పెట్టే గ్రుడ్ల వలన చాలా తీవ్రమైన ఎలర్జీ సంభవిస్తుంది.కాని వీటి కారణంగా కలిగే తీవ్రమైన దురద కారణంగా చర్మాన్ని గోకడం వలన మరింత బాధ కలుగుతుంది.గోకడం వలన చర్మంపై బాక్టీరియా చేరి గజ్జికి కారణం అవుతుంది.ఈ క్రిములు పందులలో ఎక్కువగా ఉంటాయి.బెంజైల్ బెంజయేట్ (Benzyl Benzoate) అనే లోషను లేదా క్రీము ముఖము తప్పించి ఒళ్ళంతా రాసుకొని రాత్రంతా అలాగే ఉంచుకొని ఉదయాన్నే శుభ్రంగా స్నానం చేయాలి.American Academy of Dermatology pamphlet on ScabiesScabies FAQ from the National Pediculosis Associationవేప నునెతో గజ్జి నివరణ