369.txt 2.48 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
చర్మశిలీంద్రాలు

https://te.wikipedia.org/wiki/%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B2%E0%B1%80%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81

చర్మశిలీంద్రాలు (ఆంగ్లం Dermatophytes) చర్మానికి వ్యాధుల్ని సంక్రమింపజేసే శిలీంద్రాలు (Fungi).
వీనిలో అసంపూర్ణ శిలీంద్రాలు (Imperfect fungi) అయిన ఎపిడెర్మోఫైటాన్ (Epidermophyton), మైక్రోస్పోరమ్ (Microsporum), ట్రైకోఫైటాన్ (Trichophyton) ప్రజాతులు ఉన్నవి.
చర్మశిలీంధ్రాలకు Dermatophytes పేరు గ్రీకు భాషలోని చర్మపు మొక్కలు అనే అర్ధంతో ఏర్పడింది.
ఈ మూడు రకాల శిలీంధ్రాలు చాలా సాధారణమైన మనుషులలోను, జంతువులలోను చర్మవ్యాధుల్ని కలుగజేస్తాయి.
వీనిలో సుమారు 40 జాతులున్నాయి.
చర్మశిలీంద్రాలు చర్మం, వెండ్రుకలు, గోర్లకు వ్యాధుల్ని కలుగజేస్తాయి.
ఈ వ్యాధుల్ని శిలీంధ్ర చర్మవ్యాధులు (Dermatophytosis) అంటారు.
వీటిలోని కెరటిన్ (keratin) నుండి ఆహారాన్ని స్వీకరిస్తాయి.
అతిథేయి (Host) యొక్క ప్రతిచర్య మూలంగా ఇన్ఫ్లమేషన్ మొదలౌతుంది.
అయితే ఇవి కణజాలాలకు నష్టం కలిగించవు; ఎందుకంటే ఇవి ఆరోగ్యవంతుడైన వ్యక్తి చర్మాన్ని ఛేదించలేవు.
ఈ చర్మవ్యాధులలో కొన్ని ముఖ్యమైనవి తామర (Ringworm) or టీనియా (Tinea).
కాలు లేదా చేతి గోరుకు కలిగే వ్యాధిని శిలీంధ్ర గోరువ్యాధులు (Onychomycosis) అంటారు.