ప్రపంచ లూపస్ దినంhttps://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A_%E0%B0%B2%E0%B1%82%E0%B0%AA%E0%B0%B8%E0%B1%8D_%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A8%E0%B0%82ప్రపంచ లూపస్ దినం (ఆగ్లం: World Lupus Day) అనేది నివారణలేని లూపస్ అనే చర్మవ్యాధిపై ప్రజలలో అవగాహన పెంచేందుకు ఏటా మే 10వ తేదీన జరుపుకునే కార్యక్రమం.ప్రపంచ లూపస్ దినోత్సవాన్ని మొదటిసారిగా 2004లో లూపస్ కెనడా రూపొందించింది.అంతగా తెలియని ఈ వ్యాధి బాధితులు మరియు వారి కుటుంబాలపై వినాశకరమైన ప్రభావాలను చూపుతుంది.అందుకని, దీని పరిశోధన కోసం నిధులను సమీకరించడానికి, మెరుగైన సేవలను రోగులకు అందించడానికి, ఎపిడెమియోలాజికల్ డేటాను పెంచడానికి మరియు వ్యాధిపై అవగాహన కలిగించడానికి ప్రతీయేడు మే 10న ప్రపంచ లూపస్ దినం జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.లూపస్ నివారణలేని చర్మవ్యాధి.దీనిని సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ (ఎస్‌ఎల్‌ఈ) అని కూడా అంటారు.లూపస్ అనేది మన వ్యాధి నిరోధక వ్యవస్థ మనపైనే దాడి చేయడం వల్ల వచ్చే జబ్బు.ఈ ఆటో ఇమ్యూన్ జబ్బు శరీరాన్ని చికాకు పెట్టేస్తుంది.ఇది దీర్ఘకాలిక అంటువ్యాధి.అలసట, నీరసం, కీళ్లలో వాపు, తరచూ తలనొప్పి ఈ లూపస్ వ్యాధి లక్షణాలు.లూపస్ వ్యాధికి కారణం వ్యాధి నిరోధక శక్తిని అందించే కణాలపై అంతర్గత దాడి.అయితే మిగతా ఆటో ఇమ్యూన్ వ్యాధులకు లూప్‌సకు తేడా ఉంది.మిగిలినవన్ని ఏదో ఒక అవయానికి పరిమితమైతే లూపస్ మాత్రం శరీరంలోని చాలా వ్యవస్థలకు విస్తరిస్తుంది.లూపస్ రోగుల్లో అత్యధిక శాతం మహిళలు ఉంటారు.ఈ వ్యాధి వంశపారపర్యంగా రాదు కానీ తల్లిదండ్రుల నుంచి కొన్ని జన్యువుల వల్ల వస్తుంది.17 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉన్న వారికి ఇది సోకే ప్రమాదమెక్కువ.లూపస్ ఒక చర్మవ్యాధి.ఈ వ్యాధికి ప్రాథమిక దశలో చికిత్స అవసరం.లేదంటే శరీరంలోని అనేక అవయవాలపై ప్రభావం పడుతుంది.అందుకని ఈ వ్యాధిని గుర్తించడంలో ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.