క్లోమ క్రోధంhttps://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B%E0%B0%AE_%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8B%E0%B0%A7%E0%B0%82క్లోమము వాపు లేదా క్లోమ క్రోధం లేదా పాంక్రియాటైటిస్ (ఆంగ్లం: Pancreatitis) అనేది సాధారణంగా క్లోమ రసాలు బయటకు రాకముందే గ్రంధిలోనే క్రియాశీలమై, తమను ఉత్పత్తి చేసిన క్లోమాన్ని, క్లోమ కణాలను హరించడం వలన కలిగే వ్యాధి.దాని మూలంగా క్లోమం ఆగ్రహించినట్లుగా వాచిపోతుంది.కొన్ని సార్లు ఇది అకస్మాత్తుగా ప్రారంభమై తీవ్రమైన కడుపు నొప్పిని కలిగిస్తుంది.దీనిని 'అక్యూట్ పాంక్రియాటైటిస్' (Acute Pancreatitis) అంటారు.మరికొన్ని సార్లు ఇది క్రమేపీ పెరుగుతూ దీర్ఘకాలం వేదిస్తుంది.దీనిని 'క్రానిక్ పాంక్రియాటైటిస్' (Chronic Pancreatitis) అంటారు.రకరకాల పాంక్రియాటైటిస్ కోసం వైద్యం వేరువేరుగా ఉంటుంది.ఎక్యూట్ పాంక్రియాటైటిస్ అకస్మాత్తుగా తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులతో వచ్చే వ్యాధి.క్రానిక్ పాంక్రియాటైటిస్ క్లోమపు వాపు చాలా కాలంగా తెలిసిగాని, తెలియకగాని కొనసాగే దీర్ఘకాల వ్యాధి.దీనిలో తగ్గకుండా ఉండే కడుపు నొప్పితో సహా మధుమేహం లేదా మలంలో కొవ్వు పోవడం కూడా జరుగుతుంది.క్లోమ క్రోధానికి ప్రధానమైన కారణం పిత్తాశయంలో రాళ్ళు.అధికంగా మధ్యాన్ని సేవించడం రెండవ కారణం.రక్తంలో ట్రైగ్లిజరైడ్లు అధికం కావడం, కొన్ని వైరస్ వ్యాధులు, కొన్ని మందులు, ప్రమాదాలు మొదలైనవి కూడా అరుదుగా కారణం కావచ్చును.