4.txt 3.17 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17
ఆరోగ్యశ్రీ

https://te.wikipedia.org/wiki/%E0%B0%86%E0%B0%B0%E0%B1%8B%E0%B0%97%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80

ఆరోగ్యశ్రీ అనునది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు చెందిన ఒక ప్రజారోగ్య కార్యక్రమం.
ఈ పథకాన్ని 2007 ఏప్రిల్ 1 న రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో అప్పటి ముఖ్యమంత్రి వై.యస్.
రాజశేఖరరెడ్డి ప్రారంభించారు.
2014లో ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ నందమూరి తారకరామారావు ఆరోగ్య సేవగా పేరు మార్చింది.
ఈ ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య బీమా పథంకంగా గుర్తింపు పొందింది.
ఈ పథకం కింద అర్హులైన పేద రోగులకు ఉచితంగా వైద్య సేవలందిస్తారు (వైద్య సేవలందించడంతో పాటు రవాణా, భోజన, వసతి సదుపాయాలను కల్పిస్తారు.).
ఈ పథకం ద్వారా 2014 సెప్టెంబరు నాటికి 26 లక్షల మంది పేద రోగులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేశారు.
ఈ పథకం కింద 1038 (పైగా) జబ్బులకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందించబడుతున్నాయి.
ముఖ్యంగా ఈ పథకం ప్రజారోగ్యమే ప్రధాన ఉద్దేశంగా ఉచిత సేవలు అందిస్తూ ప్రజలు చెడు అలవాట్ల వైపు మరలకుండా చెడు అలవాట్ల ద్వారా కొనితెచ్చుకొనే కొన్ని రోగాలకు ఉచిత సేవలను అందించడం లేదు.
పిల్లలు పుట్టకుండా
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.2.5 లక్షల వరకు వర్తింప చేస్తున్నారు.
ప్రభుత్వం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేదవారికి ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేస్తుంది.
ఈ కార్డుల ద్వారా ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నమోదై ఉచిత వైద్య సేవలను పొందవచ్చు.