407.txt 2.61 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్

https://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF%E0%B0%AA%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D_%E0%B0%AA%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B8%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF%E0%B0%9F%E0%B1%80_%E0%B0%A1%E0%B0%BF%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A1%E0%B0%B0%E0%B1%8D

ఒకే వ్యక్తిలో భిన్న వ్యక్తిత్వాలు నిగూఢమై ఉండి, పరిసరాలని ఒక్కొక్క వ్యక్తిత్వం ఒక్కొక్క విధంగా గ్రహించి, వేర్వేరు విధాలుగా స్పందించే మానసిక అసహజ స్థితి.
దీనినే స్ప్లిట్ పర్సనాలిటీ అనీ, డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ అనీ అంటారు.
ఒకే వ్యక్తిలోని ఈ భిన్న వ్యక్తిత్వాలని ఆల్టర్ ఈగోలు అంటారు.
ఏ మాదకద్రవ్యాలు/ఔషధాలు ఉపయోగించకుండానే ఒక్కరి ప్రవర్తనని కనీసం రెండు వ్యక్తిత్వాలు తరచుగా శాసించడంతో బాటు ఆ వ్యక్తిత్వాలు అతనిలో చురుకుగా ఉన్నప్పుడు సాధారణ స్థాయి కన్నా ఎక్కువగా మతిమరపు ఉండటం ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు.
ఈ వ్యాధి పై చాలా వివాదం ఉంది.
కొందరు అసలు ఈ వ్యాధి లేదనీ, మరికొందరు ఈ వ్యాధి ఉండటం కొంత వరకు నిజమైననూ అది కేవలం కొన్ని ఔషధాల దుష్ఫలితాల వల్లనే అని వాదిస్తారు.
సిడ్నీ షెల్డన్ తన నవల టెల్ మీ యువర్ డ్రీమ్స్ని దీని ఆధారంగానే రచించాడు.
విక్రం నటించిన తమిళ చిత్రం అన్నియన్ (తెలుగులో అపరిచితుడు) కూడా దీని ఆధారంగానే చిత్రించారు.
International Society for the Study of Trauma and Dissociation