417.txt 11.1 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70
జి ఎం డైట్

https://te.wikipedia.org/wiki/%E0%B0%9C%E0%B0%BF_%E0%B0%8E%E0%B0%82_%E0%B0%A1%E0%B1%88%E0%B0%9F%E0%B1%8D


వారంరోజుల పాటు మీరు తీసుకునే ఆహారం శరీరానికి ఏమాత్రం అదనపు కాలరీలను ఇవ్వకుండా మీ వంట్లో ఉన్న అదనపు నిల్వలను (కొవ్వు, ప్రొటీన్లను) కరిగించడానికి ఉద్దేశించిన డైట్‌ చార్టు ఇది .ఈ కార్యక్రమాన్ని అమెరికాలోని "జాన్‌హప్‌కిన్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌" రూపొందించింది.
ప్రయోగాత్మకంగా నిరూపణ చేసిన పద్ధతి.
ఇది అమెరికన్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డిఎ) ఆమోదం పొందింది.
ఇది జనరల్ మొటార్స్ వారిచే సమర్పించబడినది .
ఇది ఎడురోజుల ఆహార ప్రణాళిక.
వారంరోజుల పాటు మీరు తీసుకునే ఆహారం శరీరానికి ఏమాత్రం అదనపు కాలరీలను ఇవ్వకుండా మీ వంట్లో ఉన్న అదనపు నిల్వలను (కొవ్వు, ప్రొటీన్లను) కరిగించడానికి ఉద్దేశించిన డైట్‌ చార్టు ఇది.
జనరల్ మొటార్స్ General Motors అను సంస్థ తన ఉద్యోగులలో ఉన్న అధిక బరువు తగ్గించి స్థూలకాయం నిర్మూలించడానికి ఏడు రోజుల ఆహార నియమాలను 1985వ సంవత్సరంలో రూపొందించి విజయం సాధించింది.
అప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఈ ఆహార నియమాలను పాటించి స్థూలకాయాన్ని నియంత్రించుకున్నారు.
ఈ వారం రోజులు 20 నిమిషాలపాటు ఒక మోస్తరు వ్యాయామం అంటే నడక, సైక్లింగ్‌, ఎరోబిక్స్‌, స్విమ్మింగ్‌లాంటి వాటిలో ఏదో ఒకటి చెయ్యాలి.
రోజూ 10 గ్లాసులకు తక్కువ కాకుండా నీళ్ళు తాగాలి.
డయాబిటిస్‌ ఉన్నవాళ్ళు డాక్టరు సలహా తీసుకున్న తర్వాతే దీన్ని పాటించాలి.
లేదంటే ప్రమాదం.
ఈ ఏడు రోజులు మీరు మద్యపానానికి దూరముగా ఉండాలి.
ఇతర సూచనలు: కూరగాయలు సలాడ్ ల రూపంలో కూడా తీసుకోవచ్చు.
ఐతే సలాడ్ తయారు చెయునప్పుడు అందులో ఒక టీ స్పూను కంటే ఎక్కువ నూనెను వాడరాదు.
వండర్ సూప్ లో మీకు క్యాబేజీ ఇష్టం లేకపోతె, మరే ఇతర కూరగాయలను వాడుకోవచ్చును.
అరటిపండు తప్ప అన్నిరకాల తాజా పళ్ళు: ఈ రోజు మీ ఆహారం.
మీకు నచ్చిన అన్నిరకాల పండ్లను తినొచ్చు.
అరటి పండు మాత్రం లేదు.
ప్రత్యేకించి పుచ్చకాయలు, కిరిణికాయలు (కడప దోసకాయలు) ఎక్కువ తింటే మంచిది.
పరిమితి ఏమీ లేదు.
మీ అవసరం మేరకు తినొచ్చు.
పళ్ళను ఆహారంగా తీసుకోవటం వల్ల రా బోయే ఆరు రోజులకు మీ శరీరాన్ని, జీర్ణ వ్యవస్థను సిద్ధం చేస్తున్నారన్న మాట.
మొదటి రోజు పుచ్చ, కర్బూజ వంటి (Melons) పండ్లు మాత్రమే తిన్నట్లయితే మీ బరువు బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది.
అన్నిరకాల కూరగాయలు : ఈ రోజు మీ ఆహారం కేవలం కూరగాయలు మాత్రమే తినాలి.
బ్రేక్‌ఫాస్ట్‌గా ఒక పెద్ద బంగాళ దుంపను ఉడికించి తినటం ద్వారా ఈ రోజును ప్రారంభించండి.
తరువాత బంగాళా దుంప తినొద్దు.
మిగతా కూరగాయలు పచ్చివి కాని, ఉడికించినవి కాని తినొచ్చు.
ఉప్పు, కారం మీ ఇష్టం.
నూనె మాత్రం వాడొద్దు.
ఈ రోజు కూడా పరిమితి అంటూ ఏమీ లేదు.
మీ అవసరం మేరకు తినొచ్చు.ఆలుగడ్డలు తినడం వల్ల మీ శరీరానికి కార్బోహైడ్రేడ్లు అందుతాయి
పళ్ళు, కూరగాయలు : పళ్లలో అరటి పండు, కూరగాయల్లో బంగాళా దుంప తప్ప మిగిలిన పళ్ళు, కూరగాయలు కలిపి తీసుకోండి.
ఈ రోజు కూడా పరిమితి ఏమీ లేదు.
అవసరం మేరకు తినొచ్చు.
ఈ రోజు నుండి మీ శరీరంలో అదనపు కొవ్వు విలువలు కరగటం ప్రారంభిస్తాయి.
8 అరటిపళ్లు, మూడు గ్లాసుల పాలు : నాల్గవరోజు దాదాపు ఆకలి ఉండదు.
రోజంతా హాయిగా గడచి పోవడం గమనిస్తారు.
8 అరటి పళ్ళు తినాల్సిన అవసరం రాక పోవచ్చు.
తగ్గించగలిగితే తగ్గించండి.
(ఒక గ్లాసు 200 మి.లీ.)
పాలల్లో చక్కెర ఎక్కువ ఉండ కూడదు.
ఇంకా అవసరం అనిపిస్తే 100 మి.లీ.
వెజిటబుల్‌ సూప్‌ తాగవచ్చు.
ఈ సూపును  ఒక లీటరు నీటిలో ఆరు ఉల్లిగడ్డలు, రెండు మిరియపు గింజలు, టమాటోలు, క్యాబేజీ వేసుకుని ఉడికించిని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.
ఒక కప్పు అన్నం, 6 టమోటాలు : మీకిది విందు రోజు.
మధ్యాహ్నం ఒక కప్పు అన్నం, దాని లోకి కూరగాయలు లేదా ఆకు కూరతో నూనె లేకుండా వండిన కూరతో తినండి.
ఉదయం టిఫిన్‌గా రెండు టమోటాలు తీసుకోండి.
మిగిలినవి అవసరం అయినప్పుడు తినండి.
కప్పు అన్నం తినొచ్చు కదా ఏమవుతుందని ఇంకాస్త లాగించే పని చేయ వద్దు.
వీలయితే కప్పు కన్నా కాస్త తక్కువే తినండి.ఈరోజు ఆహారం శరీరానికి కావలసిన మాంసక్రుత్తులు (proteins) అందించడానికి ఉద్దేశించబడింది
ఒక కప్పు అన్నం, కూరగాయలు, పళ్ళరసం : రెండవ రోజు తిన్నట్లు పచ్చివి లేదా వండిన కూరగాయలు (బగాళ దుంప మినహా) తీసుకోండి.
అన్నంలోకి కూర 5వ రోజు చెప్పినట్లే.
కూరగాయలకు లిమిట్‌ లేదు.
అయినప్పటికి ఆకలి లేకపోవడం వల్ల రెండవ రోజు తిన్నంత అవసరం లేదు.
ఒక కప్పు అన్నం, కూరగాయలు, పళ్ళరసం: ఆరవరోజులాగే తింటూ, అదనంగా కూరగాయలను కాస్త తగ్గించి, పళ్ళ రసం (చక్కెర లేకుండా) తీసుకోండి.
మధ్యాహ్నం యథా విధిగా ఒక కప్పు లేదా అంత కంటే తక్కువ అన్నం తినండి.
ఇక రేపటి కోసం ఎదురు చూడండి.
ఈ పద్ధతి కచ్చితంగా పాటిస్తే, శరీరం అవసరం మేరకు తింటే, 4 నుండి 5 కేజీల బరువు తగ్గుతారు.
వారం రోజుల పాటు ఈ పద్ధతిని పాటించడం వల్ల ఆ తరువాత కూడా మీకు పెద్దగా ఆకలి ఉండదు.
అంటే ఆకలి స్థాయి తగ్గుతుంది.
కాబట్టి ఇక నుండి మీ ఆహారపు అలవాట్లను పక్కాగా మార్చుకుని పరిమితంగా తింటూ వుంటే మీ బరువు అదుపులో ఉంటుంది.
బరువు పెరగడం అనేది మనిషి తినే ప్రవర్తనకు సంబంధించిన సమస్య.
తిండి విషయంలో మీ ప్రవర్తన మార్చుకోకుండా బరువు తగ్గాలనుకోవడం జరగని పని.
సలహాల కోసం మీ కుటుంబ డాక్టరును లేదా సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించండి.