424.txt 4.53 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25
డీహైడ్రేషన్

https://te.wikipedia.org/wiki/%E0%B0%A1%E0%B1%80%E0%B0%B9%E0%B1%88%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B0%E0%B1%87%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D

డీహైడ్రేషన్ (Dehydration) అంటే శరీరంలోని నీరు బాగా క్షీణించిపోవడం.
దీని వల్ల జీవక్రియ దెబ్బతింటుంది.
దీనినే తెలుగులో జలహరణం అనవచ్చు.
ఇది సాధారణంగా శరీరంలోనికి వెళ్ళే నీటికన్నా బయటికి వెళ్ళే నీరు ఎక్కువైనప్పుడు సంభవిస్తుంది.
మితిమీరిన వ్యాయామం, వ్యాధులు, అత్యంత వేడి వాతావరణం దీనికి ముఖ్యమైన కారణాలు.
వేడి వాతావరణంలో బయట తిరిగితే శరీరం నుంచి నీరు, ఖనిజాలు, లవణాలు చెమట రూపంలో ఎక్కువగా బయటకు వెళ్ళిపోతాయి.
ఇది డీహైడ్రేషన్ కు దారితీస్తుంది.
శరీరంలోని మొత్తం నీటిలో 3-4% ఆవిరైపోయినా మనుష్యుల్లో చాలావరకు తట్టుకోగలరు.
5-8% నష్టం అయితే కళ్ళు తిరగడం, అలసట సంభవిస్తాయి.
నష్టం 10% కి మించితే భౌతికంగా మానసికంగా క్షీణించిపోతారు.
విపరీతమైన దాహం వేస్తుంది.
15-25% నీరు పోతే మరణం సంభవిస్తుంది.
ఒక మాదిరి డీహైడ్రేషన్ అయితే కొంచెం అసౌకర్యంగా, దాహంగా ఉంటుంది.
దీన్ని ఓరల్ రీహైడ్రేషన్ (ప్రత్యేకమైన ద్రవపదార్థాల్ని సేవింపజేయడం) ద్వారా పరిష్కరించవచ్చు.
బాగా దాహం వేయడం, తలనొప్పి, అసౌకర్యంగా అనిపించడం, ఆకలి మందగించడం, మూత్రం తక్కువగా రావడం, మానసికంగా గందరగోళం, ఏ కారణంలేకుండానే అలసటగా ఉండటం, గోళ్ళు ఊదారంగులోకి తిరగడం, మూర్ఛ మొదలైనవి డీహైడ్రేషన్ ప్రధాన చిహ్నాలు.
శరీరంలో నీటి నష్టం ఎక్కువయ్యే కొద్దీ ఈ లక్షణాలు మరింత తీవ్రతరమవుతాయి.
ఎండ, తేమ శాతం ఎక్కువగా ఉన్న వాతావరణంలో ఎక్కువగా తిరిగేవారు, ఎత్తైన ప్రాంతాల్లో నివసించేవారు, శ్రమతో కూడిన పనులు, వ్యాయామాలు, క్రీడల్లో పాల్గొనేవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారు డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కొన్ని రకాల మందుల వాడకం ద్వారా కూడా డీహైడ్రేషన్కు గురి కావచ్చు.
సాధారణ స్థాయిలో పనిచేస్తున్నపుడు దాహం వేసినప్పుడల్లా నీరు త్రాగుతుంటే డీహైడ్రేషన్ రాకుండా చూసుకోవచ్చు.
కనీసం ఎంత నీరు తీసుకోవాలి అనేది సదరు వ్యక్తి బరువుపైన, వాతావరణంపైన, తీసుకునే ఆహారంపైన, జన్యులక్షణాల మీద ఆధారపడి ఉంటుంది.
Definition of dehydration by the U.S. National Institutes of Health's MedlinePlus medical encyclopedia