426.txt 2.07 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12
గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్

https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A8%E0%B0%AE%E0%B1%86%E0%B0%82%E0%B0%9F%E0%B1%8D_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8B%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE_%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BF%E0%B0%9F%E0%B0%B2%E0%B1%8D

గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్ (గోషా హాస్పిటల్), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరంలో తొలి మహిళా, పిల్లల హాస్పిటల్.
శతాబ్దానికి పైగా సేవలందించిన ఈ హాస్పిటల్ విశాఖపట్నంలోని చెంగల్ రావు పేట ప్రాంతంలో ఉంది.
1894లో రాజా గోదాయ్ నారాయణ గజపతి రావు ఈ హాస్పిటల్ నిర్మించడంకోసం భూమిని కొనుగోలు చేశాడు.
ఈ హాస్పిటల్ ప్రారంభ రోజుల్లో హిల్డా మేరీ లాజరస్ చేత నడుపబడేది.
హాస్పిటల్ ని స్థాపించడానికి బ్రిటన్ రాణి విక్టోరియా నుండి అనుమతి వచ్చినందుకు హాస్పిటల్ పేరును విక్టోరియా హాస్పిటల్ గా మార్చారు.
1949లో ఈ హాస్పిటల్ మద్రాస్ ప్రభుత్వ పరిధిలోకి వచ్చింది.
ప్రస్తుతం ఈ హాస్పిటల్ లో 200 పడకలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 100 పడకలతో దీనిని విస్తరిస్తోంది.