448.txt 2.59 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23
పద్మాసనం

https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%82

పద్మాసనము (సంస్కృతం: पद्मसन) యోగాలో ఒక విధమైన ఆసనము.
రెండు రేకులుగల పద్మాన్ని పోలి ఉండటం వల్ల దీనికి పద్మాసనమని పేరువచ్చింది.పద్మాసనము వేయలేనివారు, అర్ధ పద్మాసనం వేసుకొనవచ్చును.
మొదట రెండు కాళ్ళు చాపి నేలపై ఉంచాలి.
తరువాత ఎడమ కాలును కుడి తొడపై, కుడి కాలును ఎడమ తొడపై ఉంచాలి.
రెండు చేతులను మోకాళ్ళపై ఉంచాలి.
చూపుడు వేలును బొటన వేలుకి నడుమ ఆనించి మిగతా మూడు వేళ్ళను ముందుకు చాపి ఉంచితే చిన్ముద్ర అవుతుంది.
ఈ ఆసనంలో ఉన్నప్పుడు భ్రూమధ్య దృష్టిగాని, నాసాగ్ర దృష్టి గాని ఉండాలి.
ధ్యానంలో ఉన్నప్పుడు హృదయస్థానంలో మనస్సును ఏకాగ్రం చేయవచ్చు.పద్మాసనము  ప్రాణాయామం, ధ్యానం చేయుటకు చాలా ఉపయోగకరమైనది.
కుండలినీ శక్తిని జాగృతము చేసి పైకిలేపడానికి ఈ ఆసనం తోర్పడుతుంది.
శారీరక ఫలితాలు:
తొడబాగములోని అనవసర కొవ్వు కరుగుతుంది.
వెన్నెముక బలపడుతుంది.
శ్వాస సంబందిత వ్యాదులు క్రమక్రమముగా నిదానిస్తాయి.మానసిక ఫలితాలు:
ద్యానానికి ఇది అనుకూలమైన ఆసనం.
ఏకాగ్రత కుదురుతుంది.
బుద్ది తీక్షణత పెరుగుతుంది.
ఆయుః ప్రమాణము పెరుగుతుంది.
"పద్మాసనము వలన కలిగే ఫలితాలు ఇవే..!!