456.txt 4.59 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
భుజంగాసనము

https://te.wikipedia.org/wiki/%E0%B0%AD%E0%B1%81%E0%B0%9C%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%AE%E0%B1%81

భుజంగాసనము (సంస్కృతం: भुजङ्गसन) యోగాలో ఒక విధమైన ఆసనము.
సంస్కృతంలో భుజంగ అంటే నాగుపాము అని అర్థం.
ఈ ఆసనం వేసినప్పుడు శరీరం పడగ ఎత్తిన పాము వలె ఉంటుంది కనుక దీనిని భుజంగాసనమని పేరువచ్చింది.
భుజంగాసనం చాలా సులువైన వ్యాయామ రీతిగా చెప్పవచ్చు.
అయితే, దీంట్లో తప్పులు కూడా సునాయాసంగానే చేసే అవకాశముంది.
కాబట్టి ఈ ఆసనం ద్వారా గరిష్ఠ ప్రయోజనాలు పొందడానికి గాను దీని గురించిన వివరాల పట్ల శ్రద్ధ వహించాలి.
విరామ స్థితిలో ఉన్నప్పుడు, నింపాదిగా ఈ భుజంగాసనాన్ని ప్రయత్నిస్తే మంచిది.
ఈ ఆసనం వేసేటప్పుడు మీ వెన్నెముక కండరాలు ఒత్తిడికి గురికారాదు.
అలాగే ఆసనాన్ని త్వరత్వరగాను, ఉన్నట్లుండి కూడా వేయడానికి ప్రయత్నించరాదు.
భుజంగాసనాన్ని శలభాసనము, ధనురాసనాలతో కలిపి వేయాలి, ఈ మూడు ఆసనాలు కలిపి త్రయంగా ఏర్పడతాయి.
ఈ మూడు ఆసనాలూ పరస్పరం అనుసంధానమై ఉంటాయి.
భుజంగాసనానికి వ్యతిరేక భంగిమలు హలాసనంగా, పశ్చిమోత్తాసనంగా రూపు దాలుస్తాయి.
బోర్లా పడుకొని రెండు కాళ్ళు దగ్గరగా ఉంచి నేలమీద ఆనించాలి.
రెండు చేతులను ఛాతీకి దగ్గరగా నేలమీద ఉంచాలి.
కొద్దిగా శ్వాస పీల్చి, తలపైకి ఎత్తి నడుమును వెనుకకు వీలైనంత వరకు వంచాలి.
కొద్ధి క్షణాలు తరువాత మెల్లగా తలను నేలపై ఆనించాలి.
కొద్ది క్షణాలు మకరాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.
రుతుక్రమం సకాలంలో రాకుండా బాధపడుతున్న మహిళలకు భుజంగాసనం ప్రత్యేకించి లబ్ధి చేకూరుస్తుంది.
అండాశయం, మూత్రాశయానికి సంబంధించిన పలు సమస్యలను ఇది నివారిస్తుంది.
గర్భసంచిని, చుట్టుపక్కల ఉన్న కటి ప్రాంతాలను ఇది క్రమబద్ధంగా పనిచేసేలా చూస్తుంది.
పొత్తి కడుపు భాగంలో ఒత్తిడిని పెంచడం ద్వారా ఇది జరుగుతుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు సైతం ఈ ఆసనం వేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.
స్వల్ప రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే భుజంగాసనాన్ని తప్పక వేసి మంచి ఫలితాలు పొందవచ్చు.
పెద్దప్రేగు, పొట్టలోని వాయువును భుజంగాసనం వెలుపలకు నెడుతుంది.
మెడ, వీపుకు సంబంధించిన అన్నిరకాల నొప్పులకు భుజంగాసనం దివ్యంగా పనిచేస్తుంది.